Author: admin

నేడు కేంద్ర వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ పర్యాయం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దేశ చరిత్రలోనే మొదటి సారి బడ్జెట్ రూ.50 లక్షల కోట్లను దాటడం విశేషం. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర వార్షిక బడ్జెట్ రూ.50,65,345 కోట్లు అని నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా వెల్లడించారు. రెవెన్యూ లోటు రూ.5.23 లక్షల కోట్లు. ద్రవ్యలోటు రూ.15.68 లక్షల కోట్లు. 2025-26లో మూలధన వ్యయం రూ.11.2 లక్షల కోట్లు. మ్యాక్రో ట్యాక్స్ రాబడి రూ.42.7 లక్షల కోట్లు. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ.10.82 లక్షల కోట్లు. జీఎస్టీ సెస్ వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు, ఎక్సైజ్ ట్యాక్స్ వసూళ్లు రూ.3.17 లక్షల కోట్లు.

Read More

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదొవసారి కేంద్ర బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టారు.కాగా ఈ బడ్జెట్ లో కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు,ఎగుమతి,దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలు ప్రభావితం కానున్నాయి.దీనితో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్నింటి ధ‌ర‌లు తగ్గుతాయి. వాటి వివరాలు ధరలు తగ్గేవి:- 1.క్యాన్సర్, అరుదైన వ్యాధుల‌ మందులు 2.ప్రాణాలను రక్షించే మందులు 3.ఫ్రోజెన్ చేపలు 4.భారతదేశంలో తయారైన దుస్తులు 5.మొబైల్ ఫోన్లు 6.వైద్య పరికరాలు 7.ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు 8.ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు 9.చేపల పేస్ట్ 10.తోలు వస్తువులు 11.క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు 12. కీలకమైన ఖనిజాలు 13.ఓపెన్ సెల్ ధరలు పెరిగేవి.. 1.సిగరెట్లు 2.ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే

Read More

పంచాయతీరాజ్ శాఖ, రూ. 104.25 కోట్ల వ్యయంతో కొత్తగా 417 గ్రామ పంచాయతీ కార్యాలయాలను, కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుతో నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో 200 పంచాయతీలు ఇప్పటివరకు పంచాయతీ కార్యాలయాలు లేని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అలాగే పంచాయతీలలో వేగంగా గ్రామాల్లో సేవలు అందించేలా 1,422 నూతన కంప్యూటర్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 46.137 కోట్ల నిధులు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ. మిగతా 60% నిధులు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపింది.

Read More

డీఎస్సీ భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త అందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచే సమయానికి టీచర్ నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని వివరించారు. ఇక ఈ నిర్ణయంతో మార్చి 2025లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతానికి పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ పార్టీ తెలిపింది.

Read More

తమిళ అగ్ర నటుడు అజిత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘విడాముయార్చి’.ఈ చిత్రాన్ని తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.కాగా ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ మేరకు నిన్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్‌ లభించింది. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ ‘అద్భుతమైన కథ, కథనాలతో పాటు అత్యున్నత సాంకేతిక విలువలతో ఈచిత్రం తెరకెక్కించమని చెప్పారు.అజిత్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకునే సినిమా ఇది అని అన్నారు.తెలంగాణ, ఏపీలో ఏషియన్‌ సురేష్‌ ఎంటైర్టెన్మెంట్స్‌, సీడెడ్‌లో శ్రీలక్ష్మీ మూవీస్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇందులో త్రిష, రెజీనా కసండ్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుథ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. https://youtu.be/upA4QCsrAKE?si=fncisqE_0lqkOjdf

Read More

అక్కినేని నాగ చైతన్య ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన తాజా చిత్రం “తండేల్”.ఈ చిత్రంలో నాగచైతన్య కు జోడిగా సాయి ప‌ల్ల‌వి క‌థ‌నాయిక‌గా నటిస్తుంది.చందు మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.కాగా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర‌వింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 07న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ మేరకు చిత్ర‌బృందం వ‌రుస ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తుంది. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుఈరోజు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌బోతుంది.ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రుకాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది.ఈ సందర్భంగా చిత్రబృందం ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది.ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాకతో అభిమానుల‌కు అనుమతి లేద‌ని తెలిపింది.సినిమా బృందం త‌ప్ప బ‌య‌టి వారు ఎవ‌రు ఈ సినిమా వేడ‌క‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోబోతున్న‌ట్లు స‌మాచారం.పుష్ప-2 విడుదల స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.

Read More

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ చిత్రాల చిత్రీకరణలో .. మరోవైపు ‘కల్కి 2’,‘స్పిరిట్‌’ చిత్రాల కథా చర్చలతో బిజీగా ఉన్నారు.ఒకే సమయంలో 3-4 భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభాస్ పనిచేస్తున్నారు.తాజాగా ప్రభాస్‌ ‘ఫౌజీ’ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారని సమాచారం.ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్‌ వార్‌ అండ్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుందని సమాచారం.అయితే ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ప్రభాస్‌తోపాటు మిగిలిన నటి-నటులు అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. బ్రిటీష్‌ కాలంనాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.ఇందులో విభిన్న కోణాలతో ఆయన పాత్ర సాగుతుందని సమాచారం.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

Read More

తమిళ హీరో ధనుష్‌ నటుడిగా,గాయకుడిగా,పాటల రచయితగా,నిర్మాతగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు.ఆయన దర్శకత్వంలో ఇంతకూ ముందు పా పాండి, రాయన్‌ చిత్రాలు వచ్చాయి.తాజాగా ధనుష్ దర్శకత్వంలో రానున్న మూడవ సినిమా ‘నిలవక్కు ఎన్‌ మేల్‌ ఎన్నాడి కోబమ్‌’.ఈ సినిమా ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’ పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు.ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటైర్టెనర్‌ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నామని చిత్రబృందం తెలిపింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘గోల్డెన్‌ స్పారో..’ సాంగ్‌ అక్కడి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది.ఈ పాటలో ప్రియాంక మోహన్‌ లుక్స్‌, స్టెప్స్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి.ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ఇందులో పవీష్‌, అనిఖా సురేంద్రన్‌, ప్రియాప్రకాష్‌ వారియర్‌, మాథ్యూ థామస్‌, వెంకటేష్‌ మీనన్‌, రబియా ఖాటూన్‌, రమ్య రంగనాథన్‌ ప్రధాన…

Read More

వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో పెట్టబోతున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.భారతీయ న్యాయ సంహిత్‌ చట్టం స్ఫూర్తితో ఆదాయపు పన్నుకు చట్టం తీసుకొస్తామని ప్రకటించారు.ఆదాయపు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామని చెప్పారు.బిల్లులో సులభతర విధానం తీసుకురానున్నామని అన్నారు.

Read More

బడ్జెట్ -2025 ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.ఈ మీకు వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.కాగా రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కల్పించింది.అయితే పార్లమెంటులో బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ప్రకటన చేశారు.అలాగే శ్లాబులను కూడా తగ్గించామని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు.రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు.రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.70 వేల వరకు లబ్ధి చేకూరనుంది.అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.1.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.అయితే టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్లను కూడా కేంద్రం భారీగా…

Read More