నటుడు, జనసేన నేత నాగబాబు తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.పుష్ప చిత్రం కోసం ఎంతోమంది కష్టపడతారని అన్నారు.సినిమాని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.’ 24 క్రాఫ్టల కష్టం..వందల మంది టెక్నీషియన్స్ శ్రమ..
వేల మందికి ఉపాధి కలిగించి,కోట్ల మందిని అలరించేదే సినిమా.ప్రతి చిత్రం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.అందరిని అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని,ప్రతి మెగా అభిమానిని,ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదల అవుతున్న సమయంలో నాగబాబు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Previous Articleపుష్ప 2 మిడ్ నైట్ షో రద్దు
Next Article వైభవంగా నాగచైతన్య-శోభితల వివాహ వేడుక