మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ మరియు ఆతిథ్యం ఇవ్వనున్న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించాయి. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 12 జట్లు తలపడనున్నాయి. వచ్చే ఏడాది జూన్ 12న ప్రారంభం కానుంది. మొత్తంగా 33 మ్యాచ్ లు 7 వేదికలలో జరగనున్నాయి. ఎడ్జ్ బాస్టన్, హాంప్ షైర్, హెడింగ్లీ, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, ఓల్డ్ ట్రాఫోర్డ్, లార్డ్స్ లలో మ్యాచ్ లు జరుగుతాయి. జూన్ 30, జులై 2న సెమీ ఫైనల్స్, జులై 5న ఫైనల్ జరగనున్నాయి. ఇక 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా మరియు రెండు క్వాలిఫైయింగ్ జట్లు, గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, రెండు క్వాలిఫైయింగ్ జట్లు ఉంటాయి. జూన్ 14న ఎడ్జ్ బాస్టన్ లో భారత్…
Author: admin
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలయ్యాక తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు నాగమల్లేశ్వర రావు ఇంటిపై రాళ్లు విసిరి, అతడిని అరెస్ట్ చేయించారు. ఊళ్లోంచి వెళ్లిపోవాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కాల్చి చంపుతామని సీఐ రాజేష్ బెదిరించాడు. వాళ్ల బెదిరింపులు, అవమానాల గురించి తండ్రికి చెప్పి నాగమల్లేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుల ప్రస్తావన తెచ్చి, అవమానించి, తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారని ఆరోపించారు. వీరి ఇంటిపై దాడి చేసిన వారిలో ఎందరిని అరెస్ట్ చేశారు, ఎందరికి శిక్ష వేశారు అని ప్రశ్నించారు. వేధించిన సీఐ మీద ఏం చర్యలు తీసుకున్నారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అమిత్ షా కు లోకేష్ వివరించారు. ఈనెల 21న విశాఖలో ప్రధాని మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరించి కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు లోకేష్ అందజేశారు. సీఎం చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది, ఎపిలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఇజ్రాయెల్ -ఇరాన్ లో మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆ ప్రభావం మన మార్కెట్ల పై కూడా పడింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 138 పాయింట్ల నష్టంతో 81,444 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,812 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.86.49గా కొనసాగుతోంది. ఇక సెన్సెక్స్ 30లో టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ బేస్డ్ వార్షిక పాస్‌ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు . కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయం, భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో ఒక గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని అన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ లను ప్రవేశపెట్టాలన్న ప్రయాణికుల చిరకాల డిమాండ్ కు ఈ నిర్ణయంతో సరైన పరిష్కారం లభించిందని పవన్ అన్నారు. టోల్ చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రైవేటు వాహన యజమానులకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రూ.3000 వార్షిక పాస్‌తో వాహనదారులకు…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి తమ వంతు సహాయ, సహకారాలను అందించాలని ఉపరాష్ట్రపతిని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పగా, ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి మంత్రి లోకేష్ అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని నేను ఎంచుకున్నానని చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకుని పోరాడానని ధన్కర్ జీ తెలిపారని లోకేష్ సోషల్…
భారత్-కెనడాల మధ్య సంబంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రజాస్వామ్య విలువలను పటిష్టం చేసేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలిశారు. గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో క్షీణించిన సంబంధాలు తాజా ద్వైపాక్షిక బలోపేతమవుతాయని ఈసందర్భంగా భారత్ భావిస్తోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోడీ ఆల్బెర్టాకు వెళ్లారు. భారత్ కు జీ7 దేశాలలో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు కెనడా ఆహ్వనం మేరకు భారత్ హాజరయ్యింది. భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పలు రంగాలలో కొనసాగుతున్న భాగస్వామ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాధినేతలు కలుసుకున్న సమయంలో ప్రధాని మోడీ భారత్-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో కీలకమైనవని స్పష్టం చేశారు.…
గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యంతో గ్రామాల ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆనాటి ప్రాజెక్టు లక్ష్యంతో సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అనే ఒక మారుమూల ప్రాంతంలో వెలుగు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భాన్ని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అది కాలక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)గా రూపాంతరం చెందింది. అప్పటి నుండి లక్షలాది గ్రామీణ మహిళల జీవితాలలో, వేలాది గ్రామాలలో నిరంతరం అభివృద్ధి వెలుగులు నింపుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. సెర్ప్ కార్యకలాపాలలో భాగస్వాములవుతూ… నవసమాజ నిర్మాతలై గ్రామీణ పేదరిక నిర్మూలనను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్న గ్రామీణ మహిళలకు… వారిని ప్రగతి పథంలో నడిపిస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
జమ్మూకశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడి తర్వాత మూతబడిన పలు పర్యాటక ప్రదేశాలు, ఉద్యానవనాలలో తాజాగా తిరిగి సందడి నెలకొంది. పర్యాటకులు, స్థానికులు వీటిని సందర్శించి ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లో మొత్తం 16 పార్కులను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఉద్యాన వనాలను సంరక్షించేందుకు, భద్రతను పెంపొందించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో పహల్గాంలోని బేతాబ్ లోయ సహా ఎనిమిది పార్కులు, రెండో విడతగా జమ్మూలోని ఎనిమిది ఉద్యానాలను తిరిగి ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
పటౌడీ ట్రోఫీ పేరును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా మార్చిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా దీనిపై అధికారికంగా ఓ ప్రకటన చేయాల్సింది. అయితే అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ట్రోఫీ పేరును మార్చడంపై విమర్శలు వచ్చాయి. ట్రోఫీకి పటౌడీ పేరు సిరీస్ లో భాగంగా ఉండాలని కోరుతూ స్వయంగా సచినే ఈసీబీకి లేఖ రాశాడు. పటౌడీ పేరు సిరీస్ లో భాగంగా ఉండాలని సచిన్ ఈసీబీని కోరాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా కూడా చర్చల్లో పాల్గొన్నారు. విన్నింగ్ కెప్టెన్ కు పటౌడీ మెడల్ బహూకరించాలని ఈసీబీ నిర్ణయించిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్ కు పటౌడీ మెడల్ ఇవ్వనున్నారు.
