Author: admin

నారావారి పల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ తో పాటు నారా కుటుంబసభ్యులు పాల్గొన్నారు. రామ్మూర్తినాయుడు కుమారుడు, సినీనటుడు నారా రోహిత్ కర్మక్రియలు నిర్వహించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.

Read More

బంగ్లాదేశ్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్ (ISKON)ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి.ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ ముహమ్మద్ అసదుజ్జమన్‌ ప్రకటన చేశారు.ఇస్కాన్‌ను బ్యాన్ చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ సుప్రీంకోర్టులో ఆయన స్పష్టం చేశారు. హిందువులపై దాడులు,దేవాలయాలు విధ్వంసం..! హిందువుల పరిస్థితి దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన మంత్రి ముహమ్మద్ యూనస్ ప్రభుత్వ ప్రోద్బలంతో, ఇస్లామిక్ ఛాందసవాదులు ఇప్పుడు హిందువులకు వ్యతిరేకంగా బహిరంగంగా వీధుల్లోకి వచ్చి హిందువులపై దాడులు చేస్తున్నారు.హిందువులపై దాడులకు నిరసనలలో పాల్గొన్న ఇస్కాన్ చెందిన చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లా దేశ్ పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు.ఈ చర్య గురించి బంగ్లాదేశ్‌లోని వాక్ స్వాతంత్ర్యం,మత సామరస్యం,మైనారిటీ కమ్యూనిటీల రక్షణ గురించి పలు హిందు సంస్థలు తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే పలువురు ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు,దుకాణాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు.ఇప్పటికే…

Read More

సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పి.వి. సింధు, లక్ష్యసేన్ ముందంజ వేశారు. తాజాగా జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21-17, 21-15తో అన్మోల్ ఖర్ పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్లోలో టాప్ సీడ్ లక్ష్యసేన్ 21-12, 12-2తో మలేసియాకు చెందిన ఐదిల్ షోలె పై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్ లలో ఇరా శర్మ 21-13, 21-19తో దీప్షిక సింగ్ పై , ఉన్నతి హుడా 21-12, 21-16తో థాయ్ లాండ్ కు చెందిన తమోన్వాన్ పై,తస్నిమ్ మీర్ 21-18, 21-15తో చైనీస్ తైపీకి చెందిన యి ఎన్ సీ పై, దేవిక సిహాగ్ 19-21, 21-18,21-11తో నవ్య కందేరిపై, , అనుపమ 19-21, 22-20, 21-15తో అజర్ బైజాన్ కు చెందిన ఫాతిమా పై, శ్రియాంషి వలిశెట్టి 21-11, 8-3 తో సామియాపై,మాళవిక…

Read More

ఇటీవల వయానాడ్‌ లోక్ సభ స్థానం నుండి విజయం సాధించిన ప్రియాంక వాద్రా గాంధీ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ మేరకు ఆమెతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణస్వీకారం చేయించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రియాంక భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.తన సమీప అభ్యర్థిపై ఏకంగా 4.04 లక్షలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా..ఆయన రికార్డును ప్రియాంక బ్రేక్ చేశారు. #WATCH | Congress leader Priyanka Gandhi Vadra takes oath as Member of Parliament in Lok Sabha(Video source: Sansad TV/YouTube) pic.twitter.com/eaLJzpTY2y— ANI (@ANI) November 28, 2024

Read More

అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహార వీరమల్లు’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పీరియాడికల్ కథాంశంతో రూపొందుతోంది. అత్యద్భుతమైన అనుభవాన్ని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించింది. పవన్ తో పాటు 400 – 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. ఈ సన్నివేశం అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఈ వారాంతంలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుందని పవన్ సహా భారీగా ఆర్టిస్ట్…

Read More

ఒక సాధారణ వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు.ఎదో ఒక రోజు లక్ వరిస్తుందని గట్టిగా నమ్ముతాడు..ముందుకు సాగుతారు.ఆతడు కష్టాన్ని చూసి అదృష్ట దేవత తరించి అమూలమైన సంపద అందిస్తుంది…ఇలాంటి సీన్స్ మనం మామూలుగా సినిమాల్లో చూస్తాం.కానీ నిజం జీవితంలోనూ ఇలాంటిదే జరిగింది.ఒక వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే కోట్లు గెలుచుకుని యూకే సంపన్నుల్లో ఒకడిగా మారిపోయాడు.నేషనల్‌ లాటరీ టికెట్‌ కొన్న అతడికి ఏకంగా 177 మిలియన్‌ పౌండ్లు.. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.1,800 కోట్లు లభించాయి.మంగళవారం నిర్వహించిన డ్రాలో 07, 11, 25, 31, 40 నంబర్లు విజయాన్ని చేకూర్చాయి.మొత్తం యూకేలోనే మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ నిల్చింది. అదృష్టవంతుడి పేరు వెల్లడించేందుకు నిర్వాహకులు నిరాకరించారు.ఈ విజేత ఈ ఏడాది సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలోని మ్యుజిషియన్స్‌ హ్యారీ ైస్టెల్స్‌ (175 మిలియన్‌…

Read More

చేయని తప్పుకు 30 ఏళ్ల జీవితాన్ని కోల్పోయాడో వ్యక్తి…పెళ్లి చూసుకుని పెళ్ళాం పిల్లలతో ఉండాల్సిన అతను మూడు దశాబ్ధాల పాటు కారాగారంలో జీవితాన్ని వెళ్ళబుచ్చాడు.కుటుంబాన్ని కోల్పోయాడు..కట్ చేస్తే ఆతనికి రూ.110 కోట్లు వరించాయి.ఇంతకీ అదెలా అంటే..నిరపరాధి అయినప్పటికీ దొంగతనం,హత్య కేసులో దాదాపు మూడు దశాబ్దాలపాటు జైలులో మగ్గిపోయిన మైఖేల్‌ సూలివాన్‌ (64)కు దాదాపు రూ.110 కోట్ల పరిహారం లభించింది.1986లో మసాచుసెట్స్‌లోని ఫ్రామింగ్‌హామ్‌లో విల్‌ఫ్రెడ్‌ మెక్‌గ్రాత్‌ దొంగతనం, హత్యకు గురయ్యాడు.ఈ కేసులో గ్యారీ గ్రేస్‌, మైఖేల్‌ను గ్యారీ అనుమానితులు.మైఖేల్ ను ఇరికించి గ్యారి పక్కకు తప్పుకున్నాడు. దీంతో మైఖేల్‌కు యావజ్జీవ జైలు శిక్ష పడింది.మసాచుసెట్స్‌ జ్యూరీ ఇటీవల ఈ కేసులో మైఖేల్‌ నిర్దోషి అని తీర్పు చెప్పింది.ఆయనకు నష్టపరిహారంగా రూ.110 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.ఆయన జైలులో ఉన్న కాలంలో ఆయన తల్లి,నలుగురు తోబుట్టువులు మరణించారు.జైలులో అనేకసార్లు ఆయన దాడులకు గురయ్యారు.

Read More

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ కరెన్సీ పట్ల కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.మహాత్ముని చిత్రంతో ఉన్న కొత్త సీరిస్‌ 500 రూపాయల నకిలీ నోట్లు 2018-19 నుంచి 2023-24 కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి.అలాగే 2020-21 నుంచి 2,000 రూపాయల నకిలీ నోట్లు కూడా మూడు రెట్లు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ప్రకటించారు.దేశంలో నకిలీ నోట్లపై లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా సమాధానం ఇచ్చారు.

Read More

ఊరు అన్నక వెజిటేరియన్స్ ఉండడం సహజం.కానీ ఊరంతా శాఖహా రులుగా ఉండడం మనం ఎక్కడా చూసి ఉండము.అవును నిజమే..మన దేశంలోని ఒక గ్రామం ఇలాంటి కట్టుబాటునే అవలంభిస్తుంది.ఇంతకీ ఆ గ్రామం పేరేంటి? వాళ్ళు శాఖాహారులుగా మారడానికి కారణం ఏమిటి?బీహార్‌లోని గయ జిల్లాలో ఉన్న బిహియాన్‌ గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది.ఇక్కడి ప్రజలు ఆచరించే సాంస్కృతిక,ఆధ్యాత్మిక ఆచారాలు అందరినీ ఆకట్టుకుంటాయి. 300 సంవత్సరాల నుండి ఈ గ్రామస్థులు శాకాహారులుగానే కొనసాగుతున్నారు.వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలని వీరు విశ్వసిస్తున్నారు.ఈ ఊరులో పుట్టిన వాళ్ళు,ఉంటున్న వాళ్ళే కాకుండా ఇక్కడి వారిని పెళ్లాడిన యువతులు కూడా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు.

Read More

నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది.ఇది రిజర్వేషన్ల విధానానికే విరుద్ధమని, రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించడమేనని స్పష్టం చేసింది. సెల్వరాణి అనే మహిళ హిందూ తండ్రి, క్రైస్తవ తల్లికి జన్మించింది.పుట్టిన కొన్నిరోజులకే బాప్టిజం తీసుకొని,క్రైస్తవాన్ని ఆచరిస్తుంది.పుదుచ్చెరిలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేందుకు తన తండ్రి కులమైన వెల్లువన్‌గా తనకు ఎస్సీ సర్టిఫికెట్‌ జారీ చేయించాలని ఆమె మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.ఆమె వినతిని హైకోర్టు జనవరి 24న తిరస్కరించింది.దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పంకజ్‌ మితల్‌, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌..హైకోర్టు తీర్పును సమర్థిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు.

Read More