Author: admin

భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంథన ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం దక్కించుకుంది. ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ లిస్ట్ లో స్మృతి 727 పాయింట్లతో నెంబర్ వన్ గా నిలిచింది. 2019 తర్వాత స్మృతి మళ్లీ నంబర్వన్ ర్యాంకు సాధించడం ఇదే మొదటి సారి. నటాలీ సీవర్ బ్రంట్ (719- ఇంగ్లాండ్) 2, లారా వోల్వార్ట్ (719– సౌతాఫ్రికా) 3 స్థానాల్లో నిలిచారు. జెమీమా రోడ్రిగ్ 15, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 16వ ర్యాంకులు సాధించారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో స్మృతి 4వ స్థానంలో నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ 12, జెమీమా రోడ్రిగ్స్ 13, షెఫాలీవర్మ 14వ ర్యాంకులలో కొనసాగుతున్నారు.

Read More

ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో మొట్టమొదటి సారిగా ట్రై సిరీస్ లో భాగంగా నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా మూడు సూపర్ ఓవర్లు జరిగాయి. రెండు జట్ల మధ్య పలుమార్లు స్కోర్లు సమంగా నిలవడంతో చివరకు మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆ తర్వాత టార్గెట్ ఛేజింగ్ లో నేపాల్ స్కోరును (152/8) సమం చేసింది. మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లూ 19 పరుగులు చేయడంతో రెండోసారి టైబ్రేకర్ ఆడించారు. అందులోనూ రెండు జట్లూ చెరో 17 పరుగులు చేశాయి. దీంతో ఫలితం తేలడం కోసం మూడోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో డచ్ ఆల్ రౌండర్ జాచ్ లయన్- కాచెట్ నేపాల్కు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా.…

Read More

ఆంధ్రప్రదేశ్ ఐసీసీ #womensworldcup2025 మ్యాచ్‌లను నిర్వహించనున్న విషయంపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. దీని పట్ల గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. వైజాగ్‌లోని ప్రపంచ స్థాయి ACA-VDCA స్టేడియం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ మహిళా క్రికెటర్లను స్వాగతిస్తుందన్నారు. ఇది ఆంధ్ర క్రికెట్ ప్రయాణంలో ఒక మైలురాయి అధ్యాయాన్ని మరియు మన రాష్ట్రానికి గర్వకారణమైన క్షణాలని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని భారతదేశం అంతటా కొత్త తరం అమ్మాయిలు పెద్ద కలలు కనడానికి, ఉన్నత లక్ష్యాలను సాధించడానికి మరియు సరిహద్దులను ఛేదించడానికి స్ఫూర్తినిచ్చే అవకాశం ఇదని అన్నారు. యువత సాధికారత మరియు క్రీడల పట్ల తీవ్ర మక్కువ ఉన్న వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ క్రికెట్‌లో ప్రధాన వేదికను పొందడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కలిసి రండి, స్టేడియంలకు తరలిరావాలని మరియు వైజాగ్ ఉమెన్ ఇన్ బ్లూ కోసం ఎలా గర్జిస్తుందో ప్రపంచానికి చూపిద్దాం! అంటూ లోకేష్…

Read More

ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని వస్తున్న సందర్భంగా… సీఎం చంద్రబాబు విశాఖ వెళ్లి యోగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించారు. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యేలా స్ఫూర్తినిచ్చే విధంగా యోగా డే జరగాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ యోగా డేలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాలలో చేసిన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్ అరేంజ్ మెంట్స్ గురించి సీఎంకు వివరించారు. 2 కోట్ల మంది భాగస్వామ్యంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డే లక్ష్యంగా యోగా డే నిర్వహించనున్నారు.

Read More

అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మంథనా ప్రధాన పాత్రధారులుగా, వైవిధ్య చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా సినిమా ట్రైలర్‌ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమాలోని కీలక అంశాలను, పాత్రల శైలిని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ట్రైలర్‌ లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం భావోద్వేగాలతో పాటు, యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ముఖ్యంగా, డబ్బు చుట్టూ తిరిగే కథలో మానవ సంబంధాలు, నైతిక విలువలు వంటి అంశాలను స్పృశిస్తూ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. https://youtu.be/Zu4-jr0sSBE?si=AZdNhPxi9xCwkkfG

Read More

తల్లికి వందనం సూపర్ సక్సెస్! అని తల్లుల కళ్లలో ఆనందం చూసిజగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగిందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారని అన్నారు. ఈమేరకు సదరు పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని తెలిపారు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయని స్పష్టం చేశారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం..చెయ్యనివ్వమని లోకేష్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు…

Read More

ఛత్తీస్ ఘడ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన దంతెవాడ జిల్లాలో క్రీడా మైదానాలు అభివృద్ధి కోసం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కృషి చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, మాన్ దేశీ ఫౌండేషన్ లతో కలిసి అధికారులు ఈ జిల్లాలో 50 మైదానాలు అభివృద్ధి చేయనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 20 క్రీడా మైదానాలు అభివృద్ధి చేశాం. అక్టోబర్ నాటికి మిగిలిన వాటిని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పిల్లలు, యువత కోసం సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ మాన్ దేశీ ఫౌండేషన్ ల సహాకారంతో ఈ మైదానాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 50 గ్రామాల్లో 50 మైదానాలు అభివృద్ధి చేస్తామని తర్వాత జిల్లా అంతా చేయనున్నట్లు తెలిపారు.

Read More

ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమా నుండి తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ప్రభాస్ యాక్టింగ్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇది ప్రభాస్‌ కెరీర్‌లో తొలి కామెడీ హారర్‌ మూవీ కావడం విశేషం. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. హారర్‌ కామెడీ జానర్‌లో మారుతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. https://youtu.be/NZbmcl0QUaU?si=v2B9yQqup-vzn75E

Read More

భారత ప్రధాని నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన కోసం నేడు బయలుదేరి వెళ్లారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్‌ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఇటీవల జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయిల్ పరిణామాల నేపథ్యంలో జీ7 సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. కెనడా ప్రధాని పిలుపుతో జీ7 సదస్సుకు హాజరుకావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. కెనడాలో మంగళవారం జరగనున్న జీ7 దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొంటారు. ప్రపంచంలోని ఏడు ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉన్న ఈ కూటమి సమావేశంలో పలు అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. నేడు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సైప్రస్‌ లో భారత ప్రధాని…

Read More

తెలుగు సినిమాకు సంబంధించి తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక హైటెక్స్ వేదికగా తాజాగా ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్ఎసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు, ఎఫ్ఎసీ ఎండీ హరీశ్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. విజేతలకు మెమెంటో, ప్రశంసా పత్రం, నగదు పురస్కారాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. 2024 చిత్రాలకు సంబంధించి అన్ని విభాగాలకు పురస్కారాలు ఇచ్చారు. 2014 నుంచి 2023 వరకూ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇచ్చారు. ఒక్కో సినిమానికిగానూ నాలుగు (హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్) పురస్కారాలను అందించారు.

Read More