టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 465 (100.4 ఓవర్లలో) పరుగులకు ఆలౌటయింది. పోప్ 106 (137;4×4) సెంచరీతో రాణించాడు. బ్రూక్ 99 (112; 11×4, 2×6) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. డకెట్ (62) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో స్మిత్ (40), వోక్స్ (38), రూట్ (28), కార్సే (22), స్టోక్స్ (20) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు. భారత బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులతో ఉంది. జైశ్వాల్ (4), సాయి సుదర్శన్ (30) పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కే.ఎల్.రాహుల్ 47…
Author: admin
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహనం కింద ఒక సింగర్ అనే వ్యక్తి పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన పై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. జగన్ కారు కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ? బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస…
అమెరికా ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు పూర్తి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. “ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్” అణు కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక “ట్రూత్ సోషల్”లో ఒక పోస్ట్ చేశారు. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌లతో సహా మూడు అణు స్థావరాలపై మేం చేపట్టిన దాడి చాలా విజయవంతంగా పూర్తయింది. మా విమానాలు ఇప్పుడు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రధాన స్థావరమైన ఫోర్డోపై పూర్తిస్థాయి బాంబుల పేలోడ్‌తో దాడి చేశాం. అన్ని విమానాలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యాయి. అమెరికన్ యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే ఇతర సైన్యం కూడా ఇలాంటి దాడి చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది! ఈ విషయానికి మీరు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలని ట్రంప్ తన పోస్టులో…
ఇరాన్ -ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సింధు’ పేరిట ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. 1117 మందిని భారత్ కు తీసుకొచ్చింది. తాజాగా 290 మంది ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో స్టూడెంట్స్, టూరిస్ట్ లు ఉన్నారు. ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆపరేషన్ సింధు లో భాగంగా పొరుగు దేశాలకు కూడా భారత్ ఆపన్న హాస్తం అందిస్తోంది. నేపాల్, శ్రీలంక వాసులను కూడా తరలిస్తోంది. ఇరాన్ లోని భారతీయులు +989010144557, +9891281091, +989128109109 అత్యవసర నంబర్లనుగానీ, టెలిగ్రామ్ ఛానల్ ద్వారాగానీ అక్కడి దౌత్య కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించింది.
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 471 (113 ఓవర్లలో) పరుగులకు ఆలౌటయింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. రిషబ్ పంత్ 134 (178; 12×4, 6×6) సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్ లో యశస్వీ జైశ్వాల్ 101 (158; 16×4, 1×6), శుభ్ మాన్ గిల్ 147 (227; 19×4, 1×6) లు కూడా సెంచరీలతో ఆకట్టుకున్నారు. కే.ఎల్. రాహుల్ (42), సాయి సుదర్శన్ (0), కరుణ్ నాయర్ (0) లు నిరాశ పరిచారు. జడేజా (11), శార్థుల్ ఠాకూర్ (1) స్వల్ప పరుగులు మాత్రమే చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ 4 వికెట్లు, స్టోక్స్ 4 వికెట్లు, కార్స్, బషీర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అనంతరం…
నేడు 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖలో ఘనంగా యోగా డే నిర్వహించారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రపంచం నేడు అనేక సంఘర్షణలు, అశాంతి, అస్థిరతతో సతమతమవుతున్న వేళ యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. ఈ యోగా దినోత్సవం ‘మానవాళి కోసం యోగా 2.0’ కు నాంది పలకాలని, దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆనందం, శాంతిని పెంపొందించడంలోయోగా ప్రాముఖ్యతను తెలిపారు. ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవాళి శ్వాస తీసుకోవడానికి, సమతుల్యం చేసుకోవడానికి,…
భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోడీ రేపు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇంగ్లాండ్ లోని లీడ్స్ వేదికగా సచిన్ టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీ నేడు ప్రారంభమైంది. మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. యశస్వీ జైశ్వాల్ 101 (158; 16×4, 1×6), కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 127 నాటౌట్ (175; 16×4, 1×6) సెంచరీలతో కదం తొక్కారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. జైశ్వాల్ అవుటైనా ఇంకా శుభ్ మాన్ గిల్ క్రీజులో ఉన్నాడు. అతనికి తోడుగా రిషబ్ పంత్ 65 నాటౌట్ (102; 6×4, 2×6) పరుగులతో నిలిచాడు. కే.ఎల్.రాహుల్ (42) పర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2 వికెట్లు, కార్సే 1 వికెట్ తీశారు.
మరో మల్టీ నేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు రానుంది. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ రాష్ట్రానికి రానున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యొక్క IT & GCC పాలసీ 4.0 ప్రకారం, రాష్ట్రంలో IT పరిశ్రమ కోసం ఒక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారత ఐటీ పరిశ్రమలో దిగ్గజం అయిన కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖపట్నంలో రూ. 1583 కోట్ల పెట్టుబడితో 21.3 ఎకరాల క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పెట్టుబడి 8000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ఇరాన్ -ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నప్పటికీ సూచీలు జోరు కొనసాగుతోంది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,046 పాయింట్ల లాభంతో 82,408వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 319 పాయింట్ల లాభపడి 25,112 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.86.59గా కొనసాగుతోంది. ఇటీవల వరుస నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలకు కలిసొచ్చింది. ఇక నేడు మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
