మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలిచింది. నేడు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ లో 9 వికెట్ల తేడాతో గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటయింది. మైకే వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్. జెమ్మా బోథా (16), ఫే కౌలింగ్ (15), కరాబో మెసో (10) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3 వికెట్లు, వైష్ణవి శర్మ 2 వికెట్లు, ఆయుషీ శుక్లా 2 వికెట్లు, పరూనికా సిసోడియా 2 వికెట్లు, శుభమ్ షకీల్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ గొంగడి త్రిష 44 నాటౌట్ (33; 8×4), సానికా 26 నాటౌట్ (22;…
Author: admin
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాస్త్రవేత్తలు 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఇది 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2032 డిసెంబర్ 22న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం కేవలం ఒక్క శాతం మాత్రమేనని, 99 శాతం దాని ప్రభావం భూమిపై ఉండదని వారు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న నాసాకు చెందిన ఆస్టరాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ కనుగొంది. అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ (ఐఏసీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ భారీ ఆస్టరాయిడ్ భూమివైపు దూసుకువస్తోందని, దీని పరిమాణం సుమారు ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని భావిస్తున్నారు. 130 – 300 అడుగుల పొడవు గల ఈ గ్రహశకలం మానవాళి మొత్తానికి తక్కువ ప్రమాదకారి అయినా ఒక పెద్ద నగరాన్ని తీవ్రంగా నాశనం చేయగల…
నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో పర్యటించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 5.50 గంటలకు 1 జన్ పథ్ నివాసానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
బీహార్‌కి ‘ఫుల్’, ఏపీకి ‘నిల్’. ఇది భారత్ బడ్జెట్ కాదు. బీహార్ ఎన్నికల బడ్జెట్ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆవిడ ఈమేరకు స్పందించారు. NDA భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలు ఉన్న బీహార్ సీఎం నితీష్ బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు గారికి మోడీ గారు చిప్ప చేతిలో పెట్టారని దుయ్యబట్టారు . బీహార్‌ను అందలం ఎక్కించి, ఆంధ్రకు గుండు సున్నా ఇచ్చారని ఆక్షేపించారు . కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. ఏపీ ప్రజల మద్దతుతో గద్దెనెక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు . బడ్జెట్‌లో ఈ సారి కూడా హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. రాజధాని అమరావతికి గతంలో ఇచ్చిన రుణం తప్పా.. ఇప్పుడు రూపాయి సహాయం లేదు. పోలవరం అంచనాలకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులలో టికెట్లను కూడా వీటి ద్వారా పొందవచ్చు. వాట్సాప్ లో బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులకు వాట్సాప్ బుకింగ్ కు అవకాశం కల్పించినట్లు తెలిపింది. దీనిపై క్షేత్ర స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల డిపో అధికారులకు, మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. 9552300009 అనే నెంబరు ద్వారా ఏపీ ప్రభుత్వం వివిధ సేవలను అందిస్తోంది.
సంక్షేమం – సంస్కరణలు సమపాళ్ళుగా, వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వ్యవసాయ, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్ & టెక్నాలజీ, ఔషద, విమానయాన, మౌలిక రంగాల్లో సమూల మార్పులు చేస్తూ పేదరికం తగ్గించే దిశగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా బడ్జెట్ రూపొందించినందుకు ఆర్థిక మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ఆదాయ పన్ను మినహాయింపు 12 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటగా నిలిచింది. ఒకేసారి 5 లక్షల పన్ను మినహాయింపు చేస్తూ 7 లక్షల నుండి 12 లక్షలకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు.అమరావతి, పోలవరం, జల్…
గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా, సస్పెన్షన్ కాలాన్ని కూడా ఇన్ సర్వీస్ కింద పరిగణించనున్నట్లు, సస్పెన్షన్ కాలానికి వేతనం, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తామని కొన్నిరోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా, ఆయనకు నియామకం కూడా ఇచ్చింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవిలో ఏబీ వెంకటేశ్వరరావు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఎన్డీయే కూటమి వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వంలో మొదటి ఏడాది పూర్తి బడ్జెట్ నేడు ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ 2025-26 పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రపంచంలో అనిశ్చితి పరిస్థితుల మధ్య మన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం ఒక నమూనా మార్పు అవసరం ఉందని కానీ ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు కరువయ్యాయని ఆక్షేపించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మందకొడిగా సాగాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం ఒడిదుడుకుల్లో కదలాడి చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 5 పాయింట్లు లాభపడి 77,505 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ పాయింట్ల నష్టంతో 23,482 వద్ద ముగిసింది. జొమాటో, ఐటీసీ హోటల్స్, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎంఅండ్రం, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ఫన్సర్వ్, బజాజ్ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
ప్రముఖ వ్యోమగామి భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామిగా సరికొత్త చరిత్ర లిఖించారు. ఇప్పటివరకు ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్వాక్లో పాల్గొన్నారు. సునీత మరియు బుచ్ విల్ మోర్ అనే మరో వ్యోమగామి గతేడాది జూన్ లో 8 రోజుల అంతరిక్ష యానం కోసం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్) కు వెళ్లారు. అయితే స్పేస్ షిప్ లో సాంకేతిక సమస్య కారణంగా వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. జనవరి30న ఐఎస్ఎస్ బయటకు వచ్చిన వీరిద్దరూ 5 గంటల 26 నిమిషాల పాటు కొన్ని మరమ్మతులు నిర్వహించారు. సునీతకు ఇది 9వ స్పేస్ వాక్ కాగా బుచ్ విల్ మోర్ కు ద5వ స్పేస్ వాక్. మొత్తంమీద 62 గంటల 6 నిమిషాల పాటు సునీత స్పేస్ వాక్‌లో పాల్గొన్నారు. దీంతో నాసా మహిళా వ్యోమగామి పెగ్గీ…
