తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కనివినిఎరుగని రీతిలో టీటీడీ ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో గ్యాలరీల్లో నుండి భక్తులు వాహనసేవలను దర్శించుకుంటున్నారు. ఇప్పటికే లక్షలాది భక్తులు సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్నారు. రథసప్తమి ఉత్సవాలు సందర్భంగా మొదటి మంగళవారానికి బదులుగా రెండవ మంగళవారం ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన టోకెన్లను ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో& తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో జారీ చేయనున్నారు. స్థానికులు ఈ మార్పును గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Author: admin
ఐసీసీ మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకుని భారత్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రపంచ కప్ లో ఆడిన టీమ్ లో నుండి ఐసీసీ ఎంపిక చేసిన టీమ్ లో నలుగురు భారత క్రికెటర్లకు స్థానం లభించింది. మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష, కమలినీ, ఆయుషీ, వైష్ణవి శర్మ లకు చోటు దక్కింది. ఈ టోర్నీలో త్రిష 147 స్ట్రైక్ రేట్ తో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అలాగే బంతితో కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. కమలినీ 143 పరుగులతో రాణించింది. వైష్ణవి (17 వికెట్లు), ఆయుషీ (14 వికెట్లు) భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. కైలా రేనెక్, జెమా బోథా (దక్షిణాఫ్రికా), డేవినా పెరిన్, కేథి జోన్స్ (ఇంగ్లాండ్), కోయ్…
ప్రైవేట్ ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్, అన్ ఎయిడెడ్ కాలేజీల అసోసియేషన్ల ప్రతినిధులతో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. ఇంటర్ కాలేజీలకు అఫ్లియేషన్ జారీలో సమస్యలు ఉన్నాయని, నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగానే ఇంటర్ విద్యార్థులకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. కాలేజీ ట్రాన్స్ ఫర్ విషయంలో అపరాధ రుసుముల భారాన్ని తగ్గించాలి. జూనియర్ కాలేజీల విషయంలో బోర్డు కమిటీలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ నుంచి ఒకరికి స్థానం కల్పించాలని మంత్రి లోకేష్ ని కోరారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అతి తక్కవ జీతాలు అందుతున్నాయని, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుచేసి ఆదుకోవాలని కోరారు. ఇండస్ట్రీస్ తో ఐటీఐలను లింకేజీ చేయాలి. ప్రభుత్వ విభాగాల్లో అప్రెంటిషిఫ్ ను అమలు చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పాలిటెక్నిక్…
సినిమా అభిమానాలు అంత ఎప్పుడూ…ఎప్పుడూ అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్‌ఎస్‌ఎంబీ 29.అయితే దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి,మహేష్ బాబు కలయికలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుందని తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరగనున్నట్లు సమాచారం.తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ తెరపైకి వచ్చింది.ప్రియాంకా చోప్రా షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుందని తెలుస్తుంది.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది ప్రియాంకా చోప్రా.తాజా సమాచారం ప్రకారం స్వల్ప విరామం తీసుకున్నట్లు చెబుతున్నారు.ప్రియాంకా చోప్రా తన సోదరుడు సిద్దార్థ్ చోప్రా వెడ్డింగ్ కోసం ముంబై వెళ్లిందని సమాచారం. అయితే ప్రియాంకా చోప్రా లేనప్పటికీ షూటింగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాజమౌళి మహేష్ బాబుపై వచ్చే ట్రాక్‌ను షూట్ చేస్తున్నాడని సమాచారం.కాగా త్వరలోనే వెడ్డింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగొస్తుందని…ఆ వెంటనే ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆఫ్రికన్…
2024–25 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టిన 31,52,753 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకుగాను రూ.7222.35 కోట్లు చెల్లించినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. రైతులకు నిజమైన భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం ! 5,00,352 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఇదీ… మా ప్రభుత్వం సాధించిన ఘనత అని సంతోషంగా చెబుతున్నాము. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల క్షేమం కోసం అనునిత్యం ఆలోచన చేస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు, ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని నేడు కలిశారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు గారు అన్నారు. సోనూసూద్ తనదైన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ఎందరికో తన సాయాన్ని అందించారు. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో ఆయన చేసిన సేవలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మరిన్ని వందే భారత్ ట్రైన్ లను నడుపుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని అందుకే ఏపీ లో ప్రాజెక్టుల గురించి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని అన్నారు. యూపీఏ ప్రభుత్వం కంటే 11 రెట్లు ఎక్కువగా ఏపీకి నిధులు కేటాయించామన్నారు. రాష్ట్రంలో రూ.84,559 కోట్లతో పలు ప్రాజెక్టులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 1,560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ లు వేసినట్లు చెప్పారు. రైల్వే పనులు వేగంగా జరిగేలా ఏపీ సీఎం చంద్రబాబు సహాకరిస్తున్నారని తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 16 జిల్లాలలో 8 వందే భారత్ ట్రైన్ లు తిరుగుతున్నాయని వాటి సంఖ్య మరింత పెంచుతామని తెలిపారు. అన్ని ట్రైన్ లు 110 కిలో మీటర్ల వేగంతో వెళ్లే విధంగా ట్రాక్ లు…
మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కుటమి నేతలు, స్థానిక ప్రజానీకం మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. జై ముత్యాలమ్మ తల్లి, జై పోతురాజు స్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్థానికులతో కలిసి ఫోటోలు దిగారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సూచీలు జోరు చూపలేకపోయాయి. కెనడా, మెక్సికో నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం చైనాపై 10 శాతం సుంకం విధిస్తూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 23,361 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హిందూస్తాన్ యూనీలివర్ షేర్లు నష్టాలతో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకి షేర్లు లాభాలతో ముగిశాయి.
దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపలేకపోయాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘మేకిన్ ఇండియా ‘ మంచి ఆలోచనే అయితే దానిని అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారని పేర్కొన్నారు. దేశం భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని మనం మాట్లాడేది ఏదైనా యువత గురించే ఉండాలని అన్నారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాం. గత యూపీఏ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి కల్పనలో దేశంలోని యువతకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోయాయని అన్నారు. ఉత్పత్తి రంగంలో మనం నిలదొక్కుకోక పోవడం వల్ల చైనా అందులో మకాం వేసిందన్నారు. ఇప్పటికైనా మనం తయారీ రంగంపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు.
