ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశం వివరాలను వెల్లడించారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించా. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కోరా. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరాను. అనంతపురంలో రక్షణా పరిశ్రమలకు గల అనుకూలతల గురించి రక్షణశాఖా మంత్రికి వివరించాం. ఢిల్లీలో ఉక్కు శాఖా మంత్రిని కలిసి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజ్ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపాం. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వచ్చిన భయమేమీ లేదని ఈసందర్భంగా స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్రమంత్రే తెలిపారు. నిర్వహణ సరిగా లేకే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయని ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో రాజీనే లేదని స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్ట్ కట్టి…
Author: admin
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన హాస్పిటల్స్ లో చికిత్స పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రిఫరల్ హాస్పిటల్స్ ను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత చాలామంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక నుండి తెలంగాణ డీఎంఈ గుర్తించిన హాస్పిటల్స్ లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీటీడీని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి లక్షలాదిగా వచ్చిన భక్తులకు… ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో టీటీడీ సఫలీకృతమైందని చంద్రబాబు పేర్కొన్నారు. పవిత్ర దినాల్లో తిరుమలకు మరింతగా పోటెత్తే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి చక్కని దర్శన భాగ్యం అందించేందుకు టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నట్లు చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
మలేషియాలో ఇటీవల జరిగిన అండర్ -19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కుటుంబ సభ్యులతో కలిసి నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ ఆమెకు ప్రోత్సాహకంగా కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ గారికి, ట్రైనర్ షాలిని గారికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. ఈ వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా వ్యవహరించారు. ఇక బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 312 పాయింట్ల నష్టంతో 78,271 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 23,696 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.41గా కొనసాగుతోంది. టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి షేర్లు లాభాల్లో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు కీలక రంగాల షేర్లు రాణించడంతో సూచీలు దూసుకెళ్లాయి. కెనడా మెక్సికో లపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలపడం మార్కెట్లకు కలిసొచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,397 పాయింట్ల లాభంతో 77,186 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 378 పాయింట్ల లాభంతో 23,739 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.10గా కొనసాగుతోంది. టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్లు అక్రమ వలసలపై కొరడా ఝళిపించారు. కొంతమంది భారతీయులను కూడా అమెరికా నుండి వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. టెక్సాస్ నుండి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సీ-17 ఈరోజు పంజాబ్ లోని అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. వీరిని అవసరమైన తనిఖీలు తర్వాత ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపించనున్నట్లు తెలుస్తోంది. వీరిని అమెరికా నుండి వెనక్కి పంపించే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని విమానాలు భారత్ కు రానున్నట్లు తెలిపారు. అక్రమ వలసదారుల పై ట్రంప్ మొదటి నుండి చాలా కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చర్యలు వేగవంతం చేశారు. ఇక భారత్ కూడా అక్రమ వలసలపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై తమ స్పందనను తెలిపింది.…
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీ లోని ఆయన నివాసంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈసందర్భంగా వారికి లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఎపికి వచ్చేలా సహకరించాలని అడిగారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్ సింగ్ కు వివరించినట్లు లోకేష్ తెలిపారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.కేంద్ర మంత్రులు శ్రీనివాసరాజు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, హారీష్ బాలయోగి, సీఎం రమేష్ తదితరులు…
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.సాంకేతిక కారణాల వలన హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లాల్సిన విమానం రద్దయింది.ఈ మేరకు ప్రయాణికులకు కనీసం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అయితే 4 గంటల పైగా విమానాశ్రయంలోనే ఉన్నామని, అధికారులు ఈ అంశంపై స్పందించడం లేదు అని, విమానం క్యాన్సిల్ అయిన విషయం కూడా తమకు చివరి నిమిషంలో వెల్లడించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చూస్తున్నారు. అయితే వివరాల ప్రకారం 47 మంది ప్రయాణికులతో తిరుపతికి వెళ్లాల్సిన అలియన్స్ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన 91877 విమాన సర్వీసు,విమానంలో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా రద్దయింది. ఈ లోగానే విమానాశ్రయంకు చేరుకున్న ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.కాగా తిరుమల దర్శన సమయం కూడా దాటిపోయిందని ఇంత జరిగిన ఎయిర్పోర్ అధికారులు స్పందించకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో,ఒక విద్యార్థితో మహిళా ప్రొఫెసర్ పూలదండలు మార్చుకొని వివాహమాడిన విషయం నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.ఈ వీడియో పై స్పందించిన వర్సిటీ బృందం విచారణకు పిలుపునిచ్చింది.దాంతోపాటుగా అధికారులు ఆమెను సెలవు పై పంపారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టర్ పార్థకు లేడీ ప్రొఫెసర్ తన రాజీనామా లేఖను పంపారు, తను ఆ బాధ్యతలను కొనసాగించలేనని ఇంకా మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నానని వివరించారు ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం త్వరలో ఆమె రాజీనామా పై నిర్ణయం తీసుకుంది.
