అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని మరో పరిశ్రమ నుండి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబొరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సిఎం ఆదేశించారు.
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం:బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleమళ్లీ లాభాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు
Next Article దేవిశ్రీతో మాకు గొడవల్లేవు: మైత్రి నిర్మాత