Author: admin

టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 669 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో 331 పరుగుల ఆధిక్యాన్ని భారత్ ముందుంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 150 (248; 14×4), బెన్ స్టోక్స్ 141 (198; 11×4, 3×6) భారీ సెంచరీలతో చెలరేగారు. బెన్ డకెట్ 94 (100; 13×4), క్రాలీ 84 (113; 13×4, 1×6), ఓలీ పోప్ 71 (128; 7×4) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కార్సే (47) కూడా పర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు, బుమ్రా2, వాషింగ్టన్ సుందర్ 2, కాంబోజ్, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులతో ఉంది. యశస్వీ జైశ్వాల్ (0), సాయి సుదర్శన్ (0)…

Read More

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. నేటి నుండి 5 రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. అక్కడ సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాను బసచేసే హోటల్ కు చేరుకున్న సీఎం, మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకుచెందిన వారు స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు. హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ లు…

Read More

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, తో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేసిన ఈ మూవీ నుండి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. తిరుపతిలో ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా బ్రదర్ సెంటిమెంట్ ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తీర్ధిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకూ చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. సీతార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. https://youtu.be/xqdXSA8hNI4?si=KQk8WVQT2V3HqfOz

Read More

యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ లు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి నేడు ట్రైలర్ ను విడుదల చేశారు. అత్యద్భుతమైన విజువల్స్, నిర్మాణ విలువలతో వచ్చిన ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. కియారా అద్వానీ, జాన్ అబ్రహం, షాబిర్ ఆహ్లూవాలియా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఏడాది ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. https://youtu.be/CllWVGWhOEs?si=8gRQzw0xam4FPGbi

Read More

టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటయింది. సాయి సుదర్శన్ 61 (151; 7×4), యశస్వీ జైశ్వాల్ 58 (107; 10×4, 1×6), రిషబ్ పంత్ 54 (75; 3×4, 2×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా గాయంతో బాధపడుతున్నా కూడా రిషబ్ పంత్ పోరాడిన తీరు భారత అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా పంత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కే.ఎల్.రాహుల్ (46), శార్థుల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27) పరుగులు చేయడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఈ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా చాటాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, వోక్స్ 1 వికెట్, డాసన్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం రెండో…

Read More

భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. బ్రిటన్ తో కీలక వాణిజ్య ఒప్పందం తరువాత ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదని, అది ఒక ప్యాషన్ అని అన్నారు. క్రికెట్ మాదిరిగా భారత్-బ్రిటన్ దేశాల మధ్య దీర్ఘకాల భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. రెండు దేశాలు విజన్-2035 లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. డిఫెన్స్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎడ్యుకేషన్, సైబర్ సెక్యూరిటీ, ఇతర రంగాల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. 6 బ్రిటన్ వర్సిటీలు భారత్ లో క్యాంపస్ లు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. భారత్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తీవ్రవాదంపై పోరులో రెండు అభిప్రాయాలకు…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని క్షేత్ర స్థాయిలో తీసుకుని వస్తే లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని సీఎం వివరించారు. త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు. క్వాంటమ్ వ్యాలీకి లాగా మనం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో కూడా అందరి కంటే ముందు ఉండాలని సూచించారు. సింగపూర్‌తో సంబంధాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మన చూపించిన…

Read More

బాపట్ల మున్సిపల్ హై స్కూల్‌‌‌లో 24 గదులు, డైనింగ్ హాల్, ల్యాబ్స్‌తో కూడిన మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసిన కృషిలో భాగమైన అందరినీ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. గత ఏడాది డిసెంబర్ 7న మెగా పీటిఎం బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో అత్యంత ఘనంగా నిర్వహించిన సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సీఎం గారి దృష్టికి పాఠశాల సమస్యలు తీసుకొచ్చారని ఆనాడు అదే వేదికపై నుంచి హామీ ఇచ్చిన సీఎం గారు, ఏడాదిలోగా అన్ని వసతులు కల్పించాలని మాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మంచి ఫలితాలు సాధించి బాపట్ల మున్సిపల్ హై స్కూల్ పేరు నిలబెట్టాలని విద్యార్థులు, ఉపాధ్యాయులను కోరారు.

Read More

రాయలసీమకు జీవనాడి హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు శరవేగంగా చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మొదటి ఫేజ్ పూర్తి చేసి మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.ఈసందర్భంగా మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేసే కార్యక్రమంలో కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమేనని పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచడం వల్ల సీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. రికార్డు స్థాయిలో ఈ పనులు పూర్తి చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్ 2 పనులు పూర్తి చేద్దాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నీళ్లిస్తే…

Read More

హిందువులకు తీర్థయాత్రలలో అమర్నాథ్ యాత్ర అత్యంత విశిష్టమైనది. హిమాలయ శ్రేణుల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివెళతారు. ఈ నెల 2న ప్రారంభమైన ఈ యాత్ర తాజాగా జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో మరోసారి వాయిదా పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాల నుండి కొనసాగుతున్న యాత్రను ఒక రోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షం కారణంగా ట్రెక్కింగ్ మార్గాలు జారడంతోపాటు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో, ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 18న యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరే అమర్నాథ్ యాత్రలను నిలిపివేసినట్టు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సమాచార శాఖ తెలిపింది.వాతావరణ పరిస్థితులను బట్టి రేపు యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.

Read More