Author: admin

నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది.ఇది రిజర్వేషన్ల విధానానికే విరుద్ధమని, రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించడమేనని స్పష్టం చేసింది. సెల్వరాణి అనే మహిళ హిందూ తండ్రి, క్రైస్తవ తల్లికి జన్మించింది.పుట్టిన కొన్నిరోజులకే బాప్టిజం తీసుకొని,క్రైస్తవాన్ని ఆచరిస్తుంది.పుదుచ్చెరిలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేందుకు తన తండ్రి కులమైన వెల్లువన్‌గా తనకు ఎస్సీ సర్టిఫికెట్‌ జారీ చేయించాలని ఆమె మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.ఆమె వినతిని హైకోర్టు జనవరి 24న తిరస్కరించింది.దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పంకజ్‌ మితల్‌, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌..హైకోర్టు తీర్పును సమర్థిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు.

Read More

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి – అదానీ మధ్య జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు,1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఏపీసీసీ చీఫ్ షర్మిల వినతి పత్రం అందజేశారు. ఈ డీల్ “అదానీ కి లాభం – రాష్ట్ర ప్రజలకు పెను భారం”. రూ.1.99 పైసలకు దొరికే విద్యుత్ ను రూ.2.49 పైసలకు కొన్నారు. అన్ని చార్జీలు కలుపుకుంటే యూనిట్ ధర 5 రూపాయలకు పైమాటేనని షర్మిల అనంతరం మండిపడ్డారు. ఇదే ధరతో 25 ఏళ్లకు డీల్ అంటే ఈ తరంతో పాటు రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని దుయ్యబట్టారు. లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీకి దోచి పెట్టినట్లే. అనాడు ప్రతిపక్షంలో తెలుగు దేశం పార్టీ ఇదో పెద్ద కుంభకోణం అంటూ ఆందోళనలు చేసింది. వెంటనే ఒప్పందాలు రద్దు చేయాలని…

Read More

ఏపీ సిఎం ఏపీ మారిటైమ్ పాలసీ 2024 పై సమీక్షించారు, ప్రపంచ స్థాయి మారిటైమ్ హబ్‌గా మారాలనే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024 పోర్ట్ లో అభివృద్ధి, ప్రాక్సిమల్ ఏరియా గ్రోత్, షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌లు మరియు అనుబంధ కార్యకలాపాలపై దృష్టి సారించనుంది. అధిక సామర్థ్యం గల పోర్టులు, కారిడార్ లింక్‌లు, ఫిషింగ్ హార్బర్‌ల కోసం పీ4 నమూనాలో పో పోర్టుల అభివృద్ధి, గ్లోబల్ షిప్‌బిల్డింగ్, రో-రో/రో-పాక్స్ వాటర్‌వేస్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, మారిటైమ్ విశ్వవిద్యాలయం వంటి పలు సంస్కరణలు పాలసీలో ఉన్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు మారిటైమ్ బోర్డును మరింత పటిష్టం చేయలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. క్లీన్ ఎనర్జీని ఉపయోగించి పోర్టులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వినూత్న విధానాలతో తీర ప్రాంతాలను అభివృద్ధి చేయడం మౌలిక వసతుల కల్పన, సమర్థ విధానం ద్వారా సుస్థిరాభివృద్ది సాధించాలని సూచించారు.

Read More

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ఆటగాళ్ల జాబితాలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (883 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (423) రవిచంద్రన్ అశ్విన్ (290) వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఆసీస్ పై భారీ శతకం నమోదు చేసిన యశస్వీ జైశ్వాల్ (825) బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ (736) 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ టాప్-10: 1.జో రూట్ (903) 2.యశస్వీ జైశ్వాల్ (825) 3.కేన్ విలియమ్సన్ (804), 4.హ్యారీ బ్రూక్ (778), 5.డేరీ మిచెల్ (743), 6.రిషబ్ పంత్ (736),7. స్టీవ్ స్మిత్ (726), 8.సౌద్ షకీల్ (724), 9.కమిందు మెండీస్ (716), 10.ట్రావిస్ హెడ్ (713). బౌలింగ్ టాప్-10: జస్ప్రీత్ బుమ్రా (883) 2. కగిసో రబాడా (872), 3. హాజల్ వుడ్…

