జార్ఖండ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్ (81) ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శింబు సోరెన్ మరణవార్తను ఆయన కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “గౌరవనీయులైన దిశోమ్ గురు మనందరినీ విడిచి వెళ్లిపోయారు. ఈ రోజు నేను ఒంటరినైపోయానని ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రజలు ఆయనను “దిశోమ్ గురు” అని ప్రేమగా పిలుస్తారు. శిబు సోరెన్, జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. ఆయన మూడుసార్లు సీఎంగా, ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగానూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గిరిజన హక్కుల కోసం, జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన…
Author: admin
రూ.2కే వైద్యం చేసి ఎందరికో సాయం చేసిన ప్రముఖ డాక్టర్ ఎ.కె.రాయరు గోపాల్ (80) శనివారం కన్నుమూశారు. కేరళలోని కన్నూర్ లో 5 దశాబ్దాలపాటు వేల మంది రోగులకు తన సేవలందించి చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. గోపాల్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అందరూ ఆయనను 2 రూపాయల వైద్యుడని పిలిచేవారు. మెడిసిన్స్ కూడా కొనలేని వారికి గోపాలే స్వయంగా మందులు అందించేవారు.
దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఢిల్లీలో నిన్న ఉదయం భారీవర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఉన్న త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వారణాసిలో గంగానది నీటిమట్టం కూడా పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండు నేషనల్ హైవేలతో పాటు 370 రోడ్లను మూసివేశారు. నేడు, రేపు కూడా ఈ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 2 వరకూ కురిసిన వానలకు హిమాచల్ లో 101 మంది మరణించారు. రూ.1,692 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. వెస్ట్ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తీస్తా, జలఢాకా…
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన 5వ టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయానికి చేరువైంది. అద్భుతం జరిగితే మినహా దాదాపుగా భారత్ గెలుపు కష్టమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ గెలుపుకు 35 పరుగుల దూరంలో ఉంది. అంతకు ముందు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులకు ఆలౌటయింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం మినహా ఇస్తే ఇంగ్లాండ్ టార్గెట్ 374 పరుగులుగా ఉంది. యశస్వీ జైశ్వాల్ 118 (164; 14×4, 2×6) సెంచరీతో రాణించాడు. ఆకాష్ దీప్ 66 (94; 12×4), రవీంద్ర జడేజా 53 (77; 5×4), వాషింగ్టన్ సుందర్ 53 (46; 4×4, 4×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ధ్రువ్ జురెల్ (34) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ 5 వికెట్లతో రాణించాడు. అట్కిన్ సన్ 3 వికెట్లు, ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో రెండో…
జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి గడ్కరీ గారిని రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ.85 వేల కోట్లు అడిగాం. ఆయన మనకు రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. గడ్కరీ ఏపీకి ఎంతో చేశారు. ఏపీని సొంత రాష్ట్రంగా భావించి మరిన్ని నిధులు, మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. అమరావతికి 189 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయాలని కోరాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో దేశంలో ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ పురోగతిలో పోషించిన ప్రముఖ పాత్ర, మన ఆంధ్ర ప్రదేశ్ కు అందిస్తున్న తోడ్పాటు గురించి…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తలైవా కెరీర్‌లో 171వ సినిమాగా విశేషంగా నిలవబోతోంది.సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, నాగార్జున,ఉపేంద్ర,సత్యరాజ్,శృతి హాసన్,సౌబిన్ సాహీర్ వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదల కానున్న ఈ మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. https://youtu.be/l8qlUDRSaTU?si=_OTLL42s2rM_xV3q
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’. అభిమానులలోనే కాక సినీ ప్రేక్షకులలో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను మూవీ టీమ్ నేడు విడుదల చేసింది. థమన్ తన మ్యూజిక్ తో మరోసారి అదరగొట్టాడు. అభిమానులను అలరించే విధంగా తన మ్యూజిక్ తో సత్తా చాటాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ మారుమోగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. https://youtu.be/FbXOsVByKmk?si=Ns-T05ViEfDm69cZ
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని నేడు ప్రధాని మోడీ విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని, వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విడతలో భాగంగా సుమారు 9.7 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లు జమ అయ్యాయి. అన్నదాతలకు పంట పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఏటా రూ.6,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. తాజాగా విడుదల చేసిన నిధులతో అన్నదాతలకు వ్యవసాయ పనుల కోసం కీలకమైన పెట్టుబడి…
71వ జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు అభినందనలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు: జాతీయ ఉత్తమ నటులుగా ఎంపిక అయిన షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాసే (12th ఫెయిల్), జాతీయ ఉత్తమ దర్శకుడు సుదీప్తో సేన్ (కేరళ స్టోరీ), జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (వాతి) లకు ప్రత్యేక అభినందనలు. తెలుగు చలన చిత్ర సీమకు సంబంధించి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన భగవంత్ కేసరి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనలు. జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ క్యాటగిరిలో ఎంపిక అయిన హనుమాన్ చిత్ర బృందానికి, జాతీయ ఉత్తమ పాటగా ఎంపిక అయిన ఊరూ పల్లెటూరు (బలగం) గాయనీగాయకులకు, గీత రచయితకు, జాతీయ ఉత్తమ స్క్రీన్‌ప్లే…
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 204-6తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 224 పరుగులకు ఆలౌటయింది. కరుణ్ నాయర్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. , వాషింగ్టన్ సుందర్ (26), యశస్వీ జైశ్వాల్ (2), కే.ఎల్.రాహుల్ (14), శుభ్ మాన్ గిల్ (21), సాయి సుదర్శన్ (38), జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్ సన్ 5 వికెట్లు, టంగ్ 3 వికెట్లు, వోక్స్ 1 వికెట్ తీశారు. ఇక అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. క్రాలీ (64), డకెట్ (43) లు మొదటి వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. హ్యారీ బ్రూక్ (53) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓలి…