Author: admin

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో జరుగుతున్న మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశంలో పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలిచ్చారు. విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు చెప్పారు. లోకేష్ కూడా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందివిద్యార్థులు-తల్లితండ్రులు- ఉపాధ్యాయులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇలాంటి మీటింగ్స్ జరగటం వలన తల్లిదండ్రులు స్కూలుకి రావడం వల్ల తమ పిల్లలకు అందుతున్న విద్యా విలువలు, మౌలిక సదుపాయాలు తెలుసుకోవడానికి, విద్యార్థి ఎలా చదువుతున్నారు అని వాకబు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఒక రైతు పంటవేశాక ఏ విధంగా అయితే పొలానికి వెళ్లి పంట పరిశీలిస్తూ ఉంటాడో,, అలాగే ఒక తల్లిదండ్రి తమ పిల్లలు చదువుతున్న పాఠశాలకు వెళ్లి..…

Read More

దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు పలు బ్యాంకులు శుభవార్త అందించాయి. సేవింగ్స్ ఎకౌంటులో కనీస నిల్వ మినిమం బ్యాలెన్స్ లేకుంటే విధించే ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలకు కొంత భారం తగ్గనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈనెల జులై 1, 2025 నుండి తమ సాధారణ సేవింగ్స్ ఎకౌంటులకు ఈ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రీమియం ఖాతాలకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే దారిలో ఇండియన్ బ్యాంక్ కూడా జులై 7, 2025 నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కెనరా బ్యాంక్ కూడా ఈ సంవత్సరం మే నెలలో సాధారణ ఎకౌంటులో పాటు ఎన్ఆర్ఐ, శాలరీ ఎకౌంటులపై కూడా…

Read More

విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూ అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అతనిని అభినందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధూ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధూ రూపొందించిన సైకిల్‌ను స్వయంగా నడిపి తన ఆవిష్కరణలను పరిశీలించారు. అతని ఆలోచనలను మెచ్చుకుని భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలి అని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా లక్ష రూపాయలు అందించారు. అంతేకాకుండా సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను స్వయంగా తయారు చేశాడు. ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read More

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ ప్రముఖులు, సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసింది. సినీ నటులు రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఎస్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లూయెన్సర్లను పీఎంఎల్ఎ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ అప్లికేషన్ లకు ప్రచారం చేసిన అంశంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపైనా ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్యామల, బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతాచౌదరి, నయనిపావని, నేహాపఠాన్, సిరి హనుమంతు, పండు, పద్మావతి, ఇమ్రాన్…

Read More

భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్ మాన్ గిల్ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మరింత మెరుగైన ర్యాంకు చేరాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటుతున్న గిల్ కెరీర్ లోనే తొలిసారిగా టాప్-10లోకి దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ జాబితాలో ఏకంగా 15 స్థానాలు మెరుగుపరుచుకుని అతడు 6వ ర్యాంకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ మొదటి రెండు టెస్టుల్లో గిల్ 585 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అందులో మూడు సెంచరీలున్నాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4, వి కీపర్ రిషబ్ పంత్ 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ జాబితాలో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా నెంబర్ వన్ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహితశర్మ 3, విరాట్ కోహ్లి 4, శ్రేయస్ అయ్యర్ 8వ స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్లో కుల్డీప్ యాదవ్ 2,…

Read More

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. జులై తొలివారంలోనే శ్రీశైలం నిండటం శుభపరిణామమని పేర్కొన్నారు. రాయలసీమ రతనాల సీమ కావాలని, రాష్ట్రం సుభిక్షం కావాలని శ్రీశైల మల్లన్నను ప్రార్థించాను. సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రణాళికలు ప్రజలకు వివరించారు. సమర్థ నీటి నిర్వహణతో సాగునీటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నంలో అందరి సహకారం కోరారు. జల హారతి అనంతరం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మంత్రి నిమ్మల రామా నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read More

కోట్లాది మంది ఆకాంక్షలు, ఆశీస్సులతో భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి పయనమయ్యారు. ఫ్లోరిడా లోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో భారత అంతరిక్ష చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా తో పాటు మరో ముగ్గురితో యాక్సియం4 రోదసికి బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం నేటి మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం పలు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నేడు విజయవంతంగా పూర్తయింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్ ను చేపట్టింది. భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), యూరప్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ…

Read More

దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటికి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ‘ది ఎమర్జెన్సీ డైరీస్‌’ పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్నానని పేర్కొన్నారు. అప్పుడు తన ప్రయాణం ఎలా సాగిందో ఈ పుస్తకంలో ఉంటుందని ప్రధాని చెప్పారు.అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, నేను యువ RSS ప్రచారక్‌ని. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం నాకు ఒక అభ్యాస అనుభవం. ఇది మన ప్రజాస్వామ్య చట్రాన్ని కాపాడుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. అదే సమయంలో, రాజకీయ వర్గాల ప్రజల నుండి నేను చాలా నేర్చుకోగలిగాను. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఆ అనుభవాలలో కొన్నింటిని పుస్తకం రూపంలో సంకలనం చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను, దీనికి ముందుమాటను అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమానికి ప్రముఖుడైన శ్రీ HD దేవెగౌడ జీ రాశారని ఆయన…

Read More

స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అన్యాయంగా నిలిచిన ఎమర్జెన్సీకి నేటితో 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెలల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా విధింపజేశారు.1977 మార్చి 21 వరకు ఇది కొనసాగింది. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ప్రజాస్వామ్యవాదుల గృహ నిర్బంధం వంటివి ఈ చీకటి సమయంలో రాజ్యమేలాయి. దేశంలో 21 నెలల పాటు నియంతృత్వ పాలన కొనసాగింది. అంతర్గత అలజడుల పేరుతో ప్రతిపక్ష నేతలను అన్యాయంగా జైలుకు పంపారు.ప్రెస్‌ను నిషేధించారు. ప్రతిపక్ష స్వరం అణిచివేశారు. మౌలిక హక్కులను నిలిపివేశారు.…

Read More

టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో ఎంత బాగా ఆడినప్పటికీ భారత్ కు పరాజయం తప్పలేదు. ఐదో రోజు పూర్తిగా ఆధిపత్యం కనబరిచిన ఇంగ్లాండ్ భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో గెలిచి ఈ సిరీస్ ను విజయం తో ప్రారంభించింది. ఇక ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 6 పరుగుల ఆధిక్యం కలిపి ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 371 పరుగులు కాగా, ఓవర్ నైట్ స్కోరు 21-0తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో డకెట్ 149 (170; 21×4, 1×6) భారీ సెంచరీతో రాణించాడు.క్రాలీ 65 (126; 7×4), జో రూట్ 53 (84; 6×4) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.…

Read More