Author: admin

ఇంటర్నేషనల్ మరియు లీగ్ లు కలిపి మొత్తంగా టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ నిలిచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న SA 20 లీగ్ లో ఎంత కేప్ టౌన్ జట్టుకు రషీద్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా పార్ల్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడంతో 633 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. ఇందులో ఇంటర్నేషనల్ వికెట్లు ఆఫ్ఘనిస్తాన్ తరపున 161 వికెట్లు, దేశవాళీ సహావివిధ లీగ్ లలో 472 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 631 వికెట్లతో ముందుండగా… తాజాగా రషీద్ బ్రావో ను దాటేశాడు. బ్రావో అత్యుత్తమ బౌలర్ అని అతనిని అధిగమించడం గౌరవంగా భావిస్తున్నట్లు రషీద్ పేర్కొన్నాడు.

Read More

యుకిటో హిగాకితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ జపాన్‌లోని అతిపెద్ద షిప్‌బిల్డింగ్ సంస్థ ఇమాబారి షిప్‌బిల్డింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ మిస్టర్ యుకిటో హిగాకి మరియు ప్రముఖ ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అయిన సోజిట్జ్ నుండి మిస్టర్ నిషిమురా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. షిప్‌బిల్డింగ్, గ్రీన్ రీసైక్లింగ్ మరియు షిప్ మెయింటెనెన్స్ యార్డులలో ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న విస్తృత అవకాశాల గురించి చర్చించారు. దేశీయ మరియు ప్రపంచ డిమాండ్‌ అవసరాలకు అనుగుణంగా నౌకానిర్మాణం మరియు గ్రీన్ టెక్నాలజీలలో యువత నైపుణ్యం గురించి కూడా మేము చర్చించాము. మన రాష్ట్రంలో వృద్ధి మరియు ఉపాధిని పెంచే ఫలవంతమైన సహకారాల కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మాడుగుల నాగఫణి శర్మను సత్కరించిన సీఎం ప్రముఖ అవధాని, సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయన్ను సచివాలయానికి ఆహ్వానించి సత్కరించారు. అవధానం బతకాలన్న ఆకాంక్షతో… ఐటీ ఉన్న ప్రాంతంలో…

Read More

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఇదో చారిత్రాత్మక ఘట్టమని ఏపీసీసీ చీఫ్ షర్మిల కొనియాడారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నాం. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలి. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలి. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలి.…

Read More

ఢిల్లీ రైల్ భవన్ లో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రైల్వే బడ్జెట్ లో ఏపికి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించాను. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో డేటా సిటీలకు పెద్దఎత్తున డిమాండ్ రాబోతుంది. ఏఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుండి అనుమతులు సులభతరం చేయాలని లోకేష్ కోరారు.మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా…

Read More

దేశం రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కోటిన్నరకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉంది. మొత్తంగా 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read More

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారని అన్నారు.ఎన్డీఏ అధికారంలోకి రాకముందు ఎల్‌ఈడీ బల్బులను రూ.400కు విక్రయించారని ధరలు రూ.40కి తగ్గేలా డ్రైవ్‌లు నిర్వహించామని పేర్కొన్నారు. ఎల్‌ఈడీ బల్బులు ఇంధనాన్ని ఆదా చేశాయి… దీనివల్ల దేశ ప్రజలకు దాదాపు రూ.20,000 కోట్ల ఆదా అయింది. ఇంతకు ముందు వార్తాపత్రికల్లో స్కామ్‌లు, అవినీతికి సంబంధించిన హెడ్‌లైన్స్ వచ్చేవి… 10 ఏళ్లు గడిచిపోయాయి & కోట్లాది రూపాయలు ఆదా చేసి ప్రజాధనం కోసం వినియోగించాం.. ఆ డబ్బును ‘షీష్‌మహల్‌ కట్టడానికి వినియోగించలేదు. ‘, బదులుగా మేము ఆ డబ్బును దేశాన్ని నిర్మించడానికి ఉపయోగించాము. ఉనికిలో లేని 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులు వివిధ ప్రభుత్వ పథకాలను అందుకున్నారు. మేము అటువంటి నకిలీ పేర్లను తొలగించాము మరియు నిజమైన లబ్ధిదారులకు సౌకర్యాలు అందించాము. స్వాతంత్ర్యం వచ్చిన 75…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. మూడు ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్లను అధికారికంగా ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పులవర్తి రామాంజనేయులు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్ గా కూన రవికుమార్, అంచనాల కమిటీ ఛైర్మన్ గా వేగుళ్ల జోగేశ్వర రావులు నియామకమయ్యారు. ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్లను నియామకం పూర్తైనట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Read More

సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో సుమారు రెండు గంటల పాటు మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈమేరకు ఆమోదం తెలిపిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు. తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.దేశంలోనే మొదటిసారిగా కులగణన చేపట్టిన రాష్ట్రంగా నిలచిందని పకడ్బందీగా సర్వే నిర్వహించి సమాచారం సేకరించినట్లు వివరించారు .కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేస్తుందని పేర్కొన్నారు. కులగణనపై ప్రధానమంత్రిపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

Read More

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక ఈరోజు , భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర నదీ జలాలలో స్నానమాచరించి పూజలు నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాధ్ ఆయనతో పాటు ఉన్నారు. ఈ సారి కుంభమేళాకు మొత్తం మీద 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.‌

Read More

గృహ హింస, వేధింపుల చట్టాలు మహిళలకైనా,పురుషులకైనా ఒకే విధంగా ఉండాలని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ కోరారు.అయితే పురుషుల ఆత్మహత్యలపై నిన్న ఆయన రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2022లో ఆత్మహత్యలతో మరణించిన వారిలో 72 శాతం పురుషులేనని పేర్కొన్నారు.47 వేల మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే 2014 నుండి 2021 మధ్య కాలంలో కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న మగవారి సంఖ్య 10 7.5 శాతం పెరిగిందని చెప్పారు.కాగా ‘గృహ హింస, వేధింపుల నుండి మహిళలను కాపాడటంలో మన చట్టాలు పురోగతి సాధించాయని అన్నారు. ఇటువంటి చట్టాలు పురుషులను రక్షించడానికి లేకపోవడమే ఆందోళనకరమని దినేష్ శర్మ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులకు న్యాయపరమైన, భావోద్వేగ మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More