బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషను పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేస్తోన్న నిరసనకు మద్దతు తెలిపారు ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త అయిన జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్.పట్నాలోని గాంధీ మైదాన్‌లో మహాత్ముడి విగ్రహం వద్ద జరిగిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆ మైదాన్ పక్కనే పీకే కోసం ఓ లగ్జరీ వ్యాను సిద్ధంగా ఉండటం చర్చనీయాంశమైంది.నెటిజన్లు, రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై జన్‌సురాజ్ పార్టీ ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ఇక్కడ వ్యాను సమస్య కాదు, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం.పీకే ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే దానిని మధ్యలోకి లాగుతున్నారు’’ అన్నారు.
Author: admin
రామ్‌చరణ్ కథానాయకుడిగా, దర్శకుడిగా శంకర్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు.సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత విషయాలనూ పంచుకున్నారు.తన కుమార్తె క్లీంకార గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.క్లీంకార నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా పాప ఫొటో రివీల్ చేస్తానని ఆయన అన్నారు.పవన్ కల్యాణ్,అల్లు అరవింద్,ఉపాసన,సురేఖ,అంజనా దేవి ఇలా తమ కుటుంబసభ్యుల గురించీ ఆయన మాట్లాడారు.దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం నిర్వహించిన ఈ సమీక్షలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జిల్లాల వారీగా వచ్చే వారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’.ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో బాబీ డియోల్,చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు,ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు. https://youtu.be/fNDRSver0uM?si=aRAeTuK-jVUO15cm
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఏపీ లోని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హామీల అమలు గురించి అధికార పక్షంపై ప్రశ్నలు సంధించారు. ఇక జగన్ చేసిన విమర్శలను అధికార వర్గం తిప్పికొడుతోంది. తాజాగా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ సొంత తల్లికి దండం పెట్టని నువ్వు, తల్లికి వందనంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని జగన్ పై మండిపడ్డారు. నీ లాగా నీకు రూ.250, నీకు రూ.250, నీకు రూ.250, అని ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్ళకుండా, ఒకేసారి రూ.1000 పెంచి, పెన్షన్ 4 వేలు చేసామని వివరించారు . హామీ ఇచ్చిన ప్రతి సంక్షేమ పధకం అమలు చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. అధికారం పోయిందనే బాధ జగన్ లో ఉందని అర్ధమవుతుందని దుయ్యబట్టారు. ప్రతి దానికి బయటపడిపోయి ఏడవకుండా, ప్రజలకు మంచి జరిగే విషయాల్లో అయినా మౌనంగా ఉండాలని…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 5 టెస్టుల సిరీస్ ను 3-1 తో ను కైవసం చేసుకుంది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటయింది. అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆట మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 141-6 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో 16 పరుగులు మాత్రమే చేసింది. జడేజా (13), వాషింగ్టన్ సుందర్ (12) స్వల్ప పురుషులకే పరిమితమయ్యారు. టెయిలండర్స్ కూడా బ్యాట్ ఝళిపించలేకపోవడంతో ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు. ఇక ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉస్మాన్ ఖవాజా…
విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన ఇండియన్ నేవీ ఆపరేషనల్ డెమో కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నావికాదళ విన్యాసాలను తిలకించారు. సీఎం చంద్రబాబు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి, మనుమడు దేవాన్ష్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ నావెల్ కమాండ్ దేశ రక్షణలోనే కాకుండా, ఏ విపత్తు వచ్చినా సహాయక చర్యల్లో ముందు ఉంటుందని కొనియాడారు. హుదుద్ తుఫాను సహాయక చర్యల్లో నేవీ చూపించిన చొరవ ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. విశాఖపట్నం ప్రజలు చూపించే అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని అన్న సీఎం విశాఖ అంటేనే ఒక ప్రశాంతత, మంచితనానికి మారు పేరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని స్పష్టం చేశారు.
ప్రముఖ దర్శకుడు శంకర్‌తో వర్క్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని నటుడు రామ్‌చరణ్ అన్నారు. ‘శంకర్ గొప్ప దర్శకుడు. ‘త్రీ ఇడియట్స్’ను ఆయన తమిళంలో రీమేక్ చేశారు.‘స్నేహితుడు’ పేరుతో దానిని తెలుగులో రిలీజ్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాను. తెలుగు హీరోలతో ఒక సినిమా చేయమని శంకర్‌ను అడుగుదామనుకున్నా.ఆ సమయంలో నాకు అంత ధైర్యం లేకపోయింది.‘గేమ్ ఛేంజర్’తో నా కల నెరవేరింది’ అని ముంబయి ఈవెంట్‌లో తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది విడుదల కానుంది.
తన కుమార్తెల విషయంలో ఎంతో గర్వంగా ఉన్నట్లు చెప్పారు నటుడు బాలకృష్ణ. పెద్దమ్మాయి బ్రాహ్మణికి గతంలో సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘మణిరత్నం తెరకెక్కించిన ఓ సినిమాలో మా అమ్మాయికి అవకాశం ఇచ్చారు. కాకపోతే ఆమె ఆసక్తి కనబరచలేదు. కెమెరా ముందుకు రావడానికి ఇష్టం లేదని చెప్పింది. ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది’’ అని బాలయ్య చెప్పారు. ఇప్పుడు పిల్లలిద్దరూ వారి వారి రంగాల్లో రాణిస్తున్నారని అందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బ్రాహ్మణి అంటే తనకు కాస్త భయం అని ఆయన సరదాగా చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందంటూ ఆ రాష్ట్రానికి చెందిన కొందరు మహిళలు శనివారం కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నిరసనలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెండు పార్టీలూ కావాలనే తమపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ‘నా నివాసం వద్ద ఆందోళన చేసిన మహిళలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఆ రెండు పార్టీలకూ (బీజేపీ, కాంగ్రెస్) చెందిన వారే. పంజాబ్ ప్రజల మద్దతు మాకే ఉంది. మాపై వారికి పూర్తి విశ్వాసం ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌పై కలిసి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్-బీజేపీ అధికారికంగా ప్రకటించాలి’…
