ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ పథకం మెనూను ప్రభుత్వం జోన్లవారీగా మార్చింది. విద్యార్థులకు అన్ని రకాల పోషకాలు అందేలా రూపొందించారు. సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలలలో దీనిని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మెనూను నాలుగు జోన్లుగా స్థానికత ఆధారంగా చేసుకుని ఆహారం అందించనున్నారు. అంటే ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల ఆహారపు అలవాట్లు, ఆసక్తిగా తినే ఆహారం ఆధారంగా రూపొందించారు.
జోన్-1: ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం.
జోన్-2: తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా .
జోన్-3: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం.
జోన్-4లో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం.
Previous Articleఅమరావతిలో పైప్ లైన్లు ద్వారా గ్యాస్ సరఫరా
Next Article సంధ్య థియేటర్ ఘటన సీపీ సీరియస్