Author: admin

71వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను 15 కేటగిరీలలో అవార్డులు ప్రకటించారు. తెలుగు నుంచి ‘భగవంత్ కేసరి’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఉత్తమ తమిళ సినిమాగా ‘పార్కింగ్’, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘ది రే ఆఫ్ హోప్’, ఉత్తమ మలయాళ చిత్రంగా ‘ఉళ్లోజుక్కు’కు పురస్కారాలు దక్కాయి. 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డులు: ఉత్తమ నటుడు: జవాన్ (హిందీ) షారుక్ ఖాన్, 12th ఫెయిల్ (హిందీ) విక్రాంత్ మస్సే ఉత్తమ మ్యూజిక్ దర్శకత్వం; వాతి (తమిళ్) జీవీ ప్రకాశ్ కుమార్ ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్: హర్షవర్ధన్ రామేశ్వర్: బెస్ట్ మేకప్: సామ్ బహూదర్ (హిందీ) శ్రీకాంత్ దేశాయ్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్ (హిందీ) బెస్ట్ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఊర్వశి, వష్ (గుజరాతీ) జానకీ బోడివాలా…

Read More

నేడు జమ్ములమడుగులో సీఎం చంద్రబాబు పర్యటించారు. జమ్మలమడుగు మం. గూడెంచెరువులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గూడెంచెరువులో లబ్ధిదారులు, బంగారు కుటుంబాలతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్ని సీఎం పరిశీలించారు. 1వ తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు. అలివేలమ్మ చిన్నకుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి వారి కుటుంబ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

Read More

భారత్, రష్యా సంబంధాలపై ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించడాన్ని సొంత పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్ విభేదించారు. రాహుల్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు థరూర్ స్పష్టం చేశారు. భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే పతనమయ్యాయని, వాటిని మరింత దిగజార్చుకోనీయండంటూ ఇటీవల ట్రంప్ వ్యాఖ్యాలు చేశారు. ట్రంప్ విమర్శలను శశిథరూర్ కొట్టిపారేశారు. భారత ఆర్థిక స్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ట్రంప్ వ్యాఖ్యాలను రాహుల్ సమర్థించడంపై పార్లమెంట్ బయట మీడియా ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని ట్రంప్ పోస్టు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యాలను రాహుల్ గాంధీ సమర్థించారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ ట్రంప్ నిజం మాట్లాడారని అన్నారు. దీనిపై…

Read More

భారత ఉపరాష్ట్రపతి పదవికి ఇటీవల జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. దీంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఆ ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జగదీప్ ధన్కర్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. 74 ఏళ్ల ధన్కర్ ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ పంపారు. 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్కర్ 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే రెండేళ్ల 344 రోజులకే పదవిని వీడారు. తర్వాత ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. దీనిపై ఆగస్టు 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్లు దాఖలుకు చివరితేదీ ఆగస్టు 21గా ప్రకటించింది.…

Read More

టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈనెలలో అమలు చేయబోతున్న ‘అన్నదాత సుఖీభవ’, ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకాల గురించి మరోసారి వారికి వివరించారు. గతంలో జగన్ రైతులను మోసం చేశారని రైతు భరోసా పేరుతో వంచనచేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానితో కలిపి రూ.20వేలు రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని ఈసందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తమకు కార్యకర్తలే ముఖ్యమని కష్టపడి పని చేసినవారికి త్వరలో పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Read More

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అగ్రిమెంట్ గడువుకు ముందే తమ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధిస్తూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అమెరికా వ్యాపారాలకు అనుకూలంగా ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించే తన తాజా ప్రయత్నంలో భాగంగా దీనిని ఆయ‌న పేర్కొన్నారు. 69 వాణిజ్య భాగస్వాములకు 10 నుంచి 41 శాతం వరకు సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఏడు రోజుల్లో అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఉత్తర్వులో పేర్కొన్నారు. వివిధ దేశాలకు సంబంధించింది వాటి కొత్త టారిఫ్ జాబితా ఆఫ్ఘనిస్థాన్- 15 %, అల్జీరియా- 30 %, అంగోలా- 15 %, బంగ్లాదేశ్- 20 %, బొలీవియా- 15 %,బోస్నియా-హెర్జెగోవినా- 30 %,బోట్స్ వానా- 15 %, బ్రెజిల్- 10 %, బ్రూనై- 25 %, కంబోడియా- 19 %, కామెరూన్- 15 %చాద్‌- 15 %, కోస్టారికా- 15 %, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్-15 %, న్యూజిలాండ్-…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో 4 రోజులపాటు విజయవంతంగా సింగపూర్ లో పర్యటన పూర్తిచేశామని ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఏపీలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్ కు బ్యాడ్ న్యూస్. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన సాగిందని వివరించారు. సింగపూర్ లో తెలుగువారు ఘనస్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ఈ సందర్భంగా వివరించారు.

Read More

భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ (2), కే.ఎల్.రాహుల్ (14), శుభ్ మాన్ గిల్ (21), సాయి సుదర్శన్ (38), జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) పరుగులు చేశారు. ప్రస్తుతం కరుణ్ నాయర్ 52 నాటౌట్, వాషింగ్టన్ సుందర్ 19 నాటౌట్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్ సన్ 2 వికెట్లు, టంగ్ 2 వికెట్లు, వోక్స్ 1 వికెట్ తీశారు.

Read More

జమ్మూ కాశ్మీర్ లో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా దళాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో భారత భద్రతా దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్ లో భాగమైన ముగ్గురు పహాల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఉన్నట్లు తెలిపారు. వాళ్లు లష్కరే తోయిబా కు చెందిన సులేమాన్, అఫ్గాన్, జిబ్రాన్ అని పేర్లు కూడా తెలిపారు. పహాల్గాం అమానుష ఘటనకు సంబంధించిన ముగ్గురు హాతమైనట్లు పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ‘ఆపరేషన్ మహాదేవ్’ ద్వారా వారిని హాతం చేసిన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అలాగే వాళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తమ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ గురించి నేడు పార్లమెంటులో రెండో రోజు జరిగిన చర్చలో ఈ విషయాన్ని వివరించారు.

Read More

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన ప్రళయ్ మిస్సైల్ ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో 28, 29 తేదీల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ మిస్సైల్ మ్యాగ్జిమమ్ పవర్, రేంజిని అంచనా వేసేందుకు యూజర్ ఎల్యువేషన్ ట్రయల్స్‌ను నిర్వహించారు. డీఆర్‌డీఓ ప్రకారం రెండు టెస్టుల్లో మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ ఛేదించింది. అన్ని ప్రమాణాలను ప్రళయ్ అందుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇది వినియోగానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More