Author: admin

గోవా వేదికగా జరిగే సినిమా పండుగ ఇఫ్ఫీ.గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.యువతరానికి సూచనలు చేశారు.ఈ మధ్యకాలంలో చాలా మంది డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

Read More

డిసెంబర్ 4న సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా పంపాలని వివిధ శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల అమలు, తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ,కొత్త రేషన్ కార్డుల మంజూరు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Read More

బాలీవుడ్ నటి మలైకా అరోరా కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టారు.ఆమె కుమారుడు అర్హాన్ ఖాన్ కలిసి ఓ రెస్టారంట్ స్టార్ట్ చేశారు.90 ఏళ్ల నాటి ఇండో పోర్చుగీస్ బంగ్లాను రెస్టారెంట్ గా సిద్ధం చేయించారు.దానికి స్కార్లెట్ హౌస్ పేరు పెట్టారు. ముంబైలో కాస్ట్లీ ప్రాంతంగా భావించే బంద్రాలోఇది ఉంది.వచ్చే నెల 3వ తేదీన ఇది ప్రారంభం కానుంది.మలైకా కలల ప్రాజెక్టు కావడంతో ఆమె దగ్గర ఉండి పనులు చేయిస్తుంది. ఫుడ్ బిజినెస్ లోకి రావడం పై గతంలో ఆమె స్పందించారు.తనకు ఫుడ్ అంటే ఎంతో ఇష్టం అన్నారు.అలాగే తన కుమారుడికి కూడా ఫుడ్ మీద చాలా ఇష్టం ఉందన్నారు. ‘ మేమిద్దరం ఎక్కువగా ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం.అందుకే మేము హోటల్ బిజినెస్ మొదలు పెట్టలనుకుంటున్నాం. అని తెలిపారు.

Read More

స్టైల్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.ఈ ఫ్రెండ్షిప్ తోనే వీరిద్దరూ కానుకలు ఇచ్చిపుచుకుంటారు.తన రౌడీ బ్రాండ్ నుండి విజయ్ గతంలో పలుమార్లు బన్నీ కోసం దుస్తులు రెడీ చేయించి పంపించారు.పుష్ప 2 విడుదల దగ్గర అవుతున్న తరుణం లో మరోసారి అదే సంప్రదాయాన్ని ఫాలో అయ్యారు.బన్నీ కోసం స్పెషల్ గా దుస్తులు డిజైన్ చేసి పంపించారు.దీని ఫోటోలు బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయ్ కి థాంక్స్ చెప్పారు.

Read More

సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో టాప్ సీడ్ సింధు 21-10, 12-21, 21-15తో ఇరా శర్మపై విజయం సాధించింది. మరోవైపు ఉన్నతి హుడా 21-18, 22-20తో థాయ్ ల్యాండ్ కు చెందిన పోర్న్ పికాపై, తస్నిమ్ మీర్ 21-15, 13-21, 21-7తో అనుపమ ఉపాధ్యాయాపై, శ్రియాంషి వలిశెట్టి 21-12, 21-15తో మాళవిక బాన్సోద్ పై గెలిచి క్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్ లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్ చేరాడు. ప్రిక్వార్టర్స్ లక్ష్యసేన్ 21-14, 21-13తో ఇజ్రాయెల్ కు చెందిన డానిల్ దుబొవెంకో పై గెలుపొందాడు.

Read More

అండర్-19 ఆసియాకప్ నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ 50 ఓవర్ల ఫార్మాట్ టోర్నమెంట్ లో ఐసీసీ సభ్య దేశాలు భారత్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ తో సహా అసోసియేట్ జట్లు నేపాల్, జపాన్, యూఏఈ, కూడా ఈ కప్లో బరిలో దిగుతున్నాయి. ఈ జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్, జపాన్, యూఏఈ గ్రూప్- ఎలో ఉన్నాయి. శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ గ్రూప్-బిలో పోటీపడుతున్నాయి. టోర్నీ మొదటి రోజు అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్, శ్రీలంక-నేపాల్ పోటీపడుతున్నాయి. మహ్మద్ అమన్ సారథ్యంలోని భారత జట్టు ఈనెల 30న పాకిస్థాన్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది.

Read More

స్వయం ఉపాధికై చిన్న పరిశ్రమలు స్థాపించాలనే ఆసక్తిగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువత, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు, గ్రామీణ హస్త కళాకారులు, మహిళలు, మహిళా శక్తిసంఘాలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులు కోసం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచనల మేరకు జిల్లా పరిశ్రమల శాఖ వారి సహకారంతో ఎం.ఎస్.ఎం.ఈ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర పధకాల ద్వారా రుణాల మంజూరు విషయమై అవగాహన సదస్సు మరియు M.S.M.E నందు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు హాజరు అవుతారు. ఈనెల 30న నరసరావుపేట, భువనచంద్ర టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమం జరగనుంది.

Read More

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రెస్‌ మీట్ లో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1, 2021న సెకీతో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఒప్పందం జరిగిందనే పేర్కొన్నారు. సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, 4 డిస్కంలు ఈ ఒప్పందంలో భాగస్వాములని పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రక ఒప్పందంతో రాష్ట్రానికి, రైతులకు అండగా నిలిచిన కేంద్రాన్ని అభినందించాలని అన్నారు.ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఇదే సెకీ, ఇవే ఇన్సెంటివ్స్ ఇచ్చి పలు రాష్ట్రాలకు విద్యుత్ అమ్మిందని తెలిపారు. ఆ రాష్ట్రాలు అన్నింటికన్నా ఏపీ 12పైసలు తక్కువకు కొన్నదని వెల్లడించారు.ఇలా సంపద సృష్టి నేను చేస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారని చెప్పారు. మంచి చేసిన నాపైనే నిందలు వేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఐదేళ్లు అభివృద్ధి దిశగా అడుగులు వేసిన రాష్ట్రం.. ఆరు నెలలుగా తిరోగమనం దిశగా వెళ్తోందని విమర్శించారు. గత ఐదేళ్లు ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు…

Read More

అరుదైన పర్యాటక ప్రదేశమైన కడప జిల్లాలోని గండికోటను పూర్తి స్థాయిలో మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ‘గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా’ గా‌ గండికోటను అభివృద్ధి చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు గండికోట ఒక ప్రత్యేక ప్రాజెక్టని వారి పూర్వీకుల ప్రదేశంగా గండికోటకు పేరు ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాజెక్టును తీసుకుని వాటిని పూర్తి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పెమ్మసాని వివరించారు.

Read More

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, విభిన్న చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం “గేమ్ ఛేంజర్”.ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.తాజాగా ఈ ఈ చిత్రం నుండి మూడో పాట విడుదల అయింది. నానా హైరానా.. ప్రియమైన హైరానా..’ అంటూ సాగే ఈ మెలోడీ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.తమన్ సంగీత దర్శకత్వంలో శ్రేయ గోషాల్, కార్తీక్ పాడారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శ్రీకాంత్,అంజలి,సునీల్, ఎస్ జె సూర్య ముఖ్య పాత్రల్లో నటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఇప్పటికే విడుదలైన అయిన రెండు పాటలు మంచి వ్యూస్ అందుకున్నాయి.తాజా విడుదలైన అయిన పాట యువతను మెప్పించేలా ఉంది.ఈ పాట కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేశారని…

Read More