ఆంధ్రప్రదేశ్ లో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన టైమ్,వెళ్లిన టైమ్ రెండు నమోదు చేయాలని పేర్కొంది.తాజాగా యాప్‌లో మరికొన్ని అప్డేట్స్ చేశారు.ఏపీ ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఉద్యోగులు ఇక నుండి కచ్చితంగా సమయపాలన పాటించాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది.అంతేకాకుండా ఇక అటెండెన్స్ తప్పనిసరి చేసింది.సచివాలయ ఉద్యోగుల దగ్గర ఉండే అటెండన్స్ యాప్‌లో ఉదయం డ్యూటీకి వచ్చినపుడు ఒకసారి…సాయంత్రం ముగించుకొని వెళ్తున్నప్పుడు మరోసారి తప్పని సరి అటెండన్స్ నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ క్రమంలో యాప్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.కొత్తగా GSWS అటెండన్స్ యాప్ వెర్షన్ 2.2.1 లో ఉదయం 10:30 లోపు మాత్రమే అటెండన్స్ తీసుకుంటుందని వెల్లడించారు.అంతేకాదు సాయంత్రం 5 తర్వాత కచ్చితంగా బయోమెట్రిక్ వేయాల్సిందే.అప్పుడే ఫుల్ డే సాలరీ వస్తుందని ఎవరైనా ఉద్యోగి ఉదయం ఒకసారి అటెండెన్స్ వేసి సాయంత్రం వేయకపోతే ఆ రోజు CL గా పరిగణిస్తారని తెలుస్తోంది.