దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా చెప్పుకునే ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్-2025 ను మే 18న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐఐటీ కాన్పుర్ తాజాగా తెలిపింది. జేయియి మెయిన్స్ కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దేశంలోని 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 17,695 బీటెక్ (ఇంజినీరింగ్), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2025-26 విద్యాసంవత్సరంలో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Previous Articleఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం
Next Article జాతీయ దివ్యాంగ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి