ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా పోలెండ్ కు చెందిన స్వైటెక్ నిలిచింది. ఫైనల్లో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాపై 6-0, 6-0 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో స్వైటెక్ తొలిసారి వింబుల్డన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. గ్రాండ్లమ్ ఫైనల్స్ లో ఆమె ఇప్పటిదాకా ఎప్పుడూ ఓడిపోలేదు. తాజా గేమ్ లో కూడా తన జోరు కొనసాగించింది.
Author: admin
టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల మొదటి ఇన్నింగ్స్ స్కోర్లు సమమయ్యాయి. మూడో రోజు ఆటలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటయింది. అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులే చేసిన విషయం తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (100) సెంచరీతో అదరగొట్టాడు. లార్డ్స్ లో రెండు సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రిషబ్ పంత్ (74), రవీంద్ర జడేజా (72) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. కరుణ్ నాయర్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు…
ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన, ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినిమాల్లోకి రాక ముందు కోట శ్రీనివాసరావు స్టేబ్ బ్యాంకులో పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. హాస్యం, విలనిజం, ఎమోషన్ ఇలా ఏ విభాగంలోనైనా తనదైన నటనతో మెప్పించారు. తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన (1985), గాయం (1993), తీర్పు (1994), లిటిల్ సోల్జర్స్ (1996), గణేష్ (1998), చిన్న (2000), పృథ్వీ నారాయణ(2002), ఆ నలుగురు (2004), పెళ్లైన కొత్తలో (2006) చిత్రాలకు నంది అవార్డులు…
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. జాతీయస్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖకు లభించింది. వివిధ కేటగిరీల్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపై ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ స్పందించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృషి చేసిన అధికారులు,పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి వరకు ఉచితంగా ఉన్న ట్విట్టర్ బ్లూ టిక్ ఎకౌంట్ లను పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ఈ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తో మన దేశంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నెలకు రూ. 5,130గా ఉన్న ప్రీమియం ప్లస్ సబ్ స్క్రిప్షన్ ధర రూ. 3 వేలకు అందుబాటులోకి రానుంది. రూ. 900గా ఉన్న ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర రూ. 470కి తగ్గనుంది.యాప్ వర్షన్ లో బేసిక్ ప్లాన్ నెలకు రూ. 244గా ఉన్న ధర రూ. 170కి… ప్రీమియం రూ. 650 నుంచి రూ. 427కి… ప్రీమియం ప్లస్ రూ. 3,470…
జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్ గా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. డేటా అనలటిక్స్ ద్వారా పన్నుల విశ్లేషణ ఉండాలన్నారు. డేటా లేక్ ద్వారా అన్ని శాఖల సమాచారం ఒక్క చోటుకే. కేంద్ర- రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నిన్న రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
అగ్ర కధానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. అన్ని షూటింగ్‌లు అయిపోయాయి. ఇప్పుడిక థియేటర్ల వంతు ‘ఓజీ ఆశ్చర్యపరచబోతోందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ కీలక అప్‌డేట్‌ను అందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా పవన్ కల్యాణ్ సరికొత్త, పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈచిత్రం పై ఎంతటి భారీ అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ కు వీరాభిమాని అయినటువంటి దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ కథలో పవన్ కల్యాణ్ ఒక శక్తివంతమైన, ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. పవన్…
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌటయింది. జో రూట్ 104 (109; 10×4) సెంచరీతో రాణించాడు. కార్సే (56), స్మిత్ (51) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. స్టోక్స్ (44), ఓలి పోప్ (44) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో మరోసారి జట్టుకు బలంగా నిలిచాడు. సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. జడేజా 1 వికెట్ తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. జైశ్వాల్ (13), శుభ్ మాన్ గిల్ (16), కరుణ్ నాయర్ (40) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం కే.ఎల్.రాహుల్ (53 బ్యాటింగ్), రిషబ్ పంత్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్…
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో సచివాలయం సమీపంలో అమరావతి ఫస్ట్ సమ్మిట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు జనాభా పెరుగుదల ఆవశ్యకతను వివరించారు. జనాభా భారం కాదని, ఆస్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణ కాదు నిర్వహణ అవసరమని పేర్కొన్నారు. దక్షిణాదిలో జనాభా తగ్గుదల వల్ల నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ సీట్లు కూడా తగ్గుతాయనే చర్చ జరుగుతోందన్నారు. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో 1.8 శాతంగా ఉన్న ఏపీ 2.1 శాతానికి చేరుకోవాలని అన్నారు. వికసిత్ భారత్-2047లక్ష్య సాధనకు జనాభా పెరుగదల ఎంతో కీలకమని చంద్రబాబు అన్నారు. రాబోయే 20 ఏళ్లలో వచ్చే పెనుమార్పులకు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమ్మిళిత వృద్ధే జనాభా పెరుగుదలకు సరైన మార్గమన్న సీఎం జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్, గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్య భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిధిగా హాజరయ్యారు. హిందీ భాష ఆవశ్యకతపై ఆయన ప్రసంగించారు.మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదు, మనం మరింటి బలపడటం.ఇంకొక భాషని అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చెయ్యడం.ఇంగ్లీష్ నేర్చుకోవడం వలనే కదా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏం లేదని పవన్ అన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, దేశంలోని ఇతరత్రా అన్ని భాషలు కావొచ్చు మన మాతృ భాష మీద మనకి గౌరవం ఉంటుంది, మన మాతృ భాష అమ్మైతే మన పెద్దమ్మ భాష హిందీ అని పేర్కొన్నారు.…
