భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు 71శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఎయిర్ పోర్ట్ దేశ రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. నేడు ఆయన భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతికి సంబంధించి జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంబంధిత పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మట్టి పనులు 100% , రన్‌వే పనులు97% , టాక్సీ వే పనులు 92% మరియు రూఫింగ్ పనులు 60% ఇప్పటికే పూర్తయ్యాయి. NDA కూటమి కేవలం 9 నెలల్లో, ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 23% నుండి 71% పూర్తి చేసాము. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది, ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక వృద్ధి రెండింటినీ పెంచుతుందని పేర్కొన్నారు. 2026 నాటికి ఈ ఎయిర్ పోర్ట్ పూర్తవుతుందని తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా పలువురు నేతలు ఉన్నారు.
శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు: పురోగతిని సమీక్షించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read