Author: admin

గిరిపుత్రుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గిరి ఆరోగ్య కేంద్రాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డోలీల మోతలకు స్వస్తి పలకాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కంటైనర్ ఆస్పత్రినుంచి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలసలో దీనిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి ద్వారా గిరిజనుల ఆరోగ్య సమస్యలు చాలా వరకు తీరుతాయి. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు మైదాన ప్రాంతాలకు రావాల్సిన పనిలేదని మంత్రి వివరించారు.గర్భిణులకు, వృద్ధులకు, అత్యవసర సమయాల్లో సత్వర వైద్యం అందుతుంది. ఈ గిరి ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులు పీహెచ్ సీ డాక్టర్లు.. మూడు రోజులు ఏఎన్ఎం, ఎంఎల్ హచ్ పీలు ఓపీ సేవలు అందిస్తారని మంత్రి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. మలేరియా, డెంగ్యూ సహా 14 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ చేస్తారు. టీకాలు కూడా…

Read More

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతితో సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా నేడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఈసందర్భంగా కేంద్రమంత్రికి తెలిపారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్ గా వ్యవహరిస్తుందని వివరించారు. ఈ ప్రతిపాదననను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా…

Read More

ప్రముఖ నటి నయనతార,ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌పై తమిళ స్టార్ హీరో ధనుష్‌ దావా చేశారు.ఈ మేరకు ఆయన పర్మిషన్‌ లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను డాక్యుమెంటరీలో వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ధనుష్‌ కు చెందిన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.నయన్‌ దంపతులపై సివిల్‌ సూట్‌ వేసింది.ఈ పిటిషన్‌ పరిశీలించిన న్యాయస్థానం విచారణ చేపట్టడానికి అంగీకారం తెలిపిందని సమాచారం.

Read More

బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రచారకుడు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడం భారత్ లో కలకలం రేపుతోంది. ఈ విషయానికి సంబంధించి, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కృష్ణదాస్ అరెస్ట్ పై అందరం కలిసికట్టుగా పోరాడుదామని పిలుపు నిచ్చారు.బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తనను తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైనికులు రక్తం చిందించారని…ఆనాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో చేసిన యుద్ధంలో దేశ వనరులు ఖర్చవడంతో పాటు మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.ఈ మేరకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. Let’s all unite together in condemning the detention…

Read More

నటి కీర్తి సురేశ తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలకు స్పష్టతనిచ్చారు. స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తమ 15 సంవత్సరాల బంధం ఇక జీవితాంతం కొనసాగుతుందని తెలిపారు. ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ పోస్ట్ కు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆంటోనీ ఇంజినీరింగ్ పూర్తిచేసిన కొంతకాలం పాటు విదేశాల్లో ఉద్యోగం చేశాడు. కేరళలో అతడికి పలు వ్యాపారాలు ఉన్నాయని, ప్రస్తుతం వాటిని చూసుకుంటున్నట్టు తెలిస్తోంది. 15 years and counting ♾️🧿It has always been.. AntoNY x KEerthy ( Iykyk) 😁❤️ pic.twitter.com/eFDFUU4APz— Keerthy Suresh (@KeerthyOfficial) November 27, 2024

Read More

ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది.ఈ అంశాన్ని ఎక్స్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోస్ట్ చేశారు.‘శుభవార్త…నేను ఇజ్రాయెల్ – లెబనాన్‌ల ప్రధానులతో మాట్లాడాను.టెల్‌అవీవ్ – హిజ్బుల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని ఆమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయమని బైడెన్ అన్నారు.కాగా ఆమెరికా దౌత్యంతో లెబనాన్‌లో యుద్ధానికి ముగించడానికి మార్గం సుగమమయింది.ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ నుండి వైదొలగల్సి ఉండగా, లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది.ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల…

Read More

నటుడు సుబ్బరాజు ఓ ఇంటివాడు అయ్యారు.నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.తన పెళ్లికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.పెళ్లి డ్రెస్‌లో వధువుతో ఉన్న ఫోటోను సుబ్బరాజు షేర్ చేయడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.సుబ్బురాజు వివాహం చేసుకున్న వధువు వివరాల కోసం నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో వెతుకుతున్నారు.ఆమెకు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు సుబ్బరాజు వెల్లడించలేదు.

Read More

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో “కృష్ణవేణి సంగీత నీరాజన” కార్యక్రమం జరగనుంది. డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ నేడు ఏపీ సీఎం చంద్రబాబుని ఆహ్వానించారు. ఎకో, టెంపుల్, క్రూయిజ్, అడ్వెంచర్, రీజినల్, వెల్ నెస్ టూరిజం, టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read More

అక్కినేని ఇంట మరో పెళ్లి సందడి మొదలైంది. సైలెంట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ అక్కినేని ఇంత వరుసగా వివాహాలు జరగనున్నాయి.మరో వారం రోజులో నాగ చైతన్య పెళ్లి జరగనున్న విషయం తెలిసింది.తాజాగా అఖిల్ కూడా పెళ్లికి సిద్ధమయ్యారు.ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది.హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్ని నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.కాబోయే జంట ఫొటోలను కూడా అందులో షేర్ చేశాడు. దీంతో అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.జైనబ్‌తో మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం.కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు…

Read More

గ్రామీణ ప్రాంత మహిళలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే నూతన టెక్స్ టైల్ పాలసీ ముసాయిదాను ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఆమోదించారు. నూతన టెక్స్ టైల్ పాలసీపై తాజాగా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి ఎస్ సవిత, అధికారులు పాల్గొన్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా రూపొందించిన నూతన టెక్స్ టైల్ పాలసీ ముసాయిదా పై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. కొత్త పాలసీలో వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.

Read More