మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని నిర్మల ఫార్మశీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నాను. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ. మనమేంటో ఇతరులకు తెలియజెప్పడం. ప్రతిఒక్కరి పట్ల ప్రేమ, శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారని పేర్కొన్నారు. దేవుడు మనకు అనేక పరీక్షలు పెడతాడు. వాటన్నింటిని కృషి, పట్టుదల, కఠోర శ్రమతో అధిగమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
దేవుడు ప్రతిఒక్కరికి శక్తినిస్తాడు. మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలని దేశానికి నువ్వేమి చేశావని గుర్తుంచుకోవాలని కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అకడమిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు లోకేష్ బహుమతులు అందించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు