మెడికల్ సీట్ల భర్తీ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదని పేర్కొంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. వైద్య విద్యకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో దాదాపు వెయ్యికిపైగా సీట్లు ఖాళీగా ఉండటంపై ఏప్రిల్ 2023లో సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఓ వైపు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యుల కొరత ఉండటం,మరోవైపు ఇలా సీట్లు మిగిలిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.దీంతో చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
Author: admin
‘క’తో గతేడాది తన కెరీర్‌లోనే సూపర్‌హిట్‌ను అందుకున్నారు నటుడు కిరణ్ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దిల్ రూబా’.ఈ చిత్రానికి విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుంది.మనసుని హత్తుకునే ప్రేమ కథతో ఇది రూపుదిద్దుకుంటుంది.ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఈరోజు ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఇందులో ప్రేమికుడి పాత్రలో కిరణ్ అబ్బవరం నటన,డైలాగ్స్ యువతను ఆకట్టుకునేలా సాగింది.ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని రవి,జోజో జోస్ నిర్మిస్తున్నారు. https://youtu.be/2POCy4fGSTE?si=DhFY7BOdHoPHo7wI
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘం నియమించిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో బెంగళూరులో ఈ బృందం పర్యటించింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో సమావేశమైంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిగారు, హోమ్ మంత్రి అనిత గారు, ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే కలిసి ఈ పథకం అమలు చేయడం వల్ల అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం,లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సంధ్య థియేటర్ ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది.ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ ఘటన విషయంలో అరెస్ట్ అయిన బన్నీ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే.ఈ మేరకు దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తాజాగా ఆయనకు పూచీకత్తుతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో ప్రదర్శనలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందింది.ఆమె తనయుడు శ్రీతేజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ11గా పేర్కొన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్,నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో అదితి శంకర్,దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈరోజు సాయి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రబృందం తాజాగా ‘ఓ వెన్నెల’ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది.సాయి శ్రీనివాస్,అదితి శంకర్‌పై చిత్రీకరించిన ఈపాటకు తిరుపతి జావన లిరిక్స్ అందించారు.అనురాగ్ కులకర్ణి,యామిని ఆలపించారు.ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. https://youtu.be/0l2Y5qgG454?si=hIoFPgsOXaakVrSt
డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతోన్న విషయం తెలిసిందే.బీజేపీ,ఆప్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.తాజాగా ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.డిల్లీ డెవలప్‌మెంట్ అథారటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ప్రధాని నేడు ప్రారంభించారు.అనంతరం జరిగిన సభలో ఇటీవల చోటుచేసుకున్న సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని ఆయన అన్నారు.తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదన్నారు.ఈ సందర్భంగా అధికార పార్టీని విపత్తుగా పేర్కొన్న మోదీ.. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
నూతన సంవత్సరం వేడుకల వేళ అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రపంచం ముందు అమెరికాను నవ్వులపాలు చేశారంటూ డెమోక్రట్లపై విరుచుకుపడ్డారు.అమెరికా విఫలమైంది.ప్రపంచమంతా మనల్ని చూసి నవ్వుతోంది.సరిహద్దులు తెరిచిపెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.బలహీనమైన నాయకత్వమే వీటికి కారణం.డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐ, డెమోక్రట్ల ప్రభుత్వం, స్థానిక న్యాయవాదులు తమ విధిని సరిగా నిర్వర్తించడం లేదు.రాజకీయ ప్రత్యర్థులపై చట్ట విరుద్ధమైన దాడి చేయడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు’ అని ఆయన ట్విట్టర్ వేదిక పోస్ట్ పెట్టారు.
దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ ఎద్దేవా చేసింది.ఈ మేరకు పాంగ్యాంగ్‌లోని కేసీఎన్‌ఏ (కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) కథనం వెలువరించింది.చాలా అరుదుగా మాత్రమే దక్షిణ కొరియా విషయాలపై ఈ పత్రిక స్పందిస్తుంది.డిసెంబర్ 3వ తేదీన మార్షల్ లా తర్వాత కీలుబొమ్మ దేశమైన దక్షిణ కొరియాలో అసాధారణంగా అభిశంసనలు చోటు చేసుకొంటున్నాయి.ఇప్పటికే అధ్యక్షుడిపై అరెస్టు వారెంట్ జారీ అయింది.అక్కడ సామాజిక,రాజకీయ గందరగోళం నెలకొందని పేర్కొంది. దక్షిణ కొరియాలో ప్రభుత్వ వ్యవస్థలను ఉత్తర కొరియా తరచూ అమెరికా చేతిలో కీలు బొమ్మలుగా అభివర్ణిస్తుంది.డిసెంబర్ 3వ తేదీన మార్షల్ ప్రకటనపై మాత్రం ఆ దేశ పత్రికలు ఏమీ స్పందించలేదు.కిమ్ పాలనలో రాజకీయ సుస్థిరతను హైలైట్ చేసేందుకు ఈ కథనాలు,వ్యాఖ్యానాలు ప్రచురిస్తున్నట్లు దక్షిణ కొరియా సంస్థ యోన్ హాప్ రాసుకొచ్చింది.
భారీ లాభాలలో నిన్న దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నేల చూపులు చూశాయి. భారీ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 720 పాయింట్ల నష్టంతో 79,223 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 183 పాయింట్లు లాభపడి 24,004 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.78గా కొనసాగుతోంది. టైటాన్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనీలివర్, రిలయన్స్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి.
ప్రపంచ సంపన్నుడు స్పేస్ ఎక్స్ టెస్లా వంటి మేటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్ 108 మిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లను కొన్ని ఛారిటీలకు విరాళంగా ఇచ్చారు. రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా టెస్లా ఈమేరకు తెలిపింది. టెస్లాలో ఎలాన్ మస్క్ కు 12 శాతానికి పైగా వాటాలు న్నాయి. అందులో నుండి 2,68,000 షేర్లు ఆయన ఛారిటీ కోసం ఇచ్చి తన దాతృత్వం చాటుకున్నారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. మస్క్ ఇంతకుముందు కూడా పలు ఛారిటీలు చేసిన సంగతి తెలిసిందే. 2021 లో కూడా తను అధ్యక్షుడిగా ఉన్న మస్క్ ఫౌండేషన్ కోసం 5.74 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మంచి దాతృత్వ కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ చేస్తుంది.
