రెండు తెలుగు రాష్ట్రాలలో స్వల్పంగా ఉష్ణోగ్రతలలో పెరుగుదల కనిపిస్తోంది. ఇంకా మార్చి నెల కూడా రానేలేదు. అప్పుడే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటల నుండి ఎండ తీవ్రత కనిపిస్తుంది. ఇళ్లలో కరెంటు పోతే ఉక్కబోత తప్పడం లేదు. ఎండపట్టున పనిచేసే వారికి ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో వుండే రైతులపైనా ఈ ప్రభావం పడుతోంది. దీంతో ఎండ తీవ్రత తగ్గిన తర్వాత ఉదయం, సాయంత్రం వేళల్లో సాగు పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడే ఈవిధంగా ఎండలు ఉంటే వేసవి సీజన్ మధ్యలో మార్చి-ఏప్రిల్ ఆపై మండు వేసవి అయిన మే నెలలో ఇంకేస్థాయిలో ఉంటాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న తెలంగాణలో 35.6 డిగ్రీల నుండి 37.7 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. వేసవి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఏసీ, కూలర్లు వంటి వాటి కొనుగోలుకు సమాయాత్తమవుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు