Author: admin

యూపీలోని ప్రయాగ్ రాజ్ జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ఈ మేరకు పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.కాగా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ కలిసి ప్రధాని మోదీ యమునా నదిలో బోటు షికారు చేశారు.అయితే అరైల్ ఘాట్ నుండి సంగం ఘాట్ వారకూ బోటులో ఇరువురు ప్రయాణించారు.అనంతరం సంగంఘాట్ వద్ద నదీ స్నానాలు ఆచరించి గంగమ్మకు ప్రార్థనలు చేశారు.త్రివేణీ సంగమం వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేశారు.ఈ మేరకు సాధు సంతువులతో ప్రయాణి సమావేశం కానున్నారు.మహా కుంభమేళా ఏర్పాట్లపై అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. #WATCH | Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh (Source: ANI/DD) #KumbhOfTogetherness #MahaKumbh2025 pic.twitter.com/kALv40XiAH— ANI (@ANI) February 5, 2025

Read More

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’.ఈ చిత్రానికి నటుడు కమ్ దర్శకుడు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రం లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రలలో నటిస్తున్నారు.అయితే యష్ 19వ చిత్రంగా రూపొందుతోంది.తాజాగా ఈ చిత్రబృందం నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త వినిపిస్తుంది.ప్రస్తుతం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ముగిసిందని సమాచారం. ఈ షూట్ తర్వాత ఈరోజు బెంగళూరు షెడ్యూల్ మొదలైంది. టౌన్లో వేసిన ఓ స్పెషల్ సెట్లో చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి, తారాసుటారియాపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని చెబుతున్నారు.అయితే బ్రదర్-సిస్టర్ కథతో 1970స్ గోవా,…

Read More

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులతో ఆపార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ విధానాలు, పథకాల అమలు తీరు, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈసందర్భంగా చర్చించారు. మార్చి 12న వైసీపీ ఆవిర్భావ కార్యక్రమంతోపాటు ఆ రోజు పార్టీ ఆధ్వర్యంలో ‘ఫీజు పోరు’ ఉన్నందున వైద్య కళాశాలల ప్రైవేటుపరం, వైద్య సీట్ల కుదింపుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజా సమస్యలే ఎజెండాగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలను రూపొందించాలని జగన్ నేతలకు సూచించారు. సంపద సృష్టిస్తానని కబుర్లు చెప్పిన చంద్రబాబు.. కేవలం అప్పులతో కాలం వెల్లదీస్తున్నతీరుని ఎండగట్టాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మోసాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండని పేర్కొన్నారు.

Read More

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి తాజాగా చేస్తున్న చిత్రం ‘తండేల్’.అయితే ఈ మూవీ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది.ఆమె ఇప్పటికే హిందీలో రామాయణ పార్ట్-1, ఏక్న్ చిత్రాలు చేస్తుంది.కాగా సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉండే సాయిపల్లవి తెలుగు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఫిల్మ్ సర్కిల్ వైరల్ అవుతున్న న్యూస్ మేరకు సాయి పల్లవి ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించనుందని సమాచారం.ఈ చిత్రం స్వాతంత్రోద్యమ కాలంలో ఓ సైనికుడి ప్రేమకథగా ‘ఫౌజీ’ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ ఇందులో ప్రభాస్ కు జోడిగా ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది.అయితే కథానుగుణంగా ఈ చిత్రానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని…ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ కీలక పాత్ర కోసం సాయిపల్లవిని దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తుంది.అయితే ఈ అంశంపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Read More

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్యమత ప్రచారం, టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో చైర్మన్ బీఆర్ నాయుడు కీలక చర్యలు చేపట్టారు. టీటీడీ సంస్థలలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. టీటీడీ మహిళ‌ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు మొత్తం 18 మందిని బదిలీ చేశారు. ఇటీవల తిరుమలలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో టీటీడీలో ఉన్నత స్థాయిలో అన్యమతాలకు చెందిన వారు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. టీటీడీలో సంస్కరణలు మొదలు పెట్టింది. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను టీటీడీ రూపొందించింది. వీరిలో టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా…

Read More

యువ కథానాయకుడు నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తండేల్.ఈ చిత్రానికి చందూమొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది.ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ చేసింది.ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.మొదటి వారం రోజులపాటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.75 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.తాజా ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్స్లో టికెట్ ధర రూ.197, మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర రూ.252గా ఉంది.అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ వెసులు బాటు లేకుండా ధరల పెంపు, బెనిఫిట్స్ షోల విషయంలో కఠిన పాలసీని అమలు చేస్తుంది.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.

Read More

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.ఈ మేరకు భారత గడ్డపై చైనా సైన్యం తిష్ట వేసిందని పార్లమెంట్ లో ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార,విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి.రాహుల్ అబద్దాలు చెప్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రీ కిరణ్ రిజుజు విమర్శించారు. అయితే రాహుల్ చరిత్రను,వాస్తవాలను సిగ్గు లేకుండా వక్రీకరించారు.మన దేశాన్ని అపహాస్యం చేయడానికి,మన గణతంత్ర ప్రతిష్ఠను తగ్గించడానికి ప్రయత్నించారని దూబే తన లేఖలో వెల్లడించారు.రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకుంటే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతిపాదించాలని ఆలోచనలో దూబే ఉన్నట్లు సమాచారం.భారత్ కు చెందిన 4 వేల చ.కి.మీ భూమిలో చైనా తిష్ట వేసిందని రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More

ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ఇజ్రాయెల్ -హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకుని అక్కడ ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చేసి అక్కడి ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై నెతన్యాహు స్పందించారు. ఈ నిర్ణయం చరిత్రను మారుస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా, యుద్ధంతో గాజాలో నిరాశ్రయులుగా మారిన పాలస్తీనా ప్రజలకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాను తామే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ ప్రకటన పట్ల…

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది.యూపీలోని మిల్కిపూర్,తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యమైంది.ఎస్సీ రిజర్వ్ స్థానమైన మిల్కిపూర్ నుంచి గత ఎన్నికల్లో అవదేశ్ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.దీనితో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఉపఎన్నిక పోలింగ్ ఈరోజు జరుగుతుంది.నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉన్నారు.10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ..అధికార బీజేపీ, సమాజ్వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

Read More

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుండే ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని ఆయన కోరారు.కాగా ఓటింగ్లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేవారు.

Read More