Author: admin

ఒడిశాలోని నయాగఢ్‌ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్‌ చిరుతపులి కనిపించింది.నోట్లో తన పిల్లను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది.అడవిలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుతపులి కదలికలను గుర్తించామని ప్రినిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రేమ్‌ కుమార్‌ జా వెల్లడించారు.ఈ అరుదైన నల్ల చిరుత మధ్య ఒరిస్సాలో కనిపించిందని,దీనితో పాటు పిల్ల కూడా ఉందని చెప్పారు.ఇది ఈ ప్రాంత అద్భుతమైన జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.అయితే పర్యావరణ వ్యవస్థకు నల్ల చిరుతలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు.వాటి నివాసాలను రక్షించడమనేది అభివృద్ధి చెందుతున్న వన్యప్రాణుల వారసత్వాన్ని నిర్ధారిస్తుందని తెలిపారు.

Read More

ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్‌ రాజగోపాల చిదంబరం (88) తుది శ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జస్‌లోక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు.పోఖ్రాన్‌ న్యూక్లియర్‌ పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం..బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) డైరెక్టర్‌గా వ్యవహరించారు.అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గానూ పని చేశారు.అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.

Read More

భారత దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది.అయితే నిన్న సనా కారును ఓ బస్సు వెనక నుండి ఢీకొంది. కోల్ కతాలోని డైమండ్ హార్బర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో సనా కారుకు డ్యామేజీ అయిందని,సనాకు మాత్రం గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.ప్రమాద సమయంలో కారును గంగూలీ డ్రైవర్ నడుపుతుండగా సనా పక్క సీటులో కూర్చుందని వివరించారు.బెహలా చౌరస్తాలో సనా కారును ఢీ కొట్టిన బస్సు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడని తెలిపారు.డ్రైవర్ తో కలిసి సనా బస్సును వెంటాడి కొంతదూరం వెళ్లిన తర్వాత అడ్డగించిందన్నారు.తమకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

Read More

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ 4 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని 145 పరుగుల ముందంజలో ఉంది. రిషబ్ పంత్ 61 (33;6×4, 4×6) విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. యశస్వీ జైశ్వాల్ 22 (35; 4×4) వేగంగానే ఆడాడు. రాహుల్ (13), గిల్ (13), విరాట్ కోహ్లీ (6), నితీష్ కుమార్ రెడ్డి (4) నిరాశ పరిచారు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ 6 బ్యాటింగ్, రవీంద్ర జడేజా 8 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లతో రాణించాడు. వెబ్ స్టర్ ఒక వికెట్, పాట్ కమ్మిన్స్…

Read More

ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్-2025 అవార్డు అందుకున్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి మాత్రపు జెస్సీ రాజ్ కుటుంబంతో కలిసి ఏపీ మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్కేటింగ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి బాలపురస్కార్ అవార్డు అందుకున్న జెస్సీరాజ్ ను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఈసందర్భంగా చిన్నారికి భరోసా ఇచ్చారు.

Read More

అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? అని ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. వరుసగా కేబినెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని, తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారని ఆక్షేపించారు. వైయస్సార్‌సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను అందించినట్లు తెలిపారు. ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని మండిపడ్డారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు…

Read More

గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో నిర్వహించిన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, అవయవ దాతల 5వ మహాసభ సంయుక్త కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది అవయవాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయని కానీ అవయవదానం చేయడం కోసం ముందుకు వచ్చే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. అపోహలు వీడి నిస్సంకోచంగా అవయవదానం చేయవచ్చని ప్రాణాలు నిలబెట్టడం కంటే గొప్ప పని ఏముంటుంది? అని అన్నారు. తల్లి జన్మనిస్తుంది.. అవయవదానం పునర్జన్మ నిలుస్తుందని పేర్కొన్నారు. ‘జీవన్ దాన్’ సంస్థ ద్వారా అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్ళు మన రాష్ట్రంలో 4,900కు పైగా ఉండగా, అవయవదానానికి అంగీకరిస్తూ గతేడాది పేర్లు నమోదు చేసుకున్నవాళ్లు 65 మంది మాత్రమేనని. అవసరమైన వాళ్ల సంఖ్యతో పోలిస్తే దానానికి ముందుకొచ్చిన వాళ్ల సంఖ్య 1 శాతం కూడా లేదని పేర్కొన్నారు. అవయవదానంపై…

Read More

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 9-1 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ను భారత బౌలర్లు 181 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ కు 4 పరుగుల ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియాను రెండో రోజు మన బౌలర్లు బాగానే ఇబ్బంది పెట్టారు. వెబ్ స్టర్ 57 (105; 5×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. స్టీవ్ స్మిత్ 33 (57; 4×4, 1×6) పర్వాలేదనిపించాడు. అయితే భారత కెప్టెన్ బుమ్రా గాయం కారణంగా మైదానం నుండి వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్ లో అతను ఆడడం చాలా కీలకం. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు, ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, నితీష్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన…

Read More

హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమానికి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయని అన్నారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు శ్రీకాకుళం నుండి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటేనని అదే తెలుగుజాతి అని పేర్కొన్నారు. ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి ఉండాలి. ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్ లో జరగబోయే విషయాలను మనం ముందుగానే ఆలోచించాలి. తగిన విధంగా ముందుకు వెళ్లగలిగితే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీ ఎప్పటికీ తెలుగు వారి సొంతమని ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. 25 సంవత్సరాల్లో ఇది సాధ్యమైందని వివరించారు. తెలంగాణ, ఏపీ, ఆస్ట్రేలియా, అమెరికా.. ప్రపంచ నలుమూలల…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, ఒంగోలు విమానాశ్రయాలపై నేడు సమీక్ష నిర్వహించారు. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పైన కూడా సమీక్షించారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు హాజరయ్యారు. దత్తపీఠాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు: నేడు విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సందర్శించారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆయనకు స్వాగతం పలికారు.

Read More