ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టెక్ దిగ్గజం యాపిల్. ఈ ఫోన్లకు ఉన్న గిరాకీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే తమ ఉత్పత్తుల కోసం యాపిల్ ఎక్కువగా ఎందుకు చైనా పైనే ఆధారపడుతుంది అనే దానికి ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అక్కడ అత్యంత స్కిల్ కలిగిన కార్మికులు ఒకే చోట లభించడం కంపెనీలకు అడ్వాంటేజ్ అని పేర్కొన్నారు. యాపిల్ ఉత్పత్తికి అత్యాధునిక టూల్స్, అత్యంత కచ్చితత్వం అవసరమని పరికరాల వినియోగంలో నిపుణుల విషయంలో చైనా ముందుందని తెలిపారు. అమెరికాతో పోలిస్తే చైనాలో టూలింగ్ నిపుణులు ఎక్కువని తెలిపారు. చైనాలోని తయారీ రంగ నెట్వర్క్ పై యాపిల్ ఆధారపడుతోంది. అదే సమయంలో ఇతర మార్కెట్ల పై కూడా దృష్టి పెడుతోంది. ముఖ్యంగా భారత్ లోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం బలపడుతోంది దీంతో ఇక్కడ ప్లాంట్లను కూడా యాపిల్ బలోపేతం చేస్తోంది.
Previous Articleఓటు బ్యాంకు వైరస్…కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శలు
Next Article చంద్రుని శక్తితో విద్యుత్ తయారీ….!