Author: admin

హిందువులకు తీర్థయాత్రలలో అమర్నాథ్ యాత్ర అత్యంత విశిష్టమైనది. హిమాలయ శ్రేణుల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివెళతారు. ఈ నెల 2న ప్రారంభమైన ఈ యాత్ర తాజాగా జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో మరోసారి వాయిదా పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాల నుండి కొనసాగుతున్న యాత్రను ఒక రోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షం కారణంగా ట్రెక్కింగ్ మార్గాలు జారడంతోపాటు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో, ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 18న యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరే అమర్నాథ్ యాత్రలను నిలిపివేసినట్టు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సమాచార శాఖ తెలిపింది.వాతావరణ పరిస్థితులను బట్టి రేపు యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.

Read More

అమెరికాలోని అలాస్కా తీరంలో తాజాగా 7.3 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి కాల‌మానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం సాండ్ పాయింట్‌ కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ సంభవించే అవకాశం ఉంద‌ని అలాస్కాలోని పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Read More

ప్రపంచ దేశాలపై మరోసారి రెసిప్రోకల్ టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం టారిఫ్ లు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాలకు సుంకాల రేట్లు తెలియజేస్తూ లేఖలు పంపనున్నట్లు తెలిపారు. 150కిపైగా దేశాలకు నోటీసులు పంపించనున్నామని, అందులోనే సుంకం రేటు పేర్కొంటామని తెలిపారు. ఈ దేశాలన్నింటికీ ఒకే విధంగా సుంకాలు ఉంటాయని అన్నారు. అవన్నీ పెద్ద దేశాలు కాదని, తమతో అంతగా వ్యాపారం చేయవని అన్నారు.

Read More

ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆయుధ సంపత్తిని భారత్ పెంపొందించుకుని దూసుకెళ్తోంది. తాజాగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. నిన్న లడఖ్‌ లో సముద్రమట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో భారత ఆర్మీ గగనతల లక్ష్యాలను ఛేదించే ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ ను అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సీనియర్ అధికారుల సమక్షంలో ఈ ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో భారత సైనిక దళాల వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా మరో కీలక విజయాన్ని సాధించినట్లయింది.ఇక ఇంతకు ముందు ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్ ను ఆ ఆకాశ్ ప్రైమ్ మిసైల్ ఖచ్చితత్వంతో విజయవంతంగా అడ్డుకుని ఎంత సమర్థవంతంగా పని చేస్తుందనేది నిరూపించుకుంది.

Read More

ఇటీవల కాలంలో సౌత్ లో హిందీ భాషపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, అయితే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియంకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు . పేద పిల్లలకు పోటీతత్వాన్ని పెంపొందించేందుకు హిందీని ఒక భాషగా బోధించవచ్చు. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరిగితే విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని అన్నారు. మాతృభాషను తప్పనిసరిగా మొదటి భాషగా ఉంచాలని, రెండవ భాషగా హిందీ లేదా ఇతర భాషలను ఎంచుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవస్థ కొత్త మార్పుకు నాంది పలుకుతుంది. ఇది విద్యార్థులకు బంగారు బాట వేస్తుందని ఆయన అన్నారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం మరింత మద్దతు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పోలవరం ప్రాజెక్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుండి అదనపు నిధుల కోసం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన ఆర్థిక నష్టాలను 16వ ఆర్థిక సంఘం దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

Read More

భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత్ ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. సోఫియా డంక్లీ 83 (92; 9×4), అలైస్ రిచర్డ్స్ (53( హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 2 వికెట్లు, స్నేహ్ రాణా 2 వికెట్లు, శ్రీ చరణి ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనను భారత్ 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. దీప్తి శర్మ (62 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (48) రాణించడంతో భారత్ అలవోకగా విజయం సాధించింది.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాను ఆంధ్రప్రదేశ్, 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అజెండాలో చేర్చింది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాను ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు లక్ష్యాలను నివేదిక రూపంలో సమర్పించింది. సముద్రంలో వృథాగా కలిసే జలాలనే వినియోగిస్తామని వివరించింది.

Read More

కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-26 నుండి ఆరేళ్ల కాలానికి ఈ పథకం 100 జిల్లాలలో ఆమలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ రంగంలో రైతులకు మేలు చేకూర్చే విధంగా పలు అంశాలతో దీనిని తీసుకొచ్చారు. రెన్యువల్ ఎనర్జీ సెక్టార్ లో ఎన్టీపీసీకి రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా బృందానికి అభినందనలు తెలిపింది.

Read More

యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ లు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి నేడు సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. మరో 30 రోజుల్లో ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈమేరకు పోస్టర్ విడుదల చేసింది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ అత్యద్భుతమైన విజువల్స్, నిర్మాణ విలువలతో అంచనాలను మరింత పెంచేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్షన్ ఎపిసోడ్స్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. కియారా అద్వానీ, జాన్ అబ్రహం, షాబిర్ ఆహ్లూవాలియా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఏడాది ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More