డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్ కు మద్దతుగా ఎక్స్ వేదికగా అగ్రనటుడు అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో షేర్ చేశారు. మాదక ద్రవ్య లేని సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రభావశీలమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దామని,సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దామని తన సందేశంలో తెలిపారు. Let’s unite to support the victims and work towards building a safer, healthier society.Humbled to join this impactful initiative by the Government of Telangana.@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tZ5Rkiw5Lg— Allu Arjun (@alluarjun) November 28,…
Author: admin
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో ‘బచ్చల మల్లి’ అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నాడు.హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా,బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందిస్తున్నారు.ఈ డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.ఈ చిత్రంలో నరేష్ జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది.సాయి కుమార్, రోహిణి,రావు రమేష్, ఫారీదా అబ్దుల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. https://youtu.be/0JN-cxQe2to?si=r-8_Nou_1FVPFQlk
జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజధాని రాంచీలోని మొరహాబాద్ మైదానంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. 81 స్థానాలకు గాను జేఎంఎం 34 స్థానాలలో బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్) (ఎల్) 2, ఏజేఎస్సూపీ, లోక్ జన శక్తి పార్టీ, జేఎల్కేఎం, జేడీయూ పార్టీలు ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజీవాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో ఘన విజయం సాధించి1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ను భారత ఆటగాళ్ల బృందం కలిసింది. ప్రైమ్మినిస్టర్స్ XI జట్టుతో ఈనెల 30 నుండి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలో కాన్ బెర్రాలోని పార్లమెంట్ హౌస్ లో ఆల్బనీస్ తో భారత క్రికెటర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అందరితో ఫొటోలు దిగుతూ ప్రధాని సందడి చేశారు. క్రికెటర్లతో దిగిన ఫొటోలను ఆల్బనీస్ సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. “భారత్ తో ఆడటం ప్రైమ్ మినిస్టర్స్ XIకు పెద్ద ఛాలెంజే. అయితే, ప్రధాని మోడీకి చెప్పినట్లుగా మా వాళ్లు అద్భుతంగా రాణించేలా నేను అండగా ఉంటానని వ్యాఖ్యానించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను భారీ నష్టాలతో ముగించాయి. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అనుసరించనున్న విధానాల సహా అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నేల చూపులు చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ బీఎస్ఈలో 1190 పాయింట్లు లాభపడి 79,043 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 360 పాయింట్లు లాభంతో 23,914 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.49గా కొనసాగుతోంది. సెన్సెక్స్ లో ఎస్.బీ.ఐ సహా అన్ని షేర్లు నష్టాలతో ముగిశాయి.
కర్నూలులో ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. బెంచ్ శాశ్వత భవన నిర్మాణానికి సంవత్సరంన్నర పట్టొచ్చు అని లోకాయుక్త, హెన్ఆర్సీ కార్యాలయాలూ కర్నూలులోనే ఉంటాయన్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వైసీపీ న్యాయరాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని మాత్రమే ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అసెంబ్లీలో ప్రకటనకు ముందే బెంచ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. కర్నూలు నుండి కార్యాలయాల తరలింపు అనేది వైసీపీ దుష్ప్రచారమేనని తెలిపారు.
బంగాళాఖాతంలో నైరుతి దిశలో ఏర్పడిన తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320, పుదుచ్చేరికి 410, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత, ఇది ఉత్తర-వాయువ్య దిశగా పయనించనుంది. నవంబర్ 30న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంట కారైకాల్-మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది.
జనసేన పార్టీలో కీలక నేత నాగబాబుకు పదవిపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఈ మేరకు ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన విడుదలైంది.కాగా ఆ మూడు ఎంపీ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ నడుస్తోంది.ఈ మూడు సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ మూడు పదవుల్లో నాగబాబుకు ఒక పదవి గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది.రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు.అందుకే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ పదవి కోరుతున్నట్లు సమాచారం.ఈ విషయం గురించి ఢిల్లీలో కేంద్ర పెద్దల దగ్గర కూడా ప్రస్తావించారనే మాటలు బయటకు వచ్చాయి.మూడు పదవుల్ని కూటమిలోని మూడు పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా…లేదా టీడీపీ రెండు,జనసేన ఒక పదవి తీసుకుంటుందా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”.ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ దీపికా పిళ్లై కథానాయికగా నటిస్తోంది.అయితే లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సర్కార్,జబర్దస్త్ ఫేం దర్శక ధ్వయం నితిన్, భరత్ తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం నుండి తాజాగా మొదటి సాంగ్ విడుదలైంది.ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సాంగ్ ను మహేష్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. Glad to launch this beautiful melody from #AkkadaAmmayiIkkadaAbbayi All the best to @impradeepmachi , @deepikapilli_ & the entire team. Good luck.#LeLeLeLe song out now.https://t.co/RLrp7qgg3m A wonderful composition by #Radhan and sung by my favourite #UditNarayan Ji.…— Mahesh Babu (@urstrulyMahesh) November 27, 2024
స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “పుష్ప -2” .అయితే ఇంతకుముందు వచ్చిన పుష్ప చిత్రానికి ఈ చిత్రం కొనసాగింపుగా వస్తుంది.ఇందులో రష్మిక కథానాయిక నటిస్తుంది.కీలక పాత్రలో ఫహాద్, సునీల్, అనసూయ లు తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రం శ్రీలీల ఐటమ్ సాంగ్ లో నటించింది.పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.పుష్ప చిత్రానికి అర్జున్‌కు నేషనల్ అవార్డ్ ను కూడా తీసుకువచ్చింది.ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ పుష్ప–2తో థయేటర్లను దద్ధరిల్లించడానికి వచ్చేస్తున్నారు.తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.ఈ సినిమా నిడివి 3: 18గంటలు ఉన్నట్లు సమాచారం.ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.