ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాలలో 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, డి.రామారావు, పి. అశోక్ బాబు, తిరుమలనాయుడు పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. తెలంగాణలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మీర్జా రియాజుల్ హసన్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశంల పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో ఆయా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 10 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవనుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువునిచ్చారు. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
Previous Articleస్వర్ణాంధ్ర విజన్ 2047:మా ప్రభుత్వం పది సూత్రాలు..!
Next Article ఆసక్తికరంగా నాని ‘హిట్-3’ టీజర్