ఆంధ్రప్రదేశ్ 4 జాతీయ పంచాయితీ అవార్డులను సాధించింది. నాలుగు కేటగిరీలలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మ సముద్రం, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయం పూడి, అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామపంచాయతీలకు పురస్కారాలు దక్కాయి. కాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
మొట్టమొదటి సారిగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ (DDUPSVP) కేటగిరీలో 4 జాతీయ అవార్డులను మన గ్రామ పంచాయతీలు సాధించడం గ్రామ స్వరాజ్ సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలకు నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘనత స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాలు స్వయంసమృద్ధి సాధించే దిశగా, పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ, స్థానిక పరిపాలనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లకు, పంచాయతీ కార్యదర్శులకు, సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు