Author: admin

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీ.బీ.ఎస్.ఈ) 10, 12 తరగతి ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈనెల 15 నుండి ప్రారంభం కానున్న ఈ ఎగ్జామ్స్ కార్డ్స్ ను అందుబాటులోకి తెచ్చారు. సీ.బీ.ఎస్.ఈ అధికారిక వెబ్సైట్ నుండి విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు 44 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ కు హాజరయ్యే అవకాశం ఉంది. సీ.బీ.ఎస్.ఈ పదో తరగతి ఎగ్జామ్స్ ఈనెల 15న ప్రారంభమై మార్చి 18న ముగియనుండగా…12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు వారి వారి స్కూల్స్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థుల ఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా వీటిని పొందొచ్చు.

Read More

‘కన్నప్ప’ చిత్రంలో రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో రెబెల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నాడు.తాజా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ పరమ శివ భక్తుడిగా,ఒక సన్యాసి గెటప్ లో చేతిలో పొడవైన దండాన్ని పట్టుకొని కనిపించారు.పొడవాటి జుట్టు,నుదిటిన శివ నామాలు పెట్టుకొని,మెడలో పెద్ద రుద్రాక్ష మాల ధరించి డివైన్ లుక్ లో కనిపించాడు.అయితే చిత్ర నేపథ్యానికి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ లో మహా శివుడి ప్రతిరూపాన్ని మనం చూడొచ్చు.’ప్రళయ కాల రుద్రుడు..త్రికాల మార్గదర్శకుడు..శివాజ్ఞ పరిపాలకుడు” అంటూ ప్రభాస్ పాత్ర స్వభావాన్ని ఈ పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రబృందం.ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.ఇప్పటివరకు ఎప్పుడు చూడని సరికొత్త లుక్ లో కనిపించి డార్లింగ్ అభిమానులను సర్ప్రైజ్ చేసాడని చెప్పాలి. ఈ చిత్రంలో కన్నప్పగా మంచి విష్ణు నటిస్తున్నాడు.మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్‌ హీరోయిన్ గా నటిస్తుంది.శివ పార్వతులుగా అక్షయ్ కుమార్,…

Read More

భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భారత స్పిన్న‌ర్‌గా నిలిచాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఈ 33 ఏళ్ల భార‌త స్పిన్న‌ర్ 14 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఒక టీ20 సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ 15 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2021లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ స్పిన్న‌ర్ ఇష్ సోధీ 13 వికెట్లు పడగొట్టగా ఇప్పుడు అతనిని వరుణ్ చక్రవర్తి అధిగమించాడు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.

Read More

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. హోం శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన అంశాలపై చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More

ఓ కేసులో భాగంగా కోర్టు విచారణకు గైర్హాజరైనందుకు పతంజలి ఆయుర్వేద కంపెనీ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణకు కేరళ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేసింది.ఈ మేరకు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు జారీ చేశారని ఆరోపిస్తూ…పతంజలి ఆయుర్వేదకు చెందిన దివ్య ఫార్మసీపై కేరళ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కేసు దాఖలు చేశారు.అయితే ఈ నెల 1తేదీన ఇద్దరు కోర్టుకు హాజరు కావాలని పాలక్కాడ్‌ జిల్లా కోర్టు ఇంతకుముందే ఆదేశాలు జారీచేసింది.అయితే బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ కోర్టుకు హాజరు అవ్వకపోవడంతో ఫిబ్రవరి 15న వారిని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.

Read More

గత శనివారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో లోక్‌సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.లోక్‌సభకు కేటాయించిన నిధుల్లో 558.81 కోట్లను లోక్‌సభ సచివాలయానికి,338.79 కోట్లు సభ్యుల కోసం ఇచ్చారు.ఈ కేటాయింపుల్లోనే సన్‌సద్‌ టీవీకి కేటాయించిన నిధులూ ఉన్నాయని తెలుస్తుంది. రాజ్యసభకు ప్రకటించిన 413 కోట్లలో 2.52 కోట్లు చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్ల అలవెన్స్‌లు, జీతాల కోసం కేటాయించారు.వేరుగా కేటాయించిన రూ.3 కోట్లను రాజ్యసభ విపక్ష నేత జీతాలు, అలవెన్స్‌లు, సచివాలయ నిర్వహణకు, రూ.98.84 కోట్లను సభ్యులకు కేటాయించారు.లోక్‌సభ విషయానికొస్తే 1.56 కోట్లను స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్ల జీతాలు, అలవెన్స్‌ల కోసం కేటాయించినట్లు తెలుస్తుంది.

Read More

తన ఇల్లుని క్లీన్ చేస్తున్న యజమాని ఓ షాకింగ్‌ న్యూస్ తెలిసింది.ఈ మేరకు తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్సులో నివసిస్తున్న ఓ వ్యక్తికి తన ఇంటి బేస్‌మెంట్‌లోనే ఆ ఇంటి పాత యజమాని గత 7 ఏళ్లుగా రహస్యంగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది.మెట్ల వెనుక అమర్చిన రహస్య తలుపు నుండి బేస్‌మెంట్‌ లోపలకు వెళితే అక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటి వాతావరణం కనిపించిందని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక పేర్కొంది. విధంగా వెంటిలేషన్‌ ఉందని,అంతేగాక ఓ చిన్న బార్‌ సెటప్‌ కూడా ఉందని పత్రిక తెలిపింది.అయితే ఈ గదిలోకి ఇటీవలే వచ్చి వెళ్లిన ఆనవాళ్లు కూడా అతనికి కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆ ఇంటి యజమాని లీ వెంటనే పాత యజమానికి ఫోన్‌ చేశాడు. ఈ ఇంటిని విక్రయించినపుడు తనకు బేస్‌మెంట్‌లో ఉన్న రహస్య గది గురించి ఎందుకు చెప్పలేదని లీ పాత యజమాని ఝాంగ్‌ అనే…

Read More

హిందూపురం మున్సిపాలిటీని తెలుగు దేశం పార్టీ దక్కించుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికయ్యారు. 23 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. 40 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్ లో 23 టీడీపీ అభ్యర్థికి 14 వైసీపీ అభ్యర్థికి పడ్డాయి. ముగ్గురు సభ్యులు హాజరు కాలేదు. ఇక నెల్లూరులో డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి తహాసీన్ ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మున్సిపల్ వైస్ చైర్మన్ గా టీడీపీ మద్దతుదారులు ఎన్నికయ్యారు. తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామలలో ఎన్నిక వాయిదా పడింది. సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఈమేరకు అధికారులు ప్రకటించారు. ఏలూరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ సభ్యులు ఎన్నికయ్యారు.

Read More

దేశంలో మొదటి కుత్రిమ మేధస్సు (ఏఐ) విశ్వవిద్యాలయాని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది.కాగా ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైనట్టు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్‌ షేలర్‌ తెలిపారు.అయితే మహారాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్‌ ఇండియా, మహీంద్రా గ్రూప్‌, ఎల్‌అండ్‌టీ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్‌ గాంధీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమిషన్‌, డాటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిపుణులు సభ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు.ఈ మేరకు ఇప్పటికే 2 సార్లు భేటీ అయినా ఈ కమిటీ.. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తుది రోడ్‌మ్యాప్‌ను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

Read More

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు అనంతరం ఈరోజు ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.బడ్జెట్‌ సమర్పించిన అనంతరం ఉభయసభలు ఈరోజుకి వాయిదా పడ్డాయి.ఈ మేరకు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి.సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది.ఈ సందర్భంగా లోక్‌సభలో గందరగోళం నెలకొంది. కాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇటీవలే తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటనపై చర్చించాలని విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టాయి.వెల్‌లోకి వచ్చిన విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.దీనితో సభలో గందరగోళం నెలకొంది.మృతుల జాబితాను విడుదల చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు.అయితే సభలో ఎంపీల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభను సజావుగా నడిపేందుకు ప్రతిపక్షాలు ఇష్టపడటం లేదంటూ మండిపడ్డారు.

Read More