Author: Indu

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డు నెలకొల్పారు. ప్రస్తుత WTCలో 50 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో భారత బౌలర్‌గా రికార్డులకెక్కారు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా ఘనత వహించారు. అశ్విన్ ఈ WTCలో 62 వికెట్లు పడగొట్టారు. కాగా జడేజా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

Read More

కెన‌డా ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థలో ఎక్కువ మంది హిందువులు భాగ‌స్వామ్యం అయ్యేలా రాజ‌కీయాల్లో వారి ప్రాతినిధ్యం పెర‌గాల‌ని కెన‌డియ‌న్ MP చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. Hindu Heritage Month సంద‌ర్భంగా Parliament Hillలో ఆయ‌న‌ కాషాయ జెండాను ఎగురవేశారు. కెన‌డాలో మూడో అతిపెద్ద మ‌త స‌మూహమైన హిందువులు దేశ వృద్ధికి విశేష కృషి చేస్తున్నార‌ని, అదేవిధంగా రాజ‌కీయాల్లో కూడా క్రీయాశీల‌కంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

Read More

హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం <<14509125>>ఏర్పాటు<<>> చేయాలని TG ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. ఈ వార్తలపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన ‘విగ్రహాల ఏర్పాటు పోటీకి నేను వ్యతిరేకిని. దయచేసి ప్రజాధనాన్ని రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నా’ అని హితవు పలికారు.

Read More

ఈసారి గణతంత్ర వేడుకలకు(2025) ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభొవొ సుబియాంటో చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈనెలాఖరులో బ్రెజిల్‌లో జరగనున్న G-20 సదస్సులో PM మోదీ-సుబియాంటో భేటీకి అధికార వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సందర్భంగా వారు ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. కాగా గతనెలలోనే ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా సుబియాంటో ఎన్నికయ్యారు.

Read More

గత IPL సీజన్‌లో తమ టీమ్ తరఫున ఆడిన ప్లేయర్స్‌లో చాలామందిని మళ్లీ వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని LSG కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపారు. ఎన్నో చర్చలు, జాగ్రత్తల తర్వాతే రిటెన్షన్ లిస్ట్ తయారు చేశామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత ప్రతిభావంతులైన ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూరన్‌తో పాటు రవి బిష్ణోయ్, మయాంక్, మోసిన్ ఖాన్, బదోనీని LSG అట్టిపెట్టుకుంది.

Read More

మహారాష్ట్రలో మరోసారి ‘మహాయుతి’ని అధికారంలోకి తెచ్చేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా PM మోదీ రంగంలోకి దిగనున్నారు. ఈనెల 8-14 మధ్య ఆయన 11 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ‘మహాయుతి’ చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. BJP, శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం), అజిత్ పవార్ నేతృత్వంలోని NCP మహాయుతిగా ఏర్పడి, కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. NOV 20న MH ఎలక్షన్స్ జరుగుతాయి.

Read More

డిజిటల్ అరెస్టుల మోసాలపై తమ ఖాతాదారులకు HDFC కీలక సూచనలు చేసింది. ‘నిజమైన ప్రభుత్వ అధికారులెవరూ ఫోన్లలో బ్యాంకు వివరాలు అడగరు. కాల్ చేసి మీ ఆధార్, పాన్ ఈ-కేవైసీ, బ్యాంక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అడిగినా స్పందించొద్దు. డెబిట్, క్రెడిట్ కార్డుల నంబర్లు, CVV, పిన్, OTPలాంటివి షేర్ చేయొద్దు. మీకు వచ్చే లింకులు, వెబ్‌సైట్ల పేర్లలో తప్పులుంటాయి. వాటిని గమనిస్తే సైబర్ మోసాలను అడ్డుకోవచ్చు’ అని తెలిపింది.

Read More

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

Read More

AP: రిషికొండ నిర్మాణాలు పూర్తయ్యాక అందరినీ అనుమతిస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీనిని దేనికి ఉపయోగించాలో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘అందరితో చర్చించిన తర్వాత దీనిపై ఓ నిర్ణయానికి వస్తాం. అధికారంలో శాశ్వతంగా ఉంటామనే భ్రమలో ఈ ప్యాలెస్ కట్టారు. ఒక్క భవనం కోసం సబ్ స్టేషన్, సెంట్రల్ AC, ఫ్యాన్సీ ఫ్యాన్లు ఎందుకు? పేదలను ఆదుకునేవారు ఇలాంటివి కడతారా?’ అని ప్రశ్నించారు.

Read More

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.

Read More