మొబైల్ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ సిద్ధమవుతున్నది.వాణిజ్య సమాచారం,ప్రకటనలను కస్టమర్లు స్వీకరించేందుకు ఇచ్చే అనుమతులను ట్రాయ్ డిజిటల్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంకు బదిలీ చేసేందుకు ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించబోతున్నట్టు ట్రాయ్ చైర్మన్ లహోటీ తెలిపారు.క్రమబద్ధీకరణ ప్రక్రియను గాడిలో పెట్టడం కోసం ఉద్దేశించిన ఈ చర్యలు కస్టమర్లు ప్రస్తుతం ఇచ్చిన అనుమతులను తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తాయి.ఆ అనుమతులను ఉపసంహరించుకునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తాయి.వాయిస్ కాల్స్‌కు, ఎస్‌ఎంఎస్‌కు వేర్వేరుగా స్పెషల్ టారిఫ్ వోచర్స్ (ఎస్‌టీవీ)లను ఆఫర్ చేయాలని ఇటీవల ట్రాయ్ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Author: admin
ఒళ్లు నొప్పులు,జ్వరం వంటి వాటికి భారతీయులు విరివిగా తీసుకునే మందుబిల్ల ‘పారాసిటమాల్’.ఇకపై దీనిని దేశీయంగా తయారు చేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది.శాస్త్రీయ,పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన ‘పారాసిటమాల్’ను తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.పారాసిటమాల్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాల దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.పారాసిటమాల్ తయారీకి సంబంధించి దేశీయ టెక్నాలజీని సీఎస్‌ఐఆర్ అభివృద్ధి చేసిందని నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి జితేంద్ర వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ రాజేపడడం లేదు.ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఎంత వరకు అయిన వెళ్తున్నారు.కల్కాజీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్ బిధూరి ప్రత్యర్థులపై ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఆదివారం జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ..తాను గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చెంపలంత నునుపుగా మారుస్తానని అన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ సహచర ఎంపీని దూషించి ఎలాంటి శిక్ష అనుభవించని వ్యక్తి నుంచి ఇంతకు మించిన ప్రవర్తన ఏం ఆశిస్తామని ప్రశ్నించింది. విమర్శలు పెరగడంతో బిధూరీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.మరోవైపు ఆయన డిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీపైనా బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆతిశీ తన తండ్రి పేరునే మార్చేశారని ఆరోపించారు.ఒకప్పుడు మర్లేనాగా ఉన్న ఆతిశీ ఇప్పుడు సింగ్ అయ్యారని,ఆమె తన తండ్రినే మార్చేశారని అన్నారు.బిధూరీ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆప్ అధినేత అరవింద్…
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప 2 ది రూల్’ బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో సరికొత్త రికార్డు వచ్చి చేరింది.రూ.806 కోట్లు (నెట్) వసూలు చేసి హిందీ బాక్సాఫీస్ వద్ద నెం:1 చిత్రంగా ఇది నిలిచింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ…చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా స్పెషల్ ప్రోమో విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హవా కొనసాగుతోంది.సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నాలుగు వారాల్లో రికార్డు వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది.రూ.1799 కోట్లకు (గ్రాస్) పైగా వసూళ్లను రాబట్టిందని ఇటీవల టీమ్ ప్రకటించింది.టికెట్ల విక్రయంలోనూ ‘పుష్ప2’ సరికొత్త రికార్డు సృష్టించింది.బుక్‌మై షోలో 19.5మిలియన్ టికెట్లు విక్రయమయ్యాయి.
విశాల్ హీరోగా సుందర్.సి తెరకెక్కించిన చిత్రం “మద గజ రాజా”.ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలుగా నటించారు.దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇది విడుదలవుతోంది.ఈ సినిమా ప్రెస్‌మీట్ ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఇందులో పాల్గొన్న విశాల్ కాస్త అనారోగ్యంగా కనిపించారు.స్టేజ్‌పై మాట్లాడే సమయంలో ఆయన తడబడ్డారు.చేతులు కూడా వణికిపోతూ కనిపించాయి.వైరల్ ఫీవర్‌తో ఆయన కార్యక్రమానికి వచ్చారని.. అందుకే ఆవిధంగా ఇబ్బందిపడ్డారని అక్కడే ఉన్నయాంకర్ తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.విశాల్‌కు ఏమైందని అందరూ మాట్లాడుకుంటున్నారు.గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు,
ప్రముఖ హోటల్ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త చెక్-ఇన్ పాలసీ తీసుకొచ్చింది.ఈ ఏడాదిలో అమల్లోకి వచ్చే కొత్త మార్గదర్శకాలు పరిచయం చేసింది.ఇందులో భాగంగా పెళ్లికాని జంటలు రూమ్ బుక్ చేసుకునేందుకు వీలుండదు.ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోవాలంటే విలువైన ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది.ఈ కొత్త పాలసీని ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ భారత్ చేరినట్లు తెలుస్తోంది.ఈ మేరకు బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూ మన్ మెటాన్యు మోవైరస్ (HMPV) పాజిటివ్ అని తేలింది.ఈ కేసు గురించి తమకు సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.అయితే తమ ల్యాబులో దీన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని వెల్లడించింది.
భారత్ క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వర్థమాన క్రికెటర్ రిషబ్ పంత్ ప్రశంసలు కురిపించాడు. ధోనిని భర్తీ చేయడం కష్టమని ధోనీ దేశానికి హీరో అని వ్యక్తిగతంగా మరియు ఒక క్రికెటర్ గా ధోనీ నుండి తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపాడు. ధోనీ తనకు మార్గదర్శి అని తను ఉన్నాడంటేనే జుట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నాడు. ఏదైనా సమస్య ఉంటే ధోనీతో పంచుకుంటానని దీంతో పరిష్కారం కూడా వస్తుందని తెలిపాడు. వికెట్ కీపర్ గా క్రికెటర్ గా ఓర్పు ఎంతో కీలకమని సలహా ఇస్తుంటాడని వివరించాడు. ప్రశాంతంగా ఉంటూ 100 శాతం ప్రదర్శన కనబరిచేలా ప్రయత్నించాలని చెప్తుంటాడని పంత్ తెలిపాడు. ధోనీతో ఎప్పుడూ తన రికార్డులు పోల్చుకోనని అన్నాడు. ఇక ఎన్నో విజయాలతో తనదైన శైలిలో భారత క్రికెట్ కు కెప్టెన్ గా వికెట్ కీపర్ గా బ్యాటర్ గా ఎనలేని సేవలందించిన ధోనీ తర్వాత…
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ కారిడార్ ను ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సాహిబాబాద్, ఢిల్లీ లోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్.ఆర్.టీ.ఎస్ కారిడార్ లో 13 కిమీ అదనపు సెక్షన్ ను ప్రారంభించారు. నమో భారత్ కారిడార్ ఢిల్లీ మీరట్ కు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వంతో విసిగిపోయారని ప్రస్తుతం వారు ఢిల్లీని ప్రగతి పథంలో ముందుకు నడిపించే ప్రభుత్వం కోరుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోడీనే ఢిల్లీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.12,200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం స్టూడెంట్స్ తో కలిసి ప్రధాని మోడీ సాహిబాబాద్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు. ఇక ఈ రూట్ లో కొత్తగా ప్రారంభించిన రైలు…
ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన అలసందలు మొలకెత్తాయి. అత్యల్ప గ్రావిటీ ఉండే వాతావరణంలో అవి నాలుగు రోజులలోనే మొలకెత్తాయి. స్పేస్ లో రాకెట్ ల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పేడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్) కోసం 2024 డిసెంబర్ 30న పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ద్వారా రెండు శాటిలైట్ లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. కాగా, ఆ రాకెట్ లోని పోయెమ్ -4 ద్వారా 24 పేలోడ్ లను ఆర్బిట్ లోకి పంపింది. ఇందులో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) అనే సాధనం కూడా ఉంది. భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరం. దీనిని కేరళ లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తయారు చేసింది. ఇందులో 8 అలసంద గింజలు ఉన్నాయి. అత్యల్ప గ్రావిటీ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం…
