Author: admin

టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా లండన్‌ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో భారత్ పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇరు జట్లు 387 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకే కుప్పకూలింది. చివరిదైన ఐదో రోజు 58-4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ను కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. బ్యాటింగ్ వైఫల్యమే భారత్ పరాజయానికి కారణం. కే.ఎల్.రాహుల్ (39) అవుటైన తర్వాత మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒక్కడే పోరాడాడు. అతనికి అవతలి ఎండ్ నుండి సహాకారం కొరవడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో…

Read More

స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ ను నెం.1గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను నేడు మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న రూ.1.91 కోట్ల విలువైన రెండు కాంపాక్టర్ వాహనాలు రాష్ట్రంలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్ ను అధికారులు స్వీకరించాలని లోకేష్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Read More

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తా.. గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు.. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌ లను నియమించారు. అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులైన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు హార్షం వ్యక్తం చేశారు. గోవా గవర్నర్‌గా నియమితులైన పి. అశోక్ గజపతి రాజుకు హృదయపూర్వక అభినందనలు. ఇది మన రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమైన క్షణం. ఈ గౌరవాన్ని ఆయనకు అందించినందుకు గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు కేంద్ర మంత్రివర్గానికి ఏపీ సీఎం చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవనీయమైన పదవిలో రాజు గారు విజయవంతంగా మరియు సంతృప్తికరంగా పదవీకాలం కొనసాగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు సోషల్ మీడియా…

Read More

వెస్ట్ ఇండోనేషియాలో నేటి మధ్యాహ్నం 12:49 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. దీని కారణంగా అనేక నివాసాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వారు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ లు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలోనే 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్‌’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్‌లో ఉంది. ఇండోనేసియాలో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వస్తుంటాయి.

Read More

అమరావతి లోని సచివాలయంలో ఏపీ హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. అరకును కాఫీ బ్రాండ్ గా తీర్చిదిద్దుతూన్నట్లు చెప్పారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతాలు గంజాయికి హాబ్ గా ఉండేవని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకు అంటే కాఫీ అని గుర్తుకు వచ్చేలా మార్పు తీసుకొస్తున్న టాగ్లు పేర్కొన్నారు. పార్లమెంటు వంటి ప్రదేశాల్లో కూడా అరకు కాఫీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. గంజాయిపై ఈగల్ టీమ్ ఉక్కు పాదం మోపుతుందన్నారు. సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ టీమ్ కలిసి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Read More

భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్ లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ తో సమావేశమై రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ (SCO) అధ్యక్ష పదవికి చైనాకు భారత మద్దతును ఈసందర్భంగా తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ బీజింగ్ ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కైలాస మానససరోవర్ యాత్రను పునఃప్రారంభించినందుకు భారత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఐదేళ్ల అనంతరం అటానమస్ రీజియన్ షిజాంగ్ (టిబెట్)లో ఉన్న మాపవ్ యున్ సో (మానససరోవర్ సరస్సు)కు భారత యాత్రికులు చేరుకోవడంపై హార్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థలు, పొరుగు దేశాలుగా భారత్-చైనా మధ్య అభిప్రాయాలు, దృక్పథాలపై చర్చలు అవసరమని పేర్కొన్నారు. ఇటీవల…

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. 5 సంవత్సరాల పాటు ఇది అమలులో ఉండే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. స్పేస్ పాలసీ అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. స్పేస్ ప్రాజెక్టుల విషయంలో ఇన్వెస్టర్లకు ఈ కార్పొరేషన్ సాయం చేస్తుందని తెలిపింది. మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలని దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని కార్పొరేషన్ కు నిర్దేశించింది. శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని వివరించింది.

Read More

సీనియర్ నటి, పద్మభూషణ్ గ్రహీత బి. సరోజాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. బెంగళూరులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో ఆమె నటించారు. దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో పలు సినిమాల్లో నటించారు. 1942 లో కర్ణాటకలో జన్మించారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ కన్నడ సినిమాలతో అభిమానులను అలరించారు. ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘పెళ్లిసందడి’ (1959)లో తెలుగులో తెరంగేట్రం చేశారు. దీనికంటే ముందు పాండురంగ మహత్యం, భూకైలాస్ ముందుగా విడుదలై గుర్తింపునిచ్చాయి. సీతారామ కల్యాణం (1961), జగదేకవీరునిజగదేకవీరుని కథ, శ్రీకష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు , దానవీర శూర కర్ణ , అల్లుడు దిద్దిన కాపురం వంటి తదితర చిత్రాల్లో నటించారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను ప్రభుత్వం…

Read More

టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌటయింది. జో రూట్ (40), బెన్ స్టోక్స్ (33), హ్యారీ బ్రూక్ (23), క్రాలీ (22) పరుగులు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు కట్టడి చేశారు. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో రాణించాడు. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా తలో వికెట్ చొప్పున పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ ల్లో ఇరు జట్ల స్కోర్లు సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారత విజయ లక్ష్యం 193 పరుగులుగా ఉంది. ఇక రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ (0), కరుణ్ నాయర్ (14),…

Read More

ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ టైటిల్ ను ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినర్ కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ ఆధిపత్యానికి తెరదించుతూ తనదైన ఆటతీరుతో అదరగొట్టేసిన ప్రపంచ నెంబర్ వన్ సినర్ ఈ టోర్నీలో కొత్త ఛాంపియన్ గా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ సినర్ 4-6, 6-4, 6-4, 6-4తో రెండోసీడ్ అల్కరాస్ పై విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కార్లోస్ అల్కరాస్-యానిక్ సినర్ లు హోరాహోరీగా పోరాడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మాత్రం సినర్ దూకుడు ముందు అల్కరాస్ పోరాటం సరిపోలేదు. దీంతో ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో హ్యాట్రిక్ సాధించాలనుకున్న స్పెయిన్ స్టార్ పై పూర్తి ఆధిపత్యం చాటుకుంటూ గ్రాస్ కోర్టులో యానిక్ సినర్ అదిరే విజయంతో వింబుల్డన్ టైటిల్ గెలిచాడు . గత రెండేళ్లలో అల్కరాస్ పై సినర్ కు ఇదే తొలి విజయం. అతడికిది నాలుగో గ్రాండ్ స్లామ్…

Read More