Read More

ఈ ఏడాదిలో విమానాలకు భారీగా బెదిరింపులు వచ్చాయి.పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ విషయంపై చర్చలు జరిగాయి.ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ 2024లో ఇప్పటివరకు భారత విమానయాన సంస్థలకు 994 బూటకపు బాంబు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. 2022 నుంచి 2024 నవంబర్‌ 13 వరకు మొత్తం 1,143 బెదిరింపులు నయోదయ్యాయని వెల్లడించారు. ఇటువంటి బెదిరింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.బెదిరింపులకు పాల్పడుతున్న వారి లొకేషన్‌ గురించి సరైన సమాచారం తెలియకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని అన్నారు.ఇటువంటి చర్యలను కట్టడి చేయడానికి పౌర విమానయాన భద్రత మండలి,ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

Read More

కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి వివరించారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులను వరుసగా కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర పెద్దల ముందు ఉంచిన పవన్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలకమైన అంశాలను ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లను కేటాయిస్తే, దానిలో కేవలం రూ.2 వేల కోట్లను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరాలను ప్రధాని మోడీకి తెలిపారు. ఖర్చు చేసిన నిధుల వల్ల పూర్తయిన పనులు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా, నాసిరకంగా…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత సచివాలయంలో జరిగింది. సీఎం ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) గా మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గంజాయి సాగు గుర్తించి ధ్వంసం చేయ‌డానికి డ్రోన్లను వినియోగించాలని ఈసందర్భంగా లోకేష్ సూచించారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపొందించి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంద‌ని వివ‌రించారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేయాల‌ని క‌మిటీ సూచించింది. పంజాబ్ లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలని, ఇన్ ఫ్లూయెన్సర్స్ తో అవగాహన కల్పించాలని సూచించింది. గిరిజ‌నులు గంజాయి పండించకుండా అవగాహన కల్పించడంతో…

Read More

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో తమకు ఎలాంటి గొడవల్లేవని మైత్రి నిర్మాతలు స్పష్టం చేశారు.దేవితో తమ జర్నీ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని అన్నారు. ‘నేనంటే ప్రేమ ఉంటుంది.దానితో పాటు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి’ అని దేవీశ్రీ ప్రసాద్‌ అన్నారు. అందులో తప్పు ఏముంది.ఆయనతో మా బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని ‘రాబిన్‌ హుడ్‌’ ఈవెంట్‌లో తెలిపారు.మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి.నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా తెరపై మన పేరైనా..అడగకపోతే ఎవరూ ఇవ్వరు.రవిశంకర్‌ (నిర్మాత) సర్‌…నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు.ఎందుకంటే…నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు, టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు, టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ).మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి.నా విషయంలో మీకు కంప్లైట్స్‌ ఎక్కువగా ఉంటాయి.ఈ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడూ రాంగ్‌ టైమింగ్‌ అన్నారు.ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్‌ ఉండదు.ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది.నేనెప్పుడూ ఆన్‌ టైమ్‌…

Read More

అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని మరో పరిశ్రమ నుండి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబొరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సిఎం ఆదేశించారు.

Read More

నేటి ట్రేడింగ్ లో ఆద్యంతం ఒడిదుడుకుల్లో సూచీల పయనం సాగినా దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సూచీలు జోరుకు దోహాదం చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ బీఎస్ఈలో 230 పాయింట్లు లాభపడి 80,234 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 80 పాయింట్లు లాభంతో 24,274 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.44గా కొనసాగుతోంది. అదానీ కంపెనీపై వచ్చిన ఆరోపణలపై ఆ సంస్థ వివరణ ఇచ్చిన సందర్భంగా దాదాపు అన్ని స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ఎన్.టీ.పీ.సీ, అదానీ పోర్ట్స్, హెచ్.డీ.ఎఫ్.సీ, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More