Author: admin

భారతీయ సంస్కృతి, వారసత్వాలకు స్థానిక భాషలే నిజమైన గుర్తింపునిస్తాయని, విదేశీ భాషల స్థానాన్ని అవి భర్తీ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇంగ్లీష్ ను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడేవారే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని, ప్రజలే ఆ భాషను తిరస్కరించే రోజులు సమీపంలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆకాంక్షించారు. తాజాగా ఢిల్లీలో ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి హిందీలో రచించిన ‘మై బూంద్‌ హూ.. ఖుద్‌ సాగర్‌ హూ’ (నేను నీటి బిందువునే కాదు.. సముద్రాన్ని కూడా) అనే పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి, సంస్కృతికి, చరిత్రకు, మతానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాష సరిపోదన్నారు. అసంపూర్ణమైన విదేశీ భాషలతో ‘సంపూర్ణ భారతం’ అనే భావనను ఊహించలేమని అన్నారు.

Read More

రేపు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు విశాఖపట్నం రానున్నారు. రేపు విశాఖలోని ఆర్కే బీచ్‌లో జరగనున్న యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సాయంత్రం ఒడిశాలోని భువనేశ్వర్‌ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన నేరుగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్‌ మెస్‌కు వెళతారు. అక్కడ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి ప్రధాని ఈస్టర్న్ నేవీ అతిథి గృహంలో బస చేయనున్నారు.రేపు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఉదయం 6.25 గంటలకు రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్‌కు చేరుకుని ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకు యోగా చేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, భువనేశ్వరి! మీ ప్రేమ మరియు బలం మన కుటుంబానికి పునాది. ప్రతి ఒడిదుడుకులలో మీరు నా పక్కనే ఉన్నారు మరియు జీవితంలో నా భాగస్వామిగా మిమ్మల్ని పొందినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను. మీరు మా జీవితాలకు వెలుగు. మీ దయ, ప్రజల పట్ల మీకున్న శ్రద్ధ, వ్యాపారం మరియు దాతృత్వం రెండింటిలోనూ మీ హృదయపూర్వక నాయకత్వం మా అందరికీ స్ఫూర్తినిస్తాయని చంద్రబాబు రాసుకొచ్చారు. ఇక మంత్రి నారా లోకేష్ కూడా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ డ్యూరోవ్ తన భారీ సంపదకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వీర్యదానం ద్వారా జన్మించిన 100 మందికిపైగా పిల్లలు సహా తన వారసులకు 13.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.16 లక్షల కోట్లు) సంపదను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను తెలిపారు. అతనికి కలిగిన ఆరుగురు పిల్లలతో పాటు, గత 15 ఏళ్లుగా వీర్య దానం ద్వారా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రయ్యాడు. ఈ నేపథ్యంలో తన సంపదను పంచుతూ ఇటీవలే వీలునామా రాసినట్టు తెలిపారు. తన పిల్లల విషయంలో ఎలాంటి తేడా చూపించనని అన్నారు. సహజంగా జన్మించినవారు, స్పెర్మ్ దానం ద్వారా జన్మించినవారు అందరూ తన పిల్లలేనని. వారందరికీ సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. తన మరణం తర్వాత…

Read More

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఈరోజు నుండి మొదలవుతుంది. ఈ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని ఇక నుండి ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ’గా పిలుస్తారు. బీసీసీఐ-ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించింది. తాజాగా తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ ట్రోఫీని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్ పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఇంగ్లాండ్ లో జరిగే సిరీస్ విజేతకు పటౌడీ పేరుతో ట్రోఫీ అందించేవారు. ఈ రెండు జట్లు భారత్లో తలపడితే ‘ఆంథోని డి మెల్లో’ ట్రోఫీ ప్రదానం చేసేవాళ్లు. ఇటీవలే భారత్-ఇంగ్లాండ్ బోర్డులు పటౌడీ ట్రోఫీని రిటైర్ చేశాయి. ఇక భారత్ లో ఆడినా.. ఇంగ్లాండ్ లో ఆడినా రెండు జట్ల మధ్య సిరీస్ విజేతకు ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీనే ఇవ్వనున్నారు. విజేత జట్టు కెప్టెన్ కు ‘పటౌడీ మెడల్’ను బహూకరిస్తారు. ట్రోఫీపై టెండూల్కర్, అండర్సన్ యాక్షన్ ఫొటోలతో పాటు వారి సంతకాలు…

Read More

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా పడింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న ఈ అంతరిక్ష యాత్ర ఉంటుందని ఇటీవల ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడినట్లు నాసా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. యాక్సియం-4 కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్ లతో కలిసి ఈ యాత్రను శుభాంశు శుక్లా చేయనున్నారు. అమెరికాకి చెందిన ఒక కమర్షియల్ స్పేస్ సంస్థ ఈ యాత్ర నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సుల్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇందులో శుభాంశు మిషన్ పైలెట్ గా ఉంటారు. ఇంటర్నేషనల్…

Read More

సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షత స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం ఎస్ఐపీబీ తెలపనుంది. రూ.28,546 కోట్లు పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు ప్రతిపాదనలు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అనుమతులు క్లియర్ చేయాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. సమావేశంలో సీఎస్ విజయానంద్, మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన మంత్రులు కందుల దుర్గేష్,అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్, అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రజలు NDA కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, గత సంవత్సర కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకోవాలని, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధి నివేదికను డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసింది. ప్రజలందరూ ఈ నివేదిక ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారని పేర్కొంది. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో NDA ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచెయ్యనుందని ఒక ప్రకటనలో తెలిపింది. సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-2025ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

Read More

అగ్ర కధానాయకుడు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌ డేట్ వచ్చింది.’మిర్జాపూర్’ వంటి వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు దివ్యేందు పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘రామ్ బుజ్జి’ అనే పాత్రలో దివ్యేందు కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, ఇతర ముఖ్య పాత్రల్లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో, పలు భాషల్లో…

Read More

ఇరాన్ -ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది. దీని కోసం ‘ఆపరేషన్ సింధు’ ను చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతగా 110 మంది విద్యార్థులను తాజాగా తీసుకొచ్చింది. ఆర్మేనియా రాజధాని యెరవాన్ నుండి ప్రత్యేక విమానంలో వారంతా ఈరోజు వేకువజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. వారిలోదాదాపు 90 మంది జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారే ఉన్నారు. స్వదేశానికి తిరిగి రావడం పట్ల వారంతా హార్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More