తనకు ఎన్నిసార్లు దేశం వదిలి వెళ్లి అవకాశం వచ్చినా తాను వెళ్లలేదని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అన్నారు.ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.“నేను అటోక్ జైల్లో ఉన్నప్పుడు మూడేళ్ల కాలానికి దేశం విడిచి వెళ్లిపోయేందుకు అవకాశం వచ్చింది.అందుకు నిరాకరించాను.నేను ఇక్కడే కన్నుమూస్తాను.నా మాట ఎప్పుడూ ఒక్కటే.అదుపులోకి తీసుకున్న మా నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలి.ఆ తర్వాత నా వ్యక్తిగత పరిస్థితిపై చర్చించడం గురించి ఆలోచిస్తాను.అలాగే పాక్కు సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నది నా అభిప్రాయం.ప్రజలకు కనీస స్థాయిలో అందాల్సిన హక్కులు అణచివేతకు గురైతే..అంతర్జాతీయంగా ఉన్న గళాలు బలంగా వినిపిస్తాయి.ఐరాస వంటి సంస్థలు ఉంది అందుకే కదా.మిలిటరీ జోక్యం ఉందని ముషారఫ్ పాలనపై విమర్శలు వచ్చినా..ఈ స్థాయి అణచివేత మాత్రం లేదు” అని షెహబాజ్ ప్రభుత్వం పై ఇమ్రాన్ విమర్శలు చేశారు.
Author: admin
మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ ల్యాబ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టాడు.ఈ ఘటనలో కంప్యూటర్లు, ఏసీలు, ప్రాజెక్టర్, కుర్చీలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటన స్టలికి చేరుకుని పరిశీలించారు.ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న ఈ సంఘటన జరిగినట్లు గుర్తించారు.ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో పొవాయ్‌లోని ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ల్యాబ్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు.కిరోసిన్ పోసి ల్యాబ్‌కు నిప్పంటించి పారిపోయాడని అధికారులు తెలిపారు.
దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గేమ్‌ఛేంజర్”.ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 10 న ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సినిమా టికెట్ ధరలు పెంచుతూ…తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.బెనిఫిట్ షో కు రూ.600 వరకు టికెట్ ధర పెంచుకోవచ్చని పేర్కొంది ఈ మేరకు మల్టీప్లెక్స్‌ల్లో అదనంగా రూ.175, సింగిల్ థియేటర్లలో రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.జనవరి 11వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఇవే ధరలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ తేదీల్లో రోజుకు 5 షోలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతినిచ్చింది.విడుదల తేదీ మాత్రం ఆరు షోలు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తెలిపింది.ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
దేశాభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమని అటువంటి గ్రామీణాభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ‘గ్రామీణ భారత మహోత్సవం-2025 ‘ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను గత ప్రభుత్వాలు విస్మరించాయని దాని వలన గ్రామాల నుండి పట్టణాలకు వలసలు పెరిగాయని ఫలితంగా పట్టణాల్లో కూడా పేదరికం పెరిగిందని చెప్పారు. సమాజంలో ఎంత మారినా గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రగతి చూడని ప్రాంతాలు తమ హాయాంలో సమాన ప్రాధాన్యత సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విధానాల వలన గ్రామీణ భారతానికి నూతన శక్తిని నింపుతున్నాయని అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలను కూడా దేశాభివృద్ధిలో భాగం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో భారత్ లోని మారుమూల ప్రాంతాలు ఎలా ఎదుర్కుంటాయోనని ప్రపంచ దేశాలు అనుమానం…
జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ మేళా జరుగనున్న నేపథ్యంలో సెక్టార్ 6 లో వాసుకి ఆలయం ప్రక్కన శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద మీడియాతో నేడు ఛైర్మెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాగ్ రాజ్ లో ఉత్తరాది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నట్లు తెలిపారు. తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు చేపట్టనున్నట్లు ఛైర్మెన్ తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్ప అలంకరణలు చేపట్టాలని సూచించామన్నారు. మహాకుంభ మేళాకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ సిద్దం చేశారని…
విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రి సత్య కుమార్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‍లను మంత్రి లోకేష్ పరిశీలించారు. ప్రారంభించే ముందు, కళాశాల విద్యార్ధులతో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వైపు వెళ్ళవద్దని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకోవాలని సూచించారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని మంచి ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. జీవితంలో గెలుపు ఓటములు సహాజమేనని తాను 2019 లో మంగళగిరిలో ఓడిపోయి తిరిగి 2024 లో ఘన విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.…
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ షెడ్యూల్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధులకు సంబంధించిన మొదటి జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 29 మందితో జాబితా ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు పోటీగా బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మను బరిలోకి దించనుంది. ఈయన మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు 2014-2024 వరకు వెస్ట్ ఢిల్లీ ఎంపీగా కొనసాగారు. 2019లో ఢిల్లీ చరిత్రలోనే 5లక్షల 78 వేల మెజారిటీతో విజయం సాధించి సత్తా చాటారు. ఇక కాంగ్రెస్ ఇప్పటికే ఆ స్థానంలో మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరును ప్రకటించింది.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని దుయ్యబట్టారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ గారిని, రాష్ట్రంలోని కూటమి పార్టీలను ఏపీసీసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలని పేర్కొన్నారు. SAILలో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలని స్పష్టం చేశారు. ప్లాంట్‌కున్న 7 మిలియన్ టన్నుల సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేయాలని 1400 రోజులుగా ఆందోళనలు చేస్తున్న…
ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంగ్లం, తెలుగులో ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి భాషాపరంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మరియు తొంభై ఐదు శాతానికి పైగా జనాభా మాట్లాడే తెలుగు భాషకు ఎంతో గౌరవం ఉంది. ఏదైనా, ప్రభుత్వ పనితీరులో ప్రభుత్వ ఉత్తర్వులు (G.Os.) కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ శాఖలు, అధికారులు మరియు ప్రజలకు ప్రభుత్వం జారీ చేసిన నిర్ణయాలు, సూచనలు, విధానాలు మరియు నిబంధనలను తెలియజేయడానికి ఇవి అధికారిక సాధనాలుగా పనిచేస్తాయి. ఆంగ్లం మరియు తెలుగు రెండు భాషలలో ప్రభుత్వ ఉత్తర్వులను అందించడం వలన విస్త్రుతంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రత్యేకించి దేశంలో భాషాపరం గా ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంలో తెలుగు బాష…
జాన్వీకపూర్ తో సినిమా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి తనకు లేదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు.జాన్వీకపూర్‌ను ఆమె తల్లి శ్రీదేవితో పోల్చి చూడటాన్ని ఆయన తప్పుపట్టారు.శ్రీదేవి మరణించినా అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని అందుకే ఈవిధంగా పోల్చి చూస్తున్నారని అన్నారు.‘సినిమా ఏదైనా శ్రీదేవి అద్భుతంగా నటిస్తారు.ఆమె యాక్టింగ్ చూసి నేనొక దర్శకుడిననే విషయాన్ని మర్చిపోయా.ప్రేక్షకుడిగా ఆమెను చూస్తూ ఉండిపోయా.జాన్వీతో సినిమా చేసే ఉద్దేశం అయితే నాకు లేదు’ అని వర్మ చెప్పారు. View this post on Instagram A post shared by NavyaAndhra Times (@navyaandhratimes)
