ఊరు అన్నక వెజిటేరియన్స్ ఉండడం సహజం.కానీ ఊరంతా శాఖహా రులుగా ఉండడం మనం ఎక్కడా చూసి ఉండము.అవును నిజమే..మన దేశంలోని ఒక గ్రామం ఇలాంటి కట్టుబాటునే అవలంభిస్తుంది.ఇంతకీ ఆ గ్రామం పేరేంటి? వాళ్ళు శాఖాహారులుగా మారడానికి కారణం ఏమిటి?బీహార్లోని గయ జిల్లాలో ఉన్న బిహియాన్ గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది.ఇక్కడి ప్రజలు ఆచరించే సాంస్కృతిక,ఆధ్యాత్మిక ఆచారాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
300 సంవత్సరాల నుండి ఈ గ్రామస్థులు శాకాహారులుగానే కొనసాగుతున్నారు.వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలని వీరు విశ్వసిస్తున్నారు.ఈ ఊరులో పుట్టిన వాళ్ళు,ఉంటున్న వాళ్ళే కాకుండా ఇక్కడి వారిని పెళ్లాడిన యువతులు కూడా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు.