ఏపీలో కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు తగ్గనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం బేస్ ధర భారీగా పెంచేసిన కంపెనీలు కొన్ని వాటంతటవే తగ్గించుకున్న నేపథ్యంలో ఆయా బ్రాండ్లను బట్టి ధరలు కొంత మేరకు తగ్గనున్నాయి.11 కంపెనీలు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేసిక్ ధర గణనీయంగా తగ్గడంతో క్వార్టర్ పై దాదాపు రూ.30 వరకు తగ్గనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు కొంత తగ్గిన ధరలు ఇప్పుడు మరింత తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుడు లేని కొన్ని బ్రాండెడ్ కంపెనీల మద్యం కూడా అందుబాటులోకి వచ్చింది.
Previous Articleపవన్ కళ్యాణ్ ఒక అద్భుతం: శ్రియా రెడ్డి
Next Article నేడు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు