అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో నేడు ఆసియా స్టాక్ మార్కెట్లపైనా ఆ ప్రతికూల ప్రభావం పడింది. దేశీయ మార్కెట్లపైనా ప్రారంభంలో ఆ ప్రభావం కనిపించినా తర్వాత సూచీలు క్రమంగా కోలుకున్నాయి. నష్టాల నుండి కోలుకుని ఫ్లాట్‌గా ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టంతో 74,102 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 22,460 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.19గా కొనసాగుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నేటి ట్రేడింగ్ లో భారీగా నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకి, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో ముగిశాయి.
నష్టాల నుండి కోలుకుని… ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు..!
By admin1 Min Read