Author: admin

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్ సంగ్ భారత్ లో ల్యాప్ టాప్ తయారీ ప్రారంభించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఈ ప్రొడక్షన్ మొదలైంది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లను కంపెనీ తయారు చేస్తోంది. ల్యాప్ టాప్ కూడా తయారు చేయడంతో భారత్ లో తమ తయారీ సామర్ధ్యాన్ని విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, శామ్ సంగ్ సౌత్ వెస్ట్ ఆసియా అధ్యక్షుడు జేబీ పార్క్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్పీ చున్ తాజాగా సమావేశమైన విషయం తెలిసిందే. భారత్ లో టాలెంట్, ఇన్నోవేషన్ ఆధారంగా శామ్ సంగ్ అధునాతన టెక్ ప్రొడక్ట్ లను తయారు చేస్తుందని ఈ మీటింగ్ తర్వాత పార్క్ చెప్పారు. భారత్ లో ల్యాప్ టాప్ తయారీకి సన్నాహాలు మొదలయ్యాయని ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ఎలక్ట్రానిక్స్ విభాగం అధ్యక్షుడు టీఎం రోహ్ ప్రకటించారు.

Read More

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ధారాళంగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా పరిస్థితులకు తగ్గట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి అనగాని అధికారులను ఆదేశించారు. రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం గమనిస్తూ, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ప్రజల ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ప్రభుత్వం…

Read More

ఆంధ్రప్రదేశ్ మానవాభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించారు. ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని, ఇందుకు సహకారం కావాలని కోరినట్లు లోకేష్ తెలిపారు.

Read More

విలక్షణ నటుడు సత్య దేవ్ ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్నారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర లు నిర్మిస్తున్నారు. తాజాగా దీని టీజర్ ను టాప్ డైరెక్టర్ రాజమౌళి విడుదల చేశారు. ‘అనుమానం అనే భూతం పట్టిందంటూ..’ అంటూ ఆసక్తికరమైన డైలాగుతో ఈ వీడియో ప్రారంభమైంది. ఒక డిఫరెంట్ నేపథ్యం ఉన్న కథతో దీన్ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. వచ్చే వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. https://youtu.be/IEzfl28GEy4?si=wA-chQQNmEFPo_VW

Read More

జగధీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నిక జరుగనుంది. కాగా, ఈ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయనున్న అభ్యర్థిని ఎన్డీయే ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన C.P. రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేయబోతున్నట్లు కేంద్రమంత్రి జితన్ రామ్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌ గా ఉన్నారు. గతంలో రెండు సార్లు బీజేపీ తరపున పోటీ చేసి కోయంబత్తూరు ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరి 18 నుండి జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

Read More

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘OG’. అభిమానులలోనే కాక సినీ ప్రేక్షకులలో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలై ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. కణ్మణీ అనే పాత్రలో ఆమె పవన్ సరసన కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. Every storm needs its calm. Meet KANMANI – @PriyankaaMohan ❤️Very soon, let’s all meet with the soulful second single promo…#OG #TheyCallHimOG…

Read More

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లో మధ్య అలాస్కాలో జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ఉక్రెయిన్‌ తో యుద్ధ విరమణకు ఒప్పందం కుదరలేదని, కానీ పుతిన్‌తో జరిగిన చర్చల్లో పురోగతి ఉందని ట్రంప్ ఈ సమావేశం తర్వాత చెప్పారు. ఇరువురు నేతలు అలాస్కా నుంచి తిరిగి వెళ్లిపోయారు.అలాస్కాలో ట్రంప్, పుతిన్ మధ్య సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. మీడియా సమావేశంలో ఇద్దరు నేతలు సమావేశం వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. పురోగతి ఉందని పేర్కొన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు.…

Read More

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. భగవద్గీతతో మానవాళికి ధర్మ మార్గనిర్దేశనం చేసిన పరమాత్ముడు శ్రీకృష్ణుడు. ధర్మ పరిరక్షణ, కర్తవ్య నిర్వహణలో ఆయన బోధనలు ఎప్పటికీ అనుసరణీయం. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు మీ ఇంటిల్లిపాదికీ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

Read More

ఏపీలో స్త్రీ శక్తి- ఉచిత బస్సు ప్రయాణ పథకం నేడు ప్రారంభమైంది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మహిళలతో కలిసి బస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ లు ప్రయాణించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరూ 5 కేటగిరీ బస్సులలో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్ర మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి మహిళల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Read More

ఈరోజు 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను చాటుతూ రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సమంగా ముందుకు సాగుతుంది, ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల మాతృ మూర్తులకు 8,745 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. దీపం2 పథకం కింద ఇప్పటికీ 2 విడతలుగా కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 ఏళ్ళలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వివరించారు. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా…

Read More