మన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ గౌరవప్రదంగా, స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిందని వాటికి భంగం కలగకుండా అందరూ నడుచుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరులు హాక్కులకు భంగం కలిగించకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని పదాలు, తీవ్రమైన వ్యాఖ్యలను నివారించేలా మార్గదర్శకాలు రూపొందించాలని, అదే సమయంలో భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్రం, పౌరుల ప్రాథమిక విధులకు భంగంకలిగించని విధంగా సమతుల్యతనూ పాటించాలనీ కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణికి స్పష్టం చేసింది. వెన్నెముక కండర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న, చూపులేని దివ్యాంగులను పరిహసించారనే కేసులో ఆరోపణలున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయిదుగురు తాజాగా సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. అభియోగాలకు రెండు వారాల్లోగా సమాధానాలివ్వాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ధర్మాసనం వారిని ఆదేశించింది. తదుపరి విచారణకు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది.…
Author: admin
నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి లోని తన నివాసంలో ఏపీ మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నైపుణ్యం పోర్టల్ ను ఆగష్టు నాటికి పూర్తిచేసి సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓంక్యాప్ ద్వారా కల్పించాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగిన సహాయక మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ 0863-2340678, లేదా వాట్సాప్ నెంబర్ 8500027678 ను సంప్రదించాలి. ఇటీవల థాయ్ ల్యాండ్ లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓంక్యాప్, ఎన్ఆర్ టి ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా వీరిరువురూ భేటీ అయ్యారు. పలు అంశాలను కేంద్ర హోం మంత్రి దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా పలు అంశాలపై ఆయనతో మాట్లాడారు. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ఇటీవల గోవా గవర్నర్ గా నియమించిన నేపథ్యంలో అమితాకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ధ్వంసమైన ఆర్థికవ్యవస్థను కేంద్రం అండతో గాడిలో పెడుతున్నామని అమిత్ షా కు చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మరింత సహకారం అందించాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును రూ.82వేల కోట్లతో ప్రతిపాదించినట్లు తెలిపారు. గోదావరి మిగులు…
భారత మార్కెట్ లోకి అమెరికా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘టెస్లా’ అడుగుపెట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆ కంపెనీ మొదటి షోరూం నేడు ప్రారంభమైంది. బాంద్రా క్లూ కాంప్లెక్స్ లోని మార్కర్ మ్యాక్సిటీ మాల్ లో దీనిని ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సంస్థకు భారత్ లోకి స్వాగతం పలికారు. దేశంలో ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈసందర్భంగా ఈ కంపెనీ ‘మోడల్ వై’ కారును ఆవిష్కరించింది.
భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు మిగిలిన ముగ్గురు ఆస్ట్రోనాట్ లతో కలిసి సురక్షితంగా భూమిని చేరారు.నిన్న వీరు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా తిరుగు పయనమయ్యారు. నేటి మధ్యాహ్నం 3.01 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో వీరి డ్రాగన్ వ్యోమనౌక దిగింది. భూమిని చేరుకున్న వీరిని నాసా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు పంపించనుంది. శుభాంశుతో పాటు ఉన్న పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్ కపులు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. అందుకోసమే వారం రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. 18 రోజుల అంతరిక్ష యాత్రలో శుక్రా బృందం అనేక పరిశోధనలు జరిపింది. భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్…
క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మరో అడుగు పడింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ( APL) సీజన్ – 4… గ్రామీణ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించే వేదికగా నిలిచింది. తాజాగా విశాఖలో జరిగిన వేలంలో అమరావతి రాయల్స్ తరపున కోరుకొండ బుద్ధరాం దుర్గేష్ నాయుడు ఎంపికయ్యారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. దుర్గేష్ కు అభినందనలు తెలిపారు. సింహాచలంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన నాయుడు కెరీర్ లో 4సెంచరీలు, 6 అర్థ సెంచరీలు సాధించి క్రికెట్ లో ప్రతిభ కనబర్చాడు. నాయుడు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఆలాగే మంగళగిరికి చెందిన కేపీ సాయి రాహుల్ కాకినాడ కింగ్స్ తరపున ఎంపిక కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం. సాయి రాహుల్ క్రికెట్ కెరీర్ కు అవసరమైన అన్ని సహాయ,…
భారతీయ నర్సు నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడింది.యెమెన్ అధికారులు శిక్షను వాయిదా వేశారు. తనను వేధిస్తున్న వ్యక్తిని హత్య చేసినందుకు గాను కేరళకు చెందిన ఈ నర్సుకు యెమెన్ అధికారులు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. రేపు ఈ శిక్షను అమలు చేయాల్సి ఉండగా, భారత అధికారులు యెమెన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరణశిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ వర్గాలు తెలిపాయి. నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపేందుకు భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం నిమిష కుటుంబానికి తగిన సాయం అందిస్తోంది. మృతుడి కుటుంబంతో నిమిష ప్రియ కుటుంబం చర్చల కోసం మరింత గడువు కావాలని భారత్ బలంగా కోరింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో మరణశిక్ష అమలు వాయిదా పడింది. నిమిష ప్రియకు అన్ని విధాలా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని…
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఎన్నిసార్లు విన్నా…ఆ కథా నేపథ్యంతో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులకు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్న విషయం తెలిసిందే. రామ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తదితరులు లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘రామాయణ’ పేరుతో ప్రతిష్ఠాత్మకంగా ఇది రూపొందుతోంది. తాజాగా దీని బడ్జెట్ ను నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏకంగా రూ.4000 కోట్లతో దీన్ని నిర్మించనున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇప్పటివరకూ ఇంత భారీ బడ్జెట్ తో భారతీయ సినిమాలు తెరకెక్కలేదన్న నమిత్ ‘రామాయణ’ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమారు రూ.4000 కోట్లతో రూపొందించనున్నాం. ప్రపంచమంతా ఈ ఇతిహాసాన్ని చూడాలన్న లక్ష్యంతోనే దీన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం. తరాలు మారినా, యుగాలు…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు ఉన్నత విద్యను సమూలంగా మార్చే నిర్ణయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి ముందుకొచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమారమంగళం బిర్లాకు ఆయన సోషల్ మీడియా’ఎక్స్’ లో కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ను ఏఐ బేస్డ్ విద్యా విప్లవానికి కేంద్రంగా మార్చే దిశగా గొప్ప ముందడుగని చంద్రబాబు పోస్టు చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. బిట్స్ కొత్త క్యాంపస్ ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమారమంగళం బిర్లా చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో పోస్టు చేశారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ క్యాంపస్ లో 7 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.
ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ముందు హెచ్చరికలు… ఆ తర్వాతే పెనాల్టీలని పేర్కొన్నారు. అనుమానితులపై నిఘా పెట్టాలని సూచించారు. నేరాలను కట్టడి చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సాంకేతికతను అందించడమే కాదు… అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. ఆర్టీజీఎస్ డేటానే అన్ని శాఖలకు ప్రామాణికమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ మార్ట్ పోర్టల్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా వివిధ రకాల డ్రోన్ సేవలను ఏపీ డ్రోన్స్ కార్పోరేషన్ ప్రభుత్వం అందించనుంది . వ్యవసాయం, ఇన్ఫ్రా, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో డ్రోన్ సేవలు దోహాదం చేయనున్నాయి.
