ఏనుగులు సంచరించే ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఏనుగుల గుంపుల సంచారం, పంట పొలాలను ధ్వంసం చేయడం, ఏనుగుల దాడిలో ఇటీవల ఒక రైతు దుర్మరణంపై సమీక్షించారు. సోమవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు వివరాలు అందించారు. 11 ఏనుగులు (ఇందులో నాలుగు ఏనుగులు పిల్లలు) ఒక గుంపుగా తిరుగుతూ కళ్యాణి డ్యామ్ సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలు తొక్కివేశాయని వివరించారు. డ్రోన్ ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పవన్ ఆదేశించారు. అవి వెళ్ళే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాలవారిని…
Author: admin
అగ్ర నటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీఖన్నాలు హీరోయిన్ లుగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తోన్నఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్, హరీశ్ శంకర్ కాంబో వస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చింది. మూవీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా’ఎక్స్’ లో పోస్టు పెట్టింది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎమోషన్స్, యాక్షన్ లతో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ నబకాంత్ మాస్టర్ పర్యవేక్షణలో షూటింగ్ పూర్తయింది. ఏపీ డిప్యూటీ సీఎంగా…
భారత సైన్యం పహాల్గాం ఉగ్రవాదదాడి కీలక సూత్రధారి సులేమాన్ షా అలియాస్ హాషీమ్ మూసా పనిని మూడు గంటల్లో ముగించింది. కమాండోలు అతడి జాడను పసిగట్టి మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు. రాష్ట్రీయ రైఫిల్స్, పారా కమాండోలు ఉగ్రవాదులను కనిపెట్టి మట్టుబెట్టారు. వారి నుండి అమెరికా తయారీ ఎం4-కార్బైన్, ఏకే-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రైనేడ్స్ భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక… ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదేనని మంత్రి లోకేష్ అన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ఏపీ ప్రభుత్వం… సింగపూర్ సహకారాన్ని కోరుకుంటున్నట్లు వివరించారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో పరిశ్రమదారులకు మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. టువాస్ పోర్టును సందర్శించిను ఏపీ సీఎం చంద్రబాబు బృందం: ఆసియాలోనే రెండో అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కూటమి…
జార్జియాలో జరిగిన ఫిడే చెస్ వరల్డ్ కప్ లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల అమ్మాయి దివ్య దేశ్ ముఖ్ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో కోనేరు హంపి, దివ్య దేశ్ ముఖ్ మధ్య జరిగిన మొదటి రెండు గేములు డ్రాగా ముగిశాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ నిర్వహించారు. టైబ్రేకర్ పోరులో హంపి పరాజయం పాలైంది. దివ్య దేశ్ ముఖ్ విజేతగా నిలిచింది. దీంతో ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఉన్న దివ్య ఈ విజయంతో గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది.
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ ఫీస్ట్ ‘అవతార్’ సిరీస్‌లో పార్ట్-3 ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు. పండోరా గ్రహంపై అగ్ని నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరోసారి తన ప్రపంచం లోకి తీసుకెళ్లనుంది. తాజా గా ఈ ట్రైలర్ ను అవతార్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పంచుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషించిన ‘వరంగ్’ పాత్రను పరిచయం చేశారు, ట్రైలర్ అగ్ని, బూడిద థీమ్‌ను ప్రతిబింబిస్తూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ విజువల్ ఫీస్ట్ ప్రేక్షకులను అలరించనుంది. From…
సింగపూర్ రెండో రోజు పర్యటనలో ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబుతో కలిసి ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సమావేశంలో చర్చించినట్లు లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కోరినట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ఆసక్తి కనబరిచారని తెలిపారు. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు…
టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. రవీంద్ర జడేజా (103*; 185 బంతుల్లో 12 ×4), వాషింగ్టన్ సుందర్ (101*; 206 బంతుల్లో 9 ×4, 1×6) సెంచరీలు చేసి భారత్ ను ఓటమి నుండి తప్పించారు. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (103; 12×4) కూడా సెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ (90; 230బంతుల్లో 8×4) సెంచరీకి చేరువగా వెళ్లాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 358, ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో భారత్ 425/4గా నిలిచింది. మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 10ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ను డ్రాగా ముగించేందుకు రెండు జట్లు అంగీకరించాయి.
ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనలో భాగంగా దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాల్లో ఒకటైన గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించుకున్నారు. మాల్దీవుల పర్యటన పూర్తి చేసుకున్న ప్రధాని నిన్న రాత్రి తమిళనాడు లోని తూతుక్కుడి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. నేడు ఆలయాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి ప్రధాని హారతి ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆది తిరువత్తరై ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.450 కోట్లతో విస్తరించిన కొత్త టెర్మినల్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.4,900 కోట్లతో పూర్తి చేసిన వివిధ రోడ్, రైల్వే మార్గాలను జాతికి అంకితం చేశారు.
నేడు మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజలు దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు: శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందాం. మంత్రి నారా లోకేష్: భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి అబ్దుల్ కలాం గారు. ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగడించారు. శాస్త్రవేత్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. తనదైన వ్యక్తిత్వం, ప్రసంగాలతో…