తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని తెలుగు దేశం దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు ప్రస్తుతం 47 మంది ఉన్నారు. మునికృష్ణకు 26 మంది ఓటు వేయగా… వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది వేశారు . దీంతో మునికృష్ణ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.
Author: admin
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’.ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వేఫేరర్ ఫిల్మ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఇందులో దుల్కర్ కు జోడిగా భాగ్యశ్రీ కథానాయికగా నటిస్తుంది.నిన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.దర్శకుడు ‘1950 మద్రాస్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.అప్పటి మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు, సంక్లిష్టతలకు అద్దం పట్టేలా రూపొందించనున్నారని సమాచారం. దుల్కర్ సల్మాన్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం జాను అందించనున్నారు.
ప్రముఖ ఓటీటీ వేదిక నెటిక్స్ తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ ను ప్రకటించింది.ఈ మేరకు బాలీవుడ్ లో బాంబే బేగమ్స్, ఢిల్లీ క్రైమ్,సాక్రేడ్ గేమ్స్, రానా నాయుడు,కాలాపానీ, హిరామండీ, లాంటి వెబ్ సిరీస్లను రూపొందించింది.అయితే ఇప్పుడు తెలుగులో కూడా కామెడీ వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు సిద్ధమైంది నెట్ ఫ్లిక్స్.సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో ” సూపర్ సుబ్బు ” అనే వెబ్ సిరీస్ రూపొందించింది.ఇందులో సందీప్ కిషన్ పాటుగా బ్రహ్మనందం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.ఈ ఇందులో సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు.ఈ వెబ్ సిరీస్ లో బర్నింగ్ స్టార్ సంపుర్ణేష్ బాబు, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అయితే నరుడా డోనరుడా, టిల్లు స్క్వేర్ చిత్రాల దర్శకుడు మల్లిక్ రామ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.…
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ “అక్క ” .తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.అయితే కీర్తి సురేష్ “బేబీ జాన్” చిత్రం తరువాత వస్తున్నా ప్రాజెక్ట్ ఇది.ఇందులో మరొక ప్రధాన పాత్రల్లో రాధికా ఆప్టే నటిస్తుంది.పెన్నురు కు చెందిన అమ్మాయి తన అక్కలపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనే నేపధ్య కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ ను యశ్ రాజ్ సంస్థ & నెట్ ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.టీజర్ తో పాటుగా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది.కీర్తి సురేష్ లో లేడి డాన్ పాత్రలో కనిపించింది.ఇప్పటికే చిత్రీకరణ పూర్తీ చేసుకున్నట్లు తెలుస్తుంది. https://youtu.be/yZ1S51_DNyI?si=pvEceghir0xllvZ-
లాస్ ఏంజిల్స్ వేదికగా ప్రతిష్టాత్మక 67వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా జరిగింది. ప్రపంచ సంగీత రంగంలో ఈ అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సహా పలువురు ప్రముఖులకు గ్రామీ అవార్డు లభించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ (100) గతేడాది డిసెంబర్ 30న మరణించిన విషయం తెలిసిందే. మరణానంతరం ఆయనను ఈ అవార్డు దక్కింది. ఆయన రచించిన ‘ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్’కు బెస్ట్ ఆడియోబుక్ నేరేషన్ విభాగంలో అవార్డు లభించింది. బియోన్స్ గ్రామీ అవార్డును ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ (కౌబాయ్ కార్టర్) కేటగిరీలో గెలుచుకుని చరిత్రను సృష్టించారు. ఈ అవార్డులలో ఒక నల్లజాతి మహిళ విజేత కావడం గత 50 సంవత్సరాలలో ఇదే తొలిసారి. గ్రామీ అవార్డులు వీరికే: చంద్రికా టాండన్(భారతీయ సంతతికి చెందిన సంగీత విద్వాంసురాలు): ‘త్రివేణి’ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్…
బ్రెజిల్‌లో జరిగిన వేలంలో మన దేశీ ఆవు అయిన నెల్లూరు జాతి (ఒంగోలు జాతి అని కూడా పిలుస్తారు ) ఆవు రికార్డు స్థాయిలో ధర పలికింది. 4.8 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో దాదాపు రూ. 40 కోట్లు. ఈ రేంజ్ లో ధరతో గిన్నిస్ రికార్డులకెక్కింది. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో నిర్వహించిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈభారీ మొత్తానికి కొనుగోలు చేశారు. అత్యధిక వెల పలికిన వియాటినా-19 గోవుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆవు ఇంతకుముందు కూడా పలు రికార్డులు నెలకొల్పింది. కండరాల నిర్మాణం, అత్యంత అరుదైన జన్యువులు కలిగి ఉన్నందుకు గానూ ఇది ‘చాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్’లో ‘మిస్ సౌత్ అమెరికా’ అవార్డు అందుకుంది. ఈ ఆవు అండాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుండడం గమనార్హం. అధిక ఉష్ణోగ్రతా పరిస్థితులను కూడా తట్టుకుని…
మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ విజృంభిస్తోంది.ఫిబ్రవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 149 మంది అనుమానిత కేసులు నమోదయ్యాయి.వారిలో 124 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అధికారికంగా నిర్ధారించారు. జీబీఎస్ అనేది అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి,ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నాడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీనితో కండరాల బలహీనత, కొన్ని సందర్భాల్లో పారాలసిస్‌కి దారి తీయవచ్చు.ఈ వ్యాధితో బాధపడుతున్న 124 మందిలో, 28 మందికి శ్వాస సంబంధిత సమస్యలతో వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది.భారతీయ వైద్య పరిశోధనా మండలి ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తుంది. ఆరోగ్య పరీక్షలలో క్యాంపీలోబ్టర్ జేజుని అనే బ్యాక్టీరియా కొందరి రోగుల మల నమూనాల్లో గుర్తించారు.ముఖ్యంగా పుణే నగరంలో ఈ వ్యాధి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.పుణే నగరంలో 160 నీటి నమూనాలను పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపగా,8 నీటి నమునాల్లో కాలుష్యం ఉన్నట్లు గుర్తించారు.సిన్హగడ్ రోడ్ పరిసర…
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో తొలి నుండి కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది.ఈ చర్యల నేపథ్యంలో, అక్రమంగా అమెరికా వెళ్లిన భారతీయులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపిస్తున్నారు.ఇప్పటికే కొన్ని గంటల క్రితం ఓ విమానం భారత్ కు బయల్దేరింది.అందులో 205 మంది భారతీయులు ఉన్నారని జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి.ఈ తరలింపుకు సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ వినియోగిస్తున్నారు.భారత్‌కు చేరుకోవడానికి సుమారు 24 గంటలు పట్టనుందని సమాచారం. కాగా అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అవలంభిస్తున్న విధానాలపై భారత ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది.తాము అక్రమ వలసలకు వ్యతిరేకమని స్పష్టం చేయడంతో పాటు,ఈ అంశం అనేక రకాల సంఘటిత నేరాల ముడిపడి ఉందని భారత ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు వీసా గడువు ముగిసినా లేదా సరైన ధృవపత్రాలు లేకుండా విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత విదేశాంగ…
ఇటీవల కాలంలో కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగుల పని గంటల పెంపుకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై మరోసారి స్పష్టత ఇచ్చింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈమేరకు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, ఆ చట్టాల అమలును రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వారి అధికార పరిధిలో నిర్వహిస్తాయని పేర్కొన్నారు. చట్టాల అమలును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్ మెషినరీ (సీఐఆర్ఎం) తనిఖీ అధికారులు చూడగా, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పర్యవేక్షిస్తాయని మంత్రి వివరించారు.
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఆయన అనారోగ్యంతో లఖ్‌నవూలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. మధుమేహం,బీపీ సమస్యలతో బాధపడుతున్న సత్యేంద్ర దాస్ ఆస్పత్రిలో చేరారని వైద్య వర్గాలు తెలిపాయి.బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారిందని,అయితే అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు.20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష స్వీకరించారు.అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వంటి కీలక కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషించారు.ప్రస్తుతం అయోధ్య రామాలయ ప్రధాన పూజారిగా ఆయన కొనసాగుతున్నారు.
