ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు: రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం. మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పురపాలకశాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్ కు ఆమోదం భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు ఆమోదం. టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం. పర్యాటక ప్రాంతం గండికోట వద్ద రిసార్టు ఏర్పాటు కోసం 50 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం. తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటకశాఖకు బదిలీకి అనుమతి. శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ సేఫ్టీ పనుల కోసం 350 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం. ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా పోలవరం బసకచర్ల ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం.…
Author: admin
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ -ఇరాన్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఇరాన్ – ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించాయని పేర్కొన్నారు. ది హేగ్ లో జరిగే నాటో కాన్ఫరెన్స్ కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని ధృవీకరించారు. ఇరాన్ తో పాటు తమ మిత్ర దేశం ఈజ్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించిందన్నారు. ఈ చర్య పట్ల తాను సంతోషంగా లేనని చెప్పారు. రెండు దేశాలు శాంతించాలని అదే తాను కోరుకుంటున్నానని అన్నారు.
ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసినట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ తాజాగా ప్రకటించింది. ఖతార్ లోని అమెరికా ఎయిర్ బేస్ పై తాము చేసిన దాడి విజయవంతమైందని తెలిపింది. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారని, కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడ్డారని తెలిపింది. తమ దేశం జరిపిన దాడి అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కోసం “వేడుకున్నారని” ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తా ఛానెల్ ఐఆర్ఐఎన్ఎన్ ప్రకటించింది. ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరంపై తాము జరిపిన దాడి విజయవంతమయిందని, ఆ తర్వాత ఇజ్రాయెల్ పై కాల్పుల విరమణను విధించినట్లు తెలిపింది. ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యలు, అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజా ప్రభుత్వం ఎజెండా అని ఏపీ మానవాభివృద్ధి, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కేవలం ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం. ఏపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రం అడిగిన ప్రతి కోరిక తీరుస్తున్నారు. విద్యా శాఖ మంత్రిని నా శాఖలో సంస్కరణలు తెస్తున్నా. ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం. నేను 65 ప్రజాదర్బార్లు నిర్వహించాను. ప్రజాప్రతినిధులంతా అభివృద్ధిలో పోటీపడాలి, పెట్టుబడులు తీసుకురావాలి. వచ్చే నాలుగేళ్లు కలసికట్టుగా పనిచేసి అన్నిరంగాల్లో ఏపీ నెం.1గా నిలిపేందుకు కృషిచేద్దామని సుపరిపాలన-తొలి అడుగు సభలో పిలుపునిచ్చారు.
NDA ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈరోజు జరిగిన విశిష్ట సమావేశం, ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు వారికి సేవ చేయాలనే తమ నిబద్ధతకు అంకితమని అన్నారు. గత సంవత్సరంలో సాధించిన పురోగతిని ప్రతిబింబించడానికి మరియు మరింత ముందుకు సాగే మార్గాన్ని రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పారదర్శక, జవాబుదారీతనం మరియు ప్రజా-కేంద్రీకృత పాలనను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో, మేము గతంలో జరిగిన నష్టాన్ని సరిదిద్దడం ప్రారంభించాము మరియు నిజమైన, శాశ్వత అభివృద్ధికి పునాది వేసాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పూర్తి అంకితభావం మరియు ఉద్దేశ్యంతో మన ప్రజలకు మరియు మన రాష్ట్రానికి సేవ చేయడం కొనసాగిద్దామని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం చారిత్రక విజయాన్ని సాధించి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఏడాది సుపరిపాలన అందించిన శుభ సందర్భంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో NDA ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పనులను, తాను చేపట్టిన శాఖల ద్వారా చేసిన కార్యక్రమాలను డిప్యూటీ సీఎం పవన్ వివరించారు. ఉమ్మడి సహకారంతో, ఐదున్నర కోట్ల ఆంధ్రా ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుకు కట్టుబడి చిత్తశుద్ధితో అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న NDA కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనను సుపరిపాలనగా తీర్చిదిద్ది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇదే విధంగా వచ్చే నాలుగేళ్ల కాలం కూడా పూర్తిగా ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ, NDA కూటమికి అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
మోహన్ లాల్ , జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం-3 రాబోతోంది అంటూ మూడో భాగాన్ని ప్రకటించారు. మలయాళంలో తాను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో ‘దృశ్యం-3’ వస్తుందని స్పష్టం చేశారు. ఒకేసారి మూడు భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మొదటి రెండు భాగాలకు జీతూ దర్శకత్వం వహించారు. ఇప్పుడు కూడా ఆయనే దర్శకత్వం వహించనుండగా, హిందీలో ‘దృశ్యం’ను నిషికాంత్ కామత్, ‘దృశ్యం2’ అభిషేక్ పాఠక్ తీశారు. తెలుగులో ‘దృశ్యం’ శ్రీప్రియ రూపొందించగా, ‘దృశ్యం2’ను జీతు జోసెఫ్ తీర్చిదిద్దారు.
తన వాహానం కింద పడి ఒక వ్యక్తి మరణించిన దుర్ఘటనకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. చంద్రబాబు గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారని జగన్ అన్నారు. గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ సీఎంకు కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే.…
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 364 పరుగులకు (96 ఓవర్లు) ఆలౌటయింది. కే.ఎల్. రాహుల్ 137 (247; 18×4) టాప్ స్కోరర్. మొదటి ఇన్నింగ్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీ చేసిన రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించి ఈ ఘనత అందుకున్న మొదటి భారత బ్యాటర్ గా నిలిచాడు. అంతే కాకుండా రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్ గా నిలిచాడు. ఇంతకుముందు జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 118 (140; 15×4, 3×6) పరుగులు చేశాడు. జడేజా (25), కరుణ్ నాయర్ (20) పరుగులు చేశారు. దీంతో భారీ టార్గెట్ ను భారత్ ఇంగ్లాండ్ ముందుంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో…
మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తమిళనాడు బీజేపీ అగ్రనేతలు, ఆధ్యాత్మిక గురువులు, సాధువులు లక్షలాది ప్రజలు ఈ సభలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. 2014 లో హైదరాబాద్ లో పార్టీ స్థాపించాను… నేను తమిళనాడు లో పెరిగాను, తమిళనాడు లో సంస్కృతిని అర్ధం చేసుకున్నవాడిని, తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నవాడిని, ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మమని పేర్కొన్నారు.మురుగన్‌ను నమ్మితే విజయం తధ్యం. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదల సుసాధ్యం. మురుగన్‌ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది.…
