తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పౌర విమానయాన శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి సిఎం భట్టి విక్రమార్కతో కూడిన బృందం ఈరోజు వారిని కలిసింది. ఈసందర్భంగా తెలంగాణలో విమానాశ్రయ అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి విమానాశ్రయానికి కావలసిన భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరితగతిన వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి- రామగుండం, ఆదిలాబాద్లో విమానాశ్రయాలు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల అధ్యయనాల పరిశీలించిన తర్వాత దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పూర్తి సహకారం అందిస్తాం: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read
Previous Articleఅక్కినేని అఖిల్ నిశ్చితార్థం: సంతోషాన్ని పంచుకున్న నాగార్జున
Next Article పట్టాభిషేకం వివాదం… కోటలో రాళ్లదాడి…!