దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాలి. ఉదయం లాభాల్లో ప్రారంభమై ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్ల మద్దతుతో కొద్దిసేపు నిలకడగా రాణించాయి. అనంతరం క్రమంగా ఇన్వెస్టర్లు ప్రధాన షేర్లలో అమ్మకాలకు ఆసక్తి చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా సూచీలు ఒడిదుడుకులలో పయనించి చివరికి ఫ్లాట్ గా ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 0.39 పాయింట్ల నష్టంతో 78,472 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 22.55 పాయింట్ల లాభంతో 23,750 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.27గా కొనసాగుతోంది. ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్టెల్, అల్ట్రా టెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleవిశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే: ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article అజయ్ మాకెన్ వ్యాఖ్యలపై ఆప్ నేతలు సీరియస